Telugu News » Tag » Dubbaka by polls
దుబ్బాకలో ఓడిపోయాక తెరాసకు ఓటమి భారంతో పాటు మరొక చిక్కు కూడ వచ్చి పడింది. ఎన్నికల ప్రచారంలో తెరాస తరపున హరీష్ రావు భారీ హామీలను ఇచ్చారు. కానీ ఎన్నికల్లో ఓడిపోయారు. మామూలు ఎన్నికల్లో అయితే ఓడిపోతే తమకెందుకులే అని తప్పించుకునే వీలుండేది. కానీ నిన్నమొన్నటి వరకు అడ్డాగా పెత్తనం తెరాసదే. మిగిలి ఉన్న రెండేళ్ల పదవీ కాలానికి మాత్రమే ఉపఎన్నికలు జరిగాయి. పైన అధికారం ఎలాగూ తెరాసదే. కాబట్టి దుబ్బాక మీదే బీజేపీ ఎమ్మెల్యే కంటే తెరాసకే ఎక్కువ బాధ్యత ఉంది. కనుక ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని […]
దుబ్బాకలో కాంగ్రెస్ ఓటమికి కార్యకర్తలు నిరుత్సాహ పడవద్దని, గెలుపోటములు సహజమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. దుబ్బాకలో కాంగ్రెస్ గెలుపు కోసం కార్యకర్తలు తీవ్రంగా శ్రమించారని గుర్తుచేసుకున్నాడు. ఈ ఓటమికి ఎవ్వరు నిరుత్సాహ పడవద్దని, అందరూ 2023 ఎన్నిక కోసం కష్టపడాలని ఆయన సూచించాడు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై అధికారాన్ని తిప్పుకోట్టాలని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీగెలుపు కోసం పనిచేయాలని పొన్నం వెల్లడించాడు.
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతుంది. అయితే రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెసే అని భావించినప్పటికీ దాంట్లో ఏ మాత్రం నిజం లేదని చెప్పాలి. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీనే కీలకమని అందరికి తెలిసిందే. కానీ ఆ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ ను పెద్దగా ఉపయోగించుకోవట్లేదనే చెప్పాలి. కాంగ్రెస్ లో నాయకులు ఎవరికివారే యమునాతీరే అనేలా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడి విషయంలో తీవ్ర స్థాయిలో నిరాశగా […]
దుబ్బాక ఉపపోరులో టీఆర్ఎస్ కు ఊహించని షాక్ ఇచ్చింది బీజేపీ. అయితే టీఆర్ఎస్, బీజేపీ ల మధ్య నువ్వానేనా అనేలా పోటీ జరిగిన చివరకు కమలానికే గెలుపు వరించింది. ఇక బీజేపీ గెలవడంతో ఇక తరువాత గ్రేటర్ ఎన్నికలపై గురి పెట్టింది. అయితే ఇప్పటివరకు జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచినప్పటికీ, ఈ ఎన్నికల్లో నిరాశే ఎదురయ్యింది. ఇక ఒకవైపు ఈ ఓటమికి టీఆర్ఎస్ కూడా స్పందించింది. ముఖ్యంగా హరీష్ రావు అన్ని తానై ఈ ఉపఎన్నికల్లో ప్రచారం […]
దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు కోసం పోరాటం చేసి ఓటమి చెందింది అధికార టీఆర్ఎస్ పార్టీ. అయితే ఓట్ల లెక్కింపు నుండి మంచి పోటీ ఇచ్చినప్పటికీ టీఆర్ఎస్ వ్యూహలు ఫలించలేదు. ఇక ఎట్టకేలకు బీజేపీ గెలిచినా విషయం తెలిసిందే. అయితే అధికార పార్టీ ఓటమికి ఇప్పటికే మంత్రి కేటీఆర్ స్పందించాడు. ఇక ఇదే తరుణంలో దుబ్బాకలో కీలకంగా పనిచేసిన మంత్రి హరీష్ రావు కూడా స్పందించాడు. ఇక ఆయన మాట్లాడుతూ… టీఆర్ఎస్ కు ఓటు వేసిన ప్రతి […]
ఉత్కంఠంగా సాగిన దుబ్బాక ఉపఎన్నిక పోరులో బీజేపీ పార్టీయే పై చేయి సాధించింది. అయితే ఓట్ల లెక్కింపు ప్రారంభం నుండి ఈ ఉపపోరు హోరాహోరీగా సాగింది. ఇక మొత్తానికి 23 రౌండ్లు పూర్తి అయ్యే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత పై బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు స్వల్ప మెజారిటీతో విజయం సాధించాడు. అయితే ఇప్పటివరకు జరిగిన అన్ని ఉపఎన్నికలో అధికార పార్టీ నే విజయం సాధించింది. కానీ ఈ ఉపఎన్నికలో మాత్రం బీజేపీ […]
తెలంగాణాలో ఉత్కంఠంగా సాగిన దుబ్బాక ఉపఎన్నికల్లో ఎట్టకేలకు బీజేపీ విజయ ఢంకా మోగించింది. అయితే నువ్వానేనా అన్నట్లు పోటీ ఇచ్చారు టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు. అయితే మొదటి రౌండ్ నుండి ఆధిక్యంలో కొనసాగిన బీజేపీ, మధ్యలో కాస్త వెనుకకు తగ్గింది. ఇక ఆ తరువాత కొన్ని రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగడంతో ఇరు పార్టీల మధ్య ఉత్కంఠం మొదలయ్యింది. ఇక చివరి నిమిషం వరకు కూడా ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠ పోటీ ఏర్పడింది. ఇక ఎట్టకేలకు […]
