Telugu News » Tag » BRS Party
Telangana : గ్రేటర్ హైదరాబాద్ లో తమ సత్తా చూపిస్తామని అనుకున్న టీడీపీ, జనసేన పార్టీల పరువును తెలంగాణ ప్రజలు మూసీ నదిలో కలిపేశారు. చంద్రబాబు ఏదో ఘనకార్యం చేసినట్టు.. తన అరెస్ట్ పై కేసీఆర్ ఫ్యామిలీ సరిగ్గా స్పందించలేదని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ అంతుచూస్తామని అంతర్గతంగా ఆ పార్టీ నేతలు బీరాలు పలికారు. సెటిలర్స్ ఓటుతో బీఆర్ఎస్ కు బుద్ధి చెప్తామని అనుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినా.. గ్రేటర్ హైదరాబాద్ […]
KCR : సీఎం కేసీఆర్ కు కామారెడ్దిలో భారీ షాక్ తగిలింది. బీఆర్ ఎస్ కు కంచుకోటగా ఉండే కామారెడ్దిలో ఈజీగా గెలుస్తామని కేసీఆర్ భావించారు. గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో పోటీ చేసి ఆయన గెలుపొందాలని అనుకున్నారు. కానీ ఆయనకు కామారెడ్డిలో దిమ్మ తిరిగే షాక్ తగిలింది. గెలవడం సంగతి పక్కన పెడితే.. కనీసం పోటీ ఇవ్వలేకపోతున్నారు. ఇప్పటి వరకు ఐదు రౌండ్లు ముగిసేసరికి కేసీఆర్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. అక్కడ రేవంత్ రెడ్డి మొదటి […]
గజ్వేల్ లో కేసీఆర్ విజయం సాధించారు.. ఈటల రాజేందర్ రెండో స్థానానికి పరిమితం అయ్యారు. సిద్దిపేటలో హరీవ్ రావు విజయం సాధించారు. సిరిసిల్లలో కేటీఆర్ విజయం సాధించారు. కేకే మహేందర్ రెడ్డిపై 22693 ఓట్లతో విజయం సాధించారు గోషామహల్ లో రాజాసింగ్ విజయం సాధించారు నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 53 వేల 412 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చార్మినార్ లో MIM విజయం సాధించింది.. అంబర్ […]
T BJP : తెలంగాణలో బీజేపీ గురించి చెప్పుకోవాలంటే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా చేయక ముందు.. చేసిన తర్వాత అని చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే బండి సంజయ్ రాక ముందు పార్టీకి అసలు తెలంగాణలో గుర్తింపే లేదు. ఎక్కడో అట్టడుగున ఉన్న పార్టీని బండి సంజయ్ తన భుజస్కందాలపై వేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి గ్రాఫ్ పెంచారు. ప్రతి విషయంలో కేసీఆర్, బీఆర్ ఎస్ ను టార్గెట్ చేస్తూ యూత్ ను ఆకట్టుకున్నారు. ప్రతి విషయంలో ధర్నాలు, […]
Telangana Elections 2023 : తెలంగాణలో అధికారం ఎవరిది అనే ప్రశ్నలకు చాలానే సమాధానాలు వినిపిస్తున్నాయి. మరికొన్ని గంటల్లో అధికారం ఎవరిది అనేది తేలిపోనుంది. ఇలాంటి తరుణంలో పోలింగ్ పూర్తయిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ సంచలనం రేపతున్నాయి. వాస్తవానికి మూడోసారి అధికారం బీఆర్ ఎస్ పార్టీదే అని అంతా అనుకున్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసేశాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ కు మొగ్గు చూపించాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి […]
Telangana Assembly Election : తెలంగాణలో అధికారం ఎవరిది అనే ప్రశ్న ఇప్పుడు లక్షల మిలియన్ల సమాధానాలకు సమానం అయిపోయింది. దేశంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో ఒక్క తెలంగాణలో మాత్రమే బీఆర్ ఎస్ అధికార పార్టీగా ఉంది. అయితే ఇక్కడ ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే టాక్ అందుకుంది. కర్ణాటకలో గెలవడం ఆ పార్టీకి బాగా కలిసి వచ్చింది. దాంతో ఆటోమేటిక్ గా తెలంగాణలో అధికారంపై […]
Telangana : దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇప్పటికే అనేక సర్వేలు ఏ పార్టీ గెలుస్తుందో అంచానా వేసి చెప్పేశాయి. అయితే తాజాగా నిన్న ఓటింగ్ ముగియడంతో ఐదు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ అందుబాటులోకి వచ్చేశాయి. ఇవే ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే బలమైన పోటీ నడుస్తోంది. మిజోరాంలో హంగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తేల్చేశాయి ఎగ్జిట్ పోల్స్. కాగా మధ్య ప్రదేశ్, రాజస్థాన్ […]
Telangana : కాంగ్రెస్ గ్రాఫ్ ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎన్నికల సమయంలో బలంగా పెరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి కారణాలు అనేకం ఉన్నా.. ప్రధానంగా రెండు కారణాలు మాత్రం ఉన్నాయని అంటున్నారు. దీని వెనకాల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వ్యూహకర్త అయిన సునీల్ కనగోలు పాత్ర బలంగా ఉందని తెలుస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు తెలంగాణలో గ్రౌండ్ లెవల్లో కాంగ్రెస్ బలం గణనీయంగా పెరిగింది. కాంగ్రెస్ లో చాలామంది కార్యకర్తలు కూడా జాయిన్ […]
