Telugu News » Tag » COVID Testing
తెలుగు టాప్ యాంకర్ సుమ కనకాల కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఇక కరోనా టెస్ట్ చేసే సమయంలో కామిడీ చేస్తూ నవ్వించారు. అయితే సుమ ఎప్పటికి నవ్వుతూ నవ్విస్తూ కనిపిస్తుంటారు. ఇక కరోనా టెస్ట్ చేసే సమయంలో కూడా ఏ మాత్రం తగ్గకుండా పంచులు వేశారు. అయితే ఆమె గొంతులో నుండి డాక్టర్ శాంపిల్ టెస్ట్ తీసుకున్న సమయంలో కాస్త హిందీలో మాట్లాడుతూ నవ్వించారు. ఇక ఆమె చేయించుకున్న టెస్టుల ఫలితాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ లో కరోనా విస్తరణ రోజురోజుకు భారీగా పెరుగుతుంది. అయితే తాజాగా వైద్యారోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1102 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 9 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీనితో మొత్తం కేసులు సంఖ్య 91,361 కి చేరింది. జిల్లాల వారీగా కేసులు: ఆదిలాబాద్ – 14భద్రాద్రి కొత్తగూడెం – 15జీహెచ్ఎంసీ – 234జగిత్యాల – 11జనగాం – 16జయశంకర్ […]
కరోనా సోకిందంటే మాములుగా దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం ఇవన్నీ కూడా కరోనా కు లక్షణాలు. అయితే తాజాగా మరో లక్షణం బయట పడింది. అయితే అమెరికన్ జర్నల్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ లో నివేదికను ప్రచురించారు. వివరాల్లోకి వెళితే చికాగోకు చెందిన ఓ 62 ఏళ్ళ వ్యక్తి నాలుగు రోజులుగా ఎక్కిళ్ళు ఎదుర్కొంటున్నాడు. అయితే అతడిలో కరోనా వైరస్ సోకిందని చెప్పడానికి వేరే ఇతర లక్షణాలు ఏవి కూడా కనిపించలేదు. జ్వరం వచ్చిన […]
కరోనా ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది. ఇప్పటికే పలు దేశాలు ఈ మహమ్మారిని నివారించేందుకు మందు కోసం అహర్నిశలు కష్టపడుతున్నాయి. అయితే తాజాగా కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు కొన్ని యాంటీ వైరల్ డ్రగ్స్ అందుబాటులోకి వచ్చాయి. దాంట్లో ఒకటి అయిన యాంటీ వైరల్ డ్రగ్ ‘ఫావిపిరవిర్’. అయితే కరోనా తీవ్రత తక్కువగా ఉన్న రోగుల కోసం ‘ఫావిపిరవిర్-200 ఎంజీ’ ఔషధాన్ని సన్ ఫార్మాసూటికల్ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే ఒక్కో టాబ్లెట్ ధర 35 రూపాయలుగా నిర్ణయించినట్లు సన్ […]
వాషింగ్ టన్: కరోనాపై పోరాటం చేయడంలో ఇండియా, చైనాల కంటే అమెరికా ఉత్తమంగా పోరాటం చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. కరోనా వల్ల ఎక్కువగా భాదింపబడ్డ దేశాల్లో అమెరికా కూడా ఒకటని, అయిన కూడా తిరిగి పుంజుకునే శక్తి తమకుందని ధీమా వ్యక్తం చేశారు. రోజు రోజుకు దేశంలో కొత్తగా నమోదు అవుతున్న కేసుల సంఖ్య తగ్గుతుందని వెల్లడించారు. అలాగే కరోనాకు సంబంధించిన వాక్సిన్ ను అమెరికానే కనిపెడ్తుందని ధీమా వ్యక్తం చేశారు. బయో […]
కరోనా మహమ్మారి ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ మహమ్మారి చిన్న, పెద్ద, పేద, ధనిక, కులం, మతం అని తేడా లేకుండా అందరికి సోకుతుంది. అయితే ఈ కరోనా వైరస్ మిగతా వారితో పోలిస్తే ఊబకాయం ఉన్న వ్యక్తులకు సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. మన శరీరంలో ఆకలిని నియంత్రించే హార్మోన్ లెప్టిన్. ఇక ఈ లెప్టిన్ హార్మోన్ శరీరంలో ఎక్కువగా ఉంది అంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అలాగే లెఫ్టిన్ హార్మోన్ ఉన్న […]
హైదరాబాద్: కరోనాతో ప్రపంచం మొత్తం విలవిలలాడుతున్న తరుణంలో ప్రజలు హాస్పిటల్స్ ను డేవాలయలుగా, డాక్టర్స్ ను దేవుళ్లుగా చూస్తున్నారు. అయితే కొంతమంది డాక్టర్స్ ఈ విపత్కర పరిస్థితిని సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దీని పై తెలంగాణ ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న హాస్పిటల్స్ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఈ మాటలు హామీల వరకే పరిమితం అవుతాయని, ఆచరణలో సాధ్యం కావాని చాలామంది అనుకున్నారు. […]
