Bandh : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి ముకుతాడు పడకపోవటంతో ప్రతి రాష్ట్రమూ జాగ్రత్త చర్యలు చేపడుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను తమ రాష్ట్రంలోకి అనుమతించట్లేదు. కర్ణాటక నుంచి వచ్చేవాటిని తెలంగాణ అడ్డుకుంటుంటే తెలంగాణ నుంచి వెళ్లేవాటిని ఆంధ్రప్రదేశ్ ఆపేస్తోంది. కొవిడ్ నేపథ్యంలో తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో ఇవాళ గురువారం నుంచి ఆంక్షలను విధించారు. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ మండలం రావులపల్లి, తాండూర్ మండలం కొత్లాపూర్ వద్ద చెక్ పోస్టులు పెట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు […]