Telugu News » Tag » CM
Vadivelu : టాలీవుడ్ లో హాస్య బ్రహ్మ బ్రహ్మానందానికి ఎంతగా క్రేజ్ ఉందో అదే స్థాయిలో తమిళనాడు వడివేలు కి అంతే క్రేజ్ ఉంటుంది అనడంలో సందేహం లేదు. కామెడీ కింగ్ గా ఆయన్ని అక్కడి ప్రేక్షకులు మరియు అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు. కొన్ని కారణాల వల్ల దాదాపు పది సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న వడివేలు మళ్ళీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. తాజాగా ఆయన తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిది […]
KA Paul : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలలో తెగ సందడి చేస్తున్నారు. చంద్రబాబు , జగన్ , పవన్ కంటే ప్రజల సపోర్ట్ తనకే ఎక్కువ ఉందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ఇటీవల పేర్కొన్నారు. ప్రజలు తననే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. తెలంగాణలో తనపై దాడి జరగడంతో రాజకీయ చిత్రం మారిపోయిందని పేర్కొన్నారు. ఒక్క దెబ్బతో 30 లక్షల ఓటర్లు తనకు పెరిగారయన్నారు. […]
Eknath Shinde : మహారాష్ట్ర రాజకీయాలు తీవ్ర ఉత్కంఠకు దారితీస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఏక్‌నాథ్ షిండే వ్యవహారం శివసేనను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రెండు రోజులు గడిచిపోయినప్పటికీ.. ఈ విషయంపై ఓ స్పష్టత రావడం లేదు. ఈ నేపథ్యంలోనే ఏక్‌నాథ్ షిండేకు సీఎం పదవిని కట్టబెట్టి, పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏం జరగనుంది? సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికార నివాసాన్ని ఖాళీచేయగా, తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ […]
Gali Janardhan Reddy : మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కర్ణాటక, ఏపీతోపాటు పలు ప్రాంతాల్లో ఐరన్ ఓర్ గనులున్న గాలిని ఇండస్ట్రీ వర్గాలు మైనింగ్ కింగ్ అని పిలుచుకుంటాయి. ఆయన ఇంట్లో కుర్చీలు కూడా బంగారానివే అనే ప్రచారానికితోడు నిత్యం తన వైభవాన్ని చాటుకుంటూ వెరైటీగా వ్యవహరిస్తుంటాయాన. అదీ లెక్క.. అక్రమ మైనింగ్, అవినీతి కేసుల వల్ల సొంతూరు బళ్లారికి దూరమైన గాలి జనార్ధన్ రెడ్డి ఆమధ్య కూతురు […]
వెండితెరపై కొన్ని పాత్రలు పోషించాలంటే గట్స్ ఉండాలి. కొందరు మాత్రమే ఆ పాత్రలకు పర్‌ఫెక్ట్‌గా యాప్ట్ అవుతారని ఇటు అభిమానులు, అటు విశ్లేషకులు భావిస్తుంటారు. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రేక్షకుల మెప్పు పొందిన వాడే అసలు సిసలైన హీరో అని నెటిజన్స్ అభిప్రాయపడుతుంటారు. మెగా ఫ్యామిలీకి చెందిన మహా వృక్షం మెగాస్టార్ చిరంజీవి ఆయన కెరీర్‌లో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి అలరించాడు. ఇటీవల సైరా అనే చారిత్రత్మక చిత్రంలోను నటించి ప్రేక్షకులకి మంచి […]
తెలుగు రెండు రాష్ట్రాల్లో మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నికల హడావిడి మొదలుకాబోతుంది. తెలంగాణ లో నాగార్జున సాగర్ అసెంబ్లీ ఎన్నిక, ఇటు ఆంధ్రలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు జరగాల్సి వుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ తేదీ మార్ఛి 7 న విడుదల అయ్యే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల నుండి సమాచారం వస్తుంది. ఖాళీ అయిన ఆరు నెలలలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్రకారం చూసినా.. మార్చి మొదటి వారంలో ప్రక్రియ […]
