Telugu News » Tag » carona
Marburg Virus : ఒకవైపు కరోనాతోనే ప్రజలు భయంతో వణికిపోతుంటే ఇప్పుడు కొత్తగా మరో వైరస్ ఆఫ్రికాలో ప్రళయం సృష్టిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వైరస్ సోకితే చాలా ప్రమాదం అని అంటున్నారు. ఆఫ్రికాలో వెలుగు చూసిన మార్బర్గ్ వైరస్ ఇప్పటికే ఇద్దరిని పొట్టనపెట్టుకుంది. దీనిపై డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది రెండు వారాల క్రితమే రెండు కేసులు నమోదు కాగా.. వ్యాధి సోకిన ఆ ఇద్దరు బాధితులు తాజాగా ప్రాణాలు కోల్పోయారు. డేంజరస్ వైరస్.. ఘనాలో […]
Corona: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తుంది. కొంత తగ్గినట్టే తగ్గి వెంటనే తన ఉగ్రరూపం చూపిస్తుంది. మొన్నటి వరకు అమెరికాలో కరోనా తగ్గిందని, మాస్క్‌లు పెట్టుకోకపోయిన పర్వాలేదని చెప్పడంతో ఇప్పుడు ఆ కరోనా వారి వెన్నులో వణుకు పుట్టిస్తుంది. పెద్ద ఎత్తున వ్యాక్సిన్ వేసిన నేపథ్యంలో.. అమెరికాలో కరోనా తీవ్రత అంత ఎక్కువగా ఉండదన్న మాట పలువురి నోట వినిపించింది. అయితే డెల్టా వేరియెంట్ భిన్నంగా ప్రవర్తిస్తుంది. రోజుల వేల మందిని పొట్టన పెట్టుకుంటుంది. తాజాగా […]
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలను ఆదుకునేందుకు పలువురు సెలబ్రిటీలు, ప్రముఖ సంస్థలు ముందుకొస్తున్నాయి. తాజాగా కరోనా బాధితుల సహాయార్థం 30 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించింది సన్‌టీవీ, సన్‌రైజర్స్. ఈ మొత్తాన్ని దేశంలోని వివిధ రాష్ట్రాలలో కరోనా బాధితుల సహాయార్థం వినియోగించబోతున్నాం అని పేర్కొంది. ఈ మొత్తాన్నికేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయడంతో పాటు స్వచ్ఛంద సంస్థలతో కలిసి అవసరమైన వారికి ఆక్సిజన్ సిలిండర్స్, మందులు అందిస్తాం అని పేర్కొంది. సన్ నెట్‌వర్క్ మీడియా ద్వారా […]
సోనూసూద్ సాయాలకు బ్రేక్ అనేదే లేదు. గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో సేవా కార్యక్రమాలు మొదలు పెట్టిన సోనూసూద్ వాటికి బ్రేక్ అనేదే లేకుండా అడిగిన వారికి సాయం చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్‌గా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన భారతి అనే యువతి కోసం ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేసి అందులో ఆమెను హైదరాబాద్‌కు తీసుకొచ్చి ప్రైవేట్ ఆసుపత్రిలో ఎక్మో చికిత్స జరిపించాడు. నెల రోజులుగా ఆమె ఆసుపత్రిలో కరోనాతో పోరాడుతూ శుక్రవారం రాత్రి మరణించింది. ఈ […]
కరోనా సెకండ్ వేవ్ సెలబ్రిటీలపై ఏ మాత్రం కరుణ చూపించడం లేదు. గత ఏడాది కరోనా నుండి తప్పించుకున్న స్టార్స్ అందరు ఈ ఏడాది కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కాంట్రవర్షియల్ బ్యూటీ కంగనా రనౌత్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని కంగనా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. కంగనా తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో తన మొదటి సినిమా చేసి ఆ తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడ వైవిధ్యమైన […]
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చాలా మంది ఆక్సిజన్ దొరక్క కన్నుమూస్తున్నారు. ప్రముఖులకు కూడా ఇదే పరిస్థితి వాటిల్లితుంది. వీటిని గమనించిన సెలబ్రిటీలు కొందరు ఆహారం కన్నా కూడా ఆక్సిజన్ అందించడం గొప్ప విషయం అని భావించి అవసరమైన వారికి ఆక్సిజన్ అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. రీసెంట్‌గా సోనూసూద్ తన టీం ద్వారా ఆక్సిజన్ అందించి 22 మంది ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు ప్రణీత కూడా తన వంతు సాయంగా చారిటీ ద్వారా […]
తమకేదైన పర్లేదు కాని అభిమాన హీరోకు ఆరోగ్యం బాగోలేదు అంటే తల్లడిల్లిపోతున్నారు నేటి కాలం అభిమానులు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల తన సోషల్ మీడియా ద్వారా తనకు కరోనా సోకిందని, మైల్డ్ సింప్టమ్స్ మాత్రమే ఉన్నాయని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. బన్నీ ట్వీట్‌తో అభిమానులలో ఆందోళన నెలకొంది. మా హీరోకు కరోనా ఎలా సోకింది, ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కదా అంటూ తెగ […]
ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులోనూ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నాడు. అన్నింటికీ మించి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు. ప్రభాస్ సినిమాలంటే ఇప్పుడు మామూలు సబ్జెక్ట్స్ లేవు.. అన్నీ విజువల్ ఎఫెక్ట్స్ చుట్టూ తిరుగుతున్నాయి. బాహుబలి, సాహో లాంటి సినిమాలు కూడా భారీ విఎఫ్ఎక్స్ తోనే వచ్చాయి. ఇప్పుడు రాధే శ్యామ్ సినిమాలోనూ భారీగా విజువల్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. షూటింగ్ […]
మాయదారి కరోనా వైరస్ ఎన్నో వేల కుటుంబాలలో చిచ్చు పెడుతుంది. అయ్యే వాళ్లను ఆప్తులను కోల్పోయి లక్షలమంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీ కూడా దీనికి మినహాయింపు కాదు. ఇక్కడ కూడా చాలా మంది మరణించారు. కొందరు ప్రముఖులు ఉంటే.. మరికొందరు చిన్నవాళ్లు కూడా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు అనగానే అందరి దగ్గర డబ్బులు ఉండవు. ఇక్కడ కూడా 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఇందులో చాలా మందికి పూట గడవని పరిస్థితి ఉంటుంది. ఆర్థికంగా […]
కరోనా సంక్షోభంలో ఎన్ని దారుణమైన సంఘటనలు చూడాల్సి వస్తుందని ఎవ్వరు ఊహించి ఉండరు. కరోనాతో పేరెంట్స్ చనిపోయి పిల్లలు అనాథలుగా మారడం, తిండి తప్పలు లేక జీవచ్చవాలులా బతకడం, గూడు దొరక్క నానా ఇబ్బందులు పడడం వంటి సంఘనలు ఎన్నో చూస్తున్నాం. అయితే వీరికి తమ వంతు సాయం అందించేందుకు సినీ ప్రముఖులు ముందుకు వస్తుండడం శుభ పరిణామాం. మంగళవారం రోజు సందీప్ కిషన్ కరోనా వలన తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రెండు నెలల పాటు తాను […]
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. రీసెంట్‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా బారిన పడగా, ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. హోం క్వారంటైన్‌లో ఉన్నాను. కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారంతా కరోనా టెస్ట్‌లు చేయించుకోవాలి. అభిమానులు ఎవరు ఆందోళన చెందొద్దు.నాకు మైల్డ్ సింప్టమ్స్ మాత్రమే ఉన్నాయి. అందరు క్షేమంగా ఉండండి, తగు జాగ్రత్తలు […]
RAJINIKANTH సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ అన్నాత్తె.ఇటీవలి కాలంలో రజనీకాంత్ నటిస్తున్న చిత్రాలు పెద్దగా అలరించకపోవడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌ను కరోనా నిరాశపరుస్తుంది. ఈ మహమ్మారి వలన చిత్రం పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది. దీపావళికి మూవీని ఎలా అయిన రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్న క్రమంలో చిత్ర బృందం షూటింగ్ […]
ప్రఖ్యాత టెలివిజన్, సినీ నటుడు బిక్రామ్‌జీత్ కన్వర్‌పాల్ శుక్రవారం కోవిడ్ -19 సమస్యల కారణంగా తుది శ్వాస విడిచారు. 52 ఏళ్ల వయస్సులో ఈ నటుడు అకాల మరణం చెందడం అభిమానులు, సెలబ్రిటీలకు దిగ్భ్రాంతిని కలిగించింది.అనేక సినిమాలు, టీవీ షోలలో ప్రముఖ పాత్రలు పోషించిన బిక్రామ్‌జీత్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. ఈ విషయం చాలా మందికి తెలియదు. 2003లో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బిక్రామ్జీత్ .. పేజ్ 3, ఆరక్షణ్, ప్రేమ రతన్ ధన్ పాయో, […]
CARONA ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి భీబత్సంగా ఉంది. రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తుండడంతో రానున్న రోజులలో ఏం జరుగుతుందో అని భయం కలుగుతుంది. ఒక్క సామాన్యులే కాదు ప్రముఖులు సైతం కరోనా బారిన పడి కన్నుమూస్తున్నారు. ఇంకొందరు కరోనాతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ప్రముఖులు ఇప్పటికే కరోనా బారిన పడగా, రీసెంట్‌గా అల్లు అర్జున్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని […]
ప్రముఖ దర్శకుడు కేవీ ఆనంద్ మరణించింది గుండెపోటుతో కాదా? ఇప్పుడు ఇలాంటి అనుమానం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా..? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది మరి. నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న మనిషి ఉన్నపళంగా గుండెపోటుతో మరణించడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న లెజెండరీ సినిమాటోగ్రఫర్, ప్రముఖ దర్శకుడు కె.వి.ఆనంద్ మరణం సౌత్ సినిమాను కలచివేస్తుంది. ఆయన మరణవార్త తెలుసుకున్న వెంటనే సినీ రాజకీయ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు. అయితే […]