CM KCR : ఎన్నికల సమయంలో ఒకే ఒక్క ముఖాన్ని ముందు పెట్టి వెళ్తేనే ప్రజలు నమ్ముతారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలను సదరు వ్యక్తి నెరవేరుస్తారనే బాధ్యత ఉంటుందని ఓటర్లు విశ్వసిస్తారు. గత 2014 కేంద్ర ప్రభుత్వ ఎన్నికల్లో మోడీని పీఎం చేస్తామని బీజేపీ ముందే ప్రకటించింది కాబట్టే తిరుగులేని విధంగా బీజేపీ గెలిచింది. ఆ తర్వాత కూడా మోడీనే పీఎం అని ముందే ప్రకటించింది కాబట్టే.. బీజేపీకి ఆ స్థాయిలో ఓట్లు వచ్చాయి. అంతెందుకు […]
Revanth Reddy : తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో అన్ని పార్టీలు తీవ్ర స్థాయిలో ప్రచారం నిర్వహించాయి. తాజాగా డోర్నకల్ నియోజకవర్గంలోడాక్టర్ రాం చంద్రునాయక్ కు మద్దతుగాప్రచారం నిర్వహించారు. ఈ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రెడ్యా నాయక్ కు సర్పంచ్ నుంచి మంత్రి పదవి వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కానీ పాలిచిన తల్లి రొమ్ము మీద తన్నినట్టు కాంగ్రెస్ ను కాలదన్ని వెళ్లిపోయాడు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు కాంగ్రెస్ ను గెలిపించి […]
CM KCR : తెలంగాణలో ప్రచారం చివరి దశకు చేరుకుంది. 29వ తేదీన అన్ని పార్టీలకు ప్రచారానికి చివరి తేదీ అయిపోయింది. దాంతో చివరి రోజున కేసీఆర్ తన ప్రసంగంలో వాడిని పెంచారు. మంగళవారం కాకతీయ మెడికల్ కాలేజీ మైదానంలో వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు కలిపి నిర్వహించిన ప్రజాశీర్వద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సభలో కాంగ్రెస్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్. ఆయన మాట్లాడుతూ వరంగల్ తూర్పు, వరంల్ పశ్చి నియోజకవర్గాలకు […]
SMFS Survey : తెలంగాణలో ఎన్నికలకు ఒక్కరోజు మాత్రమే మిగిలిపోయంది. ఈ క్రమంలోనే అసలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది. పార్టీలు బలాబలాలను ప్రదర్శిస్తూ ముందుకు వెళ్లున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయానికి కాంగ్రెస్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. కాంగ్రెస్ లో చాలామంది గెలుపు మీద ఆశలు పెంచుకుని ఉన్నారు. దాంతో అసలు ఏ పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయనే దానిపై ఇప్పటికే చాలా సర్వే కంపెనీలు వచ్చి సర్వేలు నిర్వహిస్తున్నాయి. కాగా […]
CM KCR : కేసీఆర్ తలచుకుంటే ప్రతిపక్షంలో ఉన్న వారిని కూడా తనవైపుకు మళ్లించుకోగల వ్యక్తి. ఆయన తనకు వ్యతిరేకంగా ఉన్న వర్గంతో ఎప్పుడూ గొడవలు పెట్టుకోవాలని అనుకోడు. వారిని కూడా తన వైపుకు తిప్పుకోవాలని భావిస్తుంటారు. ఇప్పుడు మహిళా ఓటర్ల కోసం మరో పెద్ద ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో మహిళా ఓట్లు అనేవి చాలా కీలకం. అందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. మహిళా ఓటర్లను ఆకర్షిస్తే మాత్రం ఆటోమేటిక్ గా ఆ పార్టీ […]
CM KCR : కేసీఆర్ అంటేనే అపర చాణక్యుడు అనే పేరును మూటగట్టుకున్న వ్యక్తి. ఎన్నికల్లో ఎలా నెగ్గాలో కేసీఆర్ కు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు కాబోలు. ఆయన తలచుకుంటే లేని చోట కూడా అవకాశాలను పుట్టించుకుని ముందుకు వెళ్లగల వ్యక్తి. అందుకే కేసీఆర్ ఒక ట్రెండ్ సెట్టర్ అనే చెబుతుంటారు. తన మీద వచ్చే విమర్శలకు ఒకే ఒక్క మాటతో చెక్ పెట్టేసి ప్రతిపక్షాలకు అసలు మాట్లాడేందుకు గానీ.. విమర్శించేందుకు గానీ అవకాశాలు లేకుండా చేస్తుంటారు. […]
Revanth Reddy : ఇప్పుడు కాంగ్రెస్ కు మరో అస్త్రం దొరికినట్టు అయిపోయింది. ఎప్పుడు ఏ చిన్న అస్త్రం దొరికినా సరే దాన్ని సక్సెస్ ఫుల్ గా వాడేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే రైతుబంధు విషయంలో ఆయనకు దక్కిన అవకాశాన్ని సంపూర్ణంగా వాడేసుకోవడానికి రెడీ అయ్యారు రేవంత్ రెడ్డి. రైతుబంధు ఇచ్చేందుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం.. ఆ తర్వాత హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని మళ్లీ ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్టు తెలపడం […]