మంత్రి కేటీఆర్.. తండ్రి కేసీఆర్ కు తగ్గ తనయుడు కాదు.. అంతకంటే ఎక్కువ. అంతకు మించి. కేసీఆర్ కంటే రెండు ఆకులు ఎక్కువే చదివారు కేటీఆర్. అందుకే.. ఆయనకు తెలంగాణ రాజకీయాల్లో అంత పాపులారిటీ. ఒక కేసీఆర్ కొడుకుగానే కాకుండా.. తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించారు కేటీఆర్. తెలంగాణను పారిశ్రామికంగా, ఐటీ పరంగా అభివృద్ధి చేయడంలో కేటీఆర్ పాత్ర చాలా కీలకం. అంతవరకు బాగానే ఉంది కానీ.. గత కొన్ని రోజుల నుంచి కేటీఆర్ […]
క్రియేటివిటీ అనేది సినిమావాళ్లకు మాత్రమే పరిమితం అనుకోవటం పొరపాటు అవుతుందేమో. ఎందుకంటే ఒక్కోసారి పొలిటికల్ లీడర్లు సైతం భలే సృజనాత్మకత ప్రదర్శిస్తారు. టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ వంటి షార్ట్ కట్ నేమ్స్ కి వెరైటీ, వ్యంగ్య ఫుల్ ఫామ్స్ చెప్పటం ద్వారా, ప్రత్యర్థి నాయకులకు లేనిపోని అపార్థాలను ఆపాదించటం ద్వారా ఆకట్టుకుంటూ ఉంటారు. అలాంటి ఓ ఇంట్రస్టింగ్ విమర్శే ఈరోజు చోటుచేసుకుంది. ఇదేం ఖర్మ.. సినిమా తీయి వర్మా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి […]
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం (టీడీపీ) రోజురోజుకీ మరింత యాక్టివ్ గా మారుతోంది. అధికార పార్టీ వైఎస్సార్సీపీకి సవాళ్లు, ఛాలెంజ్ లు విసురుతూ కొరకరానికొయ్యలా మారుతోంది. ఒక్కో రోజు ఒక్కో జిల్లాలో ఈ రెండు పార్టీల మధ్య చిచ్చు రేగుతోంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా బాగా ఎంకరేజ్ చేస్తుండటంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యులు, జిల్లా నేతలు సైతం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. రీసెంటుగా సత్య ప్రమాణం […]
రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్నోళ్లు వాళ్ల సొంత డబ్బులేమీ ఖర్చుపెట్టట్లేదు కదా. ప్రజల సొమ్మును తిరిగి ప్రజలకే ఇస్తున్నారు. అలాంటప్పుడు తనకు ఓటేయలేదనో, తనను మర్చిపోయారనో జనాన్ని తిడితే ఎలా? అలా చేస్తే మరింత చెడ్డ పేరొస్తుంది. మన తప్పులను సరిచేసుకొని, నిత్యం అందుబాటులో ఉంటూ, సమస్యల్ని పరిష్కరించేవారికే ప్రజలు పట్టం కడతారు. కొత్త సమస్యలు తెచ్చిపెడతామంటే తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. తెలంగాణ మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి ఈరోజు చేసిన వివాదాస్పద […]
ఆర్ఎక్స్ 100 అనే చిత్రంతో అందరి మనసులని దోచుకున్న అందాల భామ పాయల్ రాజ్‌పుత్. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నీ అమ్మడు ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తుంది. ఆర్ఎక్స్ 100 తర్వాత మళ్ళీ అలాంటి హిట్ పాయల్‌కు రాకపోవడంతో మంచి హిట్ కోసం కసిగా ఎదురు చూస్తుంది. అయితే పలు స్టార్స్ తో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్న పాయల్‌కు తెలుగు రాష్ట్రాలలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆమెని తూర్పుగోదావరి […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రాజధాని మార్పు అనే అంశం రోజుకో మలుపు తిరుగుతుంది. వికేంద్రీకరణ, సీఆర్డిఎఫ్ బిల్లులను ఈనెల 14వరకు నిలిపివేస్తూ హై కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లడంపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోని జగన్, […]