దుబ్బాక ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు అట్టహాసంగా సాగుతుంది. ఇక ఇప్పటికే ఆరు రౌండ్ల లెక్కింపు అయిపొయింది. అయితే మొదటి రౌండ్ నుండి ఐదవ రౌండ్ వరకు బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఇక ఆరో రౌండ్ కు వచ్చే సరికి సీన్ మారుతుంది. అయితే ఆరవ రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. అయితే ఆరవ రౌండ్ లో టీఆర్ఎస్ 353 ఓట్ల ఆధిక్యంలో ఉంది. అయితే ఆరవ రౌండ్ లో బీజేపీ 3,709, టీఆర్ఎస్ 4,702, కాంగ్రెస్ […]
దుబ్బాక ఉపఎన్నిక ఎట్టకేలకు ముగిసింది. అయితే ప్రధానంగా అక్కడ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉందని అందరికి తెలిసిందే. అయితే నేను దుబ్బాకలో మంచి పోటీ ఇచ్చానాని, నా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తుంది ఇండిపెండెంట్ అభ్యర్థి కత్తి కార్తీక. అయితే దుబ్బాకలో కత్తి కార్తీక పోటీ చేయడానికి గల కారణం అధికార పార్టీనే కావాలని ఆమెను బరిలోకి దింపింది అని అందరికి అనుమానం వ్యక్తం అయింది. కానీ ఆమె మాత్రం ఈ […]
దుబ్బాకలో నిన్నటివరకు ఉప ఎన్నికల రచ్చ కొనసాగింది. ఇక ఎట్టకేలకు ఈరోజు పోలింగ్ కూడా ప్రశాంతంగా సాగుతుంది. ఇప్పటికే 78 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇక ఇది ఇలా ఉంటె దుబ్బాకలో ప్రధానంగా టీఆర్ఎస్ నుండి సోలిపేట సుజాత, బీజేపీ నుండి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుండి శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక ఇండిపెండెంట్ గా బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తీక బరిలో నిలిచారు. అయితే ప్రధానంగా దుబ్బాకలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ […]
దుబ్బాక రాజకీయం రగులుతూనే ఉంది. ఇక నిన్న రాత్రి టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై సిద్దిపేటలో బీజేపీ నాయకులు దాడి చేసారు. ఇక ఈ ఘటనపై మంత్రి హరీష్ రావు స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. దుబ్బాకలో టీఆర్ఎస్ కు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే మా ఎమ్మెల్యేలపై బీజేపీ గుండాలు దాడికి యత్నించారని పేర్కొన్నాడు. క్రాంతి కిరణ్ స్వస్థలానికి వెళ్లి దాడి చేయడాన్ని మేము ఖండిస్తున్నామని మండిపడ్డాడు. ఎవరెన్ని కుట్రలు చేసిన టీఆర్ఎస్ గెలుపు ఖాయమని […]
దుబ్బాక ఉపఎన్నికల్లో తాజాగా ఒక సంచలన వార్త బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలో ఉన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించాడు. అయితే రేవంత్ మాట్లాడుతూ.. దుబ్బాకలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని అన్నాడు. ఓటర్లను గందరగోళానికి చేయడానికే అసత్య ప్రచారాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ లో దుబ్బాక ఉపఎన్నికలు రణరంగంగా మారింది. ఇక ఎట్టకేలకు ఈరోజు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఇక ఇది ఇలా ఉంటె నిన్న ఎవ్వరు ఊహించని ఒక వార్త బయటకు వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో నిలిచిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఓ ప్రముఖ ఛానల్ లో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అయితే ఆ అభ్యర్థి ఒక ప్రముఖ టీఆర్ఎస్ నేతకు సంబందించిన ఒక వ్యక్తితో రహస్యంగా చర్చ జరిపినట్లు […]
తెలంగాణ సీఎం కేసీఆర్ అప్పుడప్పుడు ఊహించని రీతిలో నిర్ణయాలు తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటారు. అడగనిదే అమ్మ అయినా పెట్టకపోచ్చు కానీ అడగకుండానే కేసీఆర్ వరాలిస్తారని అంటుంటారు జనం. ఇప్పటికే పలుసార్లు పలు గ్రామాలకు, నియోజకవర్గాలకు భారీ ఎత్తున నిధులు కేటాయించి వాటి రూపురేఖలు మార్చేసిన కేసీఆర్ తాజాగా వాసాలమర్రి గ్రామ మీద కన్ను వేశారు. అక్టోబర్ 31న జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించి తిరుగు ప్రయాణంలో వాసాలమర్రి వద్ద ఆగిన సీఎం కేసీఆర్ కొద్దిసేపు స్థానికులతో ముచ్చటించారు. మిషన్ భగీరథ నీళ్లు., పంటలకు సాగు […]