Telugu News » Tag » dog
Doctor : బతికితే గొప్పోడింట్లో కుక్కగా అయినా బతకాలంటారు కొందరు.! ఇదిగో, ఇది చదివితే అలాగే అనిపిస్తుంది చాలామందికి. ఆ కుక్క పేరు వాఫెల్. దానికి గుండెలో ఏదో సమస్య వుంది. సర్జరీ చేయాల్సి వుంటుంది. ఆ సర్జరీ కోసం ఏకంగా విదేశాల నుంచి ప్రముఖ వైద్యుడొకరు ప్రత్యేకంగా రావాల్సి వచ్చింది. ఖర్చు కాదిక్కడ మేటర్.. ముంబైలోని జుహులో వుండే రాణి రాజ్ వంకావాలా ఇంట్లోని పెంపుడు కుక్క పేరు వాఫెల్. దానికి తలెత్తిన గుండె సమస్యను […]
Toko : ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటాడో సినీ కవి.! అందంగా మారేందుకోసం రకరకాల కాస్మొటిక్ సర్జరీలు వున్నాయి. అత్యంత వికృతంగా మారేందుకు కూడా ప్రత్యేకమైన శస్త్ర చికిత్సలున్నాయ్. కోట్లు ఖర్చు చేస్తారు అందంగా కనిపించడానికీ.. అలాగే వికృతంగా మారడానికీ. సరదాగా మేకప్ వేసుకోవడమో, లేదంటే నటనలో భాగంగానో వికృతంగా మారితే తాత్కాలికంగానే కాబట్టి సబబేననుకోవచ్చు. కానీ, కానీ, శాశ్వతంగా వికృత ఆకారాన్ని కొందరు ట్రై చేస్తుంటారు. అదే అసలు సమస్య. ఎవరి పిచ్చి వారికి […]
Viral Video : ఈ రోజుల్లో మనుషుల కన్నా జంతువులే చాలా క్షమశిక్షణతో మెలుగుతున్నాయి. మనుషులు చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయడం, అవసరం తీరిపోయాక లైట్లు, ఫ్యాన్ల స్విచ్ లు ఆపకపోవడం, నీళ్లు తాగిన తరువాత ట్యాప్ లను బంద్ చేయకపోవడం వంటివి చేస్తుంటారు. అవి చూడటానికి చాలా చిన్న విషయాలుగానే కనిపిస్తాయి. కానీ ఆ అలవాట్లు క్రమశిక్షణా రాహిత్యం కిందకు వస్తాయి. నీటి విలువ తెలుసు.. మనుషులు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్న సమయంలో జంతువులు […]
Dog : ఈ రోజుల్లో చాలా మంది పెంపుడు కుక్కలని పెంచుకుంటున్న విషయం తెలిసిందే. వాటిని మనుషుల కన్నా ఎక్కువ ప్రేమగా చూసుకుంటున్నారు.ఈ కుక్కలు దొంగల నుంచి, కొత్తమనుషులు ఇంట్లోకి రాకుండా సెక్యురిటీ ఇస్తాయి. ఎవరు కొత్తవారు కన్పించిన అరవడం కుక్క అలవాటు. అయితే, కొన్నిసార్లు.. కుక్కలు అరుస్తుండంటం వలన, పక్కన ఉన్న ఇళ్లవారు ఇబ్బందులకు గురౌతారు. కుక్క వలన గొడవ.. కుక్క మూలంగా చుట్టు పక్కల వారితో వాగ్వాదాలు, గొడవలు జరుగుతాయి. కొన్నిసార్లు దాడులు […]
Infant : ఇటీవల కుక్కల దాడులు దారుణంగా పెరిగిపోతున్నాయి. కాస్త ఆదమరిస్తే చాలు చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్లని కూడా చీల్చి చెండాడుతున్నాయి. తాజాగా మూడు రోజుల పసికందుపై కుక్కలు దాడిచేశాయి. ఈ అమానుష ఘటన పానిపట్ లోని హార్ట్ అండ్ మదర్ కేర్ హస్పిటల్ లో జూన్ 25 న ఈ దారుణ ఘటన జరిగింది. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమానుషం.. యూపీలోని కైరానా లో ఉండే షబ్నమ్ , పానిపట్ లోనిన […]
Toko Evie : మనుషుల్లో రోజురోజుకి పిచ్చి పెరగుతూ పోతుంది. ఎవరు ఏం చేస్తున్నారనేది తెలియకుండా ఉంది. దేవుడు ఇచ్చిన శరీరాన్ని రకరకాలుగా మారుస్తూ అబ్బురపరుస్తున్నారు. తాజాగా జపాన్‌కి చెందిన వ్యక్తి ఏకంగా కుక్కలా మారిపోయి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆ వ్యక్తికి పూర్తిగా జంతువులా కనిపించాలనేది అతడి జీవిత కల. ఈ కలను సాకారం చేసుకోడానికి లక్షలు ఖర్చుచేసి అనుకున్నది సాధించాడు. నిపుణుల సాయంతో జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి అచ్చం ‘కోలీ’ జాతి శునకంలా మారిపోయి […]
Cricket: మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో మనుషులే కాదు కుక్కలు కూడా గ్రౌండ్లోకి వచ్చి మ్యాచ్‌కి అంతరాయం కలిగిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఇంగ్లండ్- భారత్ టెస్ట్ సిరీస్ మ్యాచ్ లలో జార్వో అనే వ్యక్తి పదే పదే గ్రౌండ్లోకి వచ్చి అంతరాయం కలిగించాడు. తాజాగా ఐర్లాండ్ దేశవాళీ క్రికెట్లో బుజ్జి కుక్క సడెన్‌గా వచ్చి ఆటని కొద్ది సేపు నిలిచేలా చేసింది. బ్రీడీ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన దేశవాళీ టోర్నీలో బ్రీడీ, సీఎస్ఎన్ఐ టీమ్స్ మధ్య సెమీఫైనల్ […]
Dog: సాధారణంగా మనుషులకే లెక్కలు సరిగా రావు. చిన్నప్పటి నుండి కొందరికి మ్యాథ్స్ ఫీవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. లెక్కలు అనే పేరు వినిపిస్తే గజగజ వణికిపోతుంటారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కూడా ఎంతగానో భయపడుతుంటారు. అయితే కొంత మంది మాత్రం మాథ్స్ని అవలీలగా చదివేస్తుంటారు. ఏ ప్రాబ్లమ్ ఇచ్చిన వెంటనే సాల్వ్ చేసి వావ్ అనిపిస్తూ ఉంటారు. మనుషులలో మ్యాథ్స్‌పై ఇలా డిఫరెంట్ ధోరణి కనిపిస్తుంటుంది. అయితే గణితం మనుషులకే పరిమితమా అంటే […]
జబర్ధస్త్ షోతో పాపులారిటీ పొందిన ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్. ఈ అమ్మడు అడపా దడాపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తూ ఉంటుంది. అయితే రష్మీని నటిగా కన్నా కూడా మంచి మానవత్వం ఉన్న మనిషిగా అభిమానులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ఆమె మూగజీవాలపై చూపించే ప్రత్యేక శ్రద్ధ వర్ణనాతీతం. లాక్డౌన్ సమయలోను ఆకలితో అమటిస్తున్న మూగజీవాలకు రక్షణగా నిలిచింది. తిండి లేక అల్లాడుతున్న మూగజీవాలని అక్కున చేర్చుకొని మానవత్వం చాటుకుంది. జంతు ప్రేమికురాలిగా ఎల్లప్పుడు సోషల్ […]