ప్రముఖ ఫోక్ సింగర్ వంగపండు ప్రసాదరావు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఈరోజు తెల్లవారుజామున విజయనగరం జిల్లా పార్వతీపురంలోని తన నివాసంలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. వంగపండు ప్రసాదరావు వందలాది జానపద పాటలను రచించారు. అలాగే కొన్ని పాటలు కూడా పాడారు. తన పాటలతో పల్లెకారులతో పాటు, గిరిజనులకు కూడా అవగాహన కల్పించిన ప్రసాదరావు ఉత్తరాంధ్ర వెనుకబాటు గురించి గొంతెత్తి పాడారు. మొత్తానికి 300లకు పైగా పాటలు రాశారు. అలాగే ఆయన […]
ఇండియన్ మూవీ ప్రేక్షకులకు కొత్త తరహా కథలను పరిచయం చేసి, ఒక ట్రెండ్ ను క్రియేట్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఆల్టర్ నేటివ్ రియాలిటీ కాన్సెప్ట్ తో కొన్ని సినిమాలు చేస్తున్నారు. అలాగే కొన్ని నిజ సంఘటనల ఆధారంగా కూడా కొన్ని మూవీస్ తీస్తూ, వాటిని తన ఆన్లైన్ థియేటర్ అయిన ఆర్జీవి వరల్డ్ థియేటర్ లో పేపర్ వ్యూ కాన్సెప్ట్ తో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా అమృత ప్రణయ్ […]
తెలంగాణ లో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతునే ఉన్నాయి. అయితే తాజాగా వైద్యారోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1286 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 12 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీనితో మొత్తం కేసులు సంఖ్య 68,946 కి చేరింది. జిల్లాల వారీగా కేసులు; జీహెచ్ఎంసీ – 391రంగారెడ్డి – 121మేడ్చల్ మల్కాజ్గిరి – 72సంగారెడ్డి – 15ఆదిలాబాద్ – […]
ఢిల్లీ: ప్రధానికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమాండోర్స్ భద్రత తగ్గనుందని కేంద్ర సచివాలయ శాఖ తెలిపింది. ఇప్పుడున్న వారిలో 50-60% కమాండోర్స్ తోనే భద్రత కల్పించనున్నారు. అలాగే రానున్న రోజుల్లో నాలుగు వేల మంది ఉన్న సిబ్బందిని క్రమంగా తగ్గించనున్నామని అధికారులు తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీకి, వారి కుటుంబానికి ఉన్న భద్రతా సిబ్బందిని కూడా తొలగించనున్నారు. ఇప్పటికే 200 మంది కమాండోలను వారి మాతృ శాఖలకు బదిలీ చేశారు. […]
ఏపీ సర్కార్ కరోనా కట్టడికి మరో నిర్ణయం తీసుకుంది. అయితే ICMR అనుమతించిన ప్రైవేటు ల్యాబ్‌లలో కరోనా పరీక్షలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం నుండి పంపే నమూనాలు, ప్రైవేటుగా సేకరించే నమూనాల పరీక్షలకు వైద్యారోగ్య శాఖ ధరలు నిర్ణయించింది. అయితే ప్రభుత్వం సూచించిన ప్రకారం ప్రవేట్ ఆసుపత్రులలో మరియు ప్రవేట్ ల్యాబులలో పరీక్షలకు 750 రూపాయల ధర కంటే ఎక్కువ వసూలు చేయరాదు అని తెలిపింది. అలాగే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులకు కూడా 750 రూపాయల […]
కరోనా మన శరీరంలోకి నోటి ద్వారా మరియు ముక్కు ద్వారా ప్రవేశిస్తుంది అనే విషయం అందరికి తెలుసు. అలాగే మొన్నటి వరకు గాలిలో కూడా కరోనా వైరస్ విస్తరిస్తుంది అని కొన్ని వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటె తాజాగా చెవుల్లో నుండి కూడా కరోనా వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది శాస్త్రవేత్తలు. కరోనా సోకి మరణించిన రోగుల చెవుల్లోని మస్టాయిడ్ అంటే చెవి లోపల వెనుక భాగంలోని మెత్తని […]
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే రోజుకు వెయ్యి కేసుల పైగా నమోదవుతన్నాయి. ఇలా పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రజలు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు. ఒకవైపు రాష్ట్ర రాజధాని అయినా హైదరాబాద్ లో కేసుల తీవ్రత అత్యధికంగా పెరుగుతున్నాయి. ఇక ఇలా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒకే ఒక్క కోవిడ్ హాస్పటల్ గా సేవలు అందిస్తుంది సికింద్రాబాద్ లోని […]
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది.రోజురోజుకి కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. ఇక మన దేశంలోనూ కరోనా కేసులు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే కరోనా భారిన పడి చాలా మంది మృత్యువాత పడ్డారు. ఇది ఇలా ఉంటె ప్రస్తుతం చాలా మందికి ఒక సందేహం ఉంది. అది ఏంటంటే కరోనా మొదటి సారి సోకి నయం అయినా తరువాత మల్లి రెండవసారి సోకుతుందా.. అని చాలా మందికి ఈ సందేహం ఏర్పడింది. అయితే ఈ […]