Telugu News » Tag » BJP Leaders
Bairi Naresh : హిందూ దేవుళ్లపై ముఖ్యంగా అయ్యప్ప స్వామి జననం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ పై కేసు నమోదు అయింది. హిందూ సంఘాలు మరియు బిజెపి నాయకులు నరేష్ పై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప స్వామి మాలా దారులు నిరసనలు రాస్తారోకోలు చేపట్టిన నేపథ్యంలో నరేష్ ని అరెస్టు చేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఇటీవల బైరి నరేష్ పై హిందూ సంఘాల వారు […]
Bandi Sanjay : బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర త్వరలో ప్రారంభించనున్నారు. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 15 లేదా 16 వరకు ఈ పాదయాత్ర సాగుతుంది. ఈ విషయాన్ని ప్రజా సంగ్రామ యాత్ర సహ ప్రముఖ్ టి. వీరేందర్ గౌడ్ వెల్లడించారు. బాసర దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం భైంసా నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. బాసరలో ప్రారంభమయ్యే ఐదో విడత […]
BJP Vs TRS : తెలంగాణలో బలపడేందుకు అన్ని శక్తుల్నీ కూడదీసుకుంటోంది భారతీయ జనతా పార్టీ. కింది స్థాయి నుంచి అత్యున్నతస్థాయి వరకు.. తెలంగాణలో బీజేపీ నేతలంతా ఒక్కతాటిపై కనిపిస్తున్నారు. అంతర్గతంగా చిన్నా చితకా మనస్పర్ధలున్నాగానీ, కీలకమైన విషయాలకొచ్చేసరికి.. అంతా ఏకమై ముందుకు నడుస్తున్నారు, పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడం కావొచ్చు, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో శక్తికి మించి ఫలితాల్ని సాధించడం కావొచ్చు, మునుగోడులో గెలవలేకపోయినా అధికార పార్టీకి చెమటలు […]
Harish Rao : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటన సందర్భంగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్‌పై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘నన్ను చాలామంది చాలా రకాలుగా తిట్టుకుంటారు.. అవి నాకేమీ నష్టం కలిగించవు. వాటి పట్ల మీరేమీ ఆందోళన చెందవద్దు. అవి నన్ను మరింత బలవంతుడ్ని చేస్తాయి..’ అని బీజేపీ కార్యకర్తల్ని ఉద్దేశించి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. మోడీ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్య నేత, మంత్రి […]
YS Jagan Mohan Reddy : వస్తున్నాయ్ జగన్నాథ రధ చక్రాల్.. అంటాడు శ్రీశ్రీ.! ఏం పిల్లడో ఎల్దమొస్తవా.. అంటాడు వంగపండు ప్రసాదరావు.! ఒకరేమో ప్రజా కవి.. ఇంకొకరేమో ప్రజా గాయకుడు.! ఈ ఇద్దరి ప్రస్తావన.. కాదు కాదు వారి పాటల ప్రస్తావన వచ్చింది విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న బహిరంగ సభలో.. అందునా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట వీటి ప్రస్తావన రావడమే ఆశ్చర్యకరం. జన ప్రవాహం తరలి వచ్చిందని చెప్పడానికి […]
Etela Rajender : మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది. సరిగ్గా ఈ సమయంలో మునుగోడు నియోజకవర్గంలో అనూహ్యమైన ఘటన చోటు చేసుకుుంది. మాజీ మంత్రి, బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ప్రయాణిస్తున్న వాహనంపైనా, ఆయన కాన్వాయ్‌పైనా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళ దాడికి పాల్పడ్డారు. రాళ్ళ దాడి ఘటనలో ఈటెల రాజేందర్ వాహనం సహా, పలు ఇతర వాహనాలు ధ్వంసమయ్యాయి. పెద్ద పెద్ద రాళ్ళతో దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. పోలీసులు […]
Bandi Sanjay: తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ని అధికారంలోకి తీసుకు రావడమే ముఖ్య ఉద్దేశంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మొదలు పెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 100 రోజులకు చేరింది. ఇప్పటి వరకు 1238 కిలోమీటర్లు నడిచిన బండి సంజయ్ నాలుగు కోట్ల ప్రజల కోసం 40 లక్షల అడుగులు వేసినట్లుగా పార్టీ నాయకులు మరియు పాదయాత్ర నిర్వాహకులు చెబుతున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష సాధన కోసం అలుపెరగక యాత్ర నిర్వహిస్తున్న సంజయ్ తెలుగు రాష్ట్రాల […]
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం వుందా.? అన్న ప్రశ్నకి ఆయనే పలు సందర్భాల్లో నేరుగా సమాధానమిచ్చారు.. తాను మళ్ళీ రాజకీయాల్లోకి రాబోనని. ‘సినిమాల్ని వదిలేసి తప్పు చేశానేమో అనిపిస్తుంటుంది.. అందుకే, ఇకపై ఆ తప్పు చేయబోను.. రాజకీయాల్లోకి మళ్ళీ వెళ్ళను..’ అని చాలాసార్లు చిరంజీవి చెప్పేశారు. అయితే, సామాజిక వర్గ సమీకరణాలు సహా అనేక ఈక్వేషన్స్ నడుమ, చిరంజీవి అవసరాన్ని బీజేపీ గుర్తించింది. అందుకే, ఆయనకి గతంలో రాజ్యసభ పదవి, కేంద్ర […]
Bandi Sanjay : ఇది ప్రజా సంగ్రామ యాత్ర.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ కేవలం కేసీయార్ కుటుంబ అభివృద్ధికే పరిమితమైపోయింది.. అంటున్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. ప్రజా సంగ్రామ యాత్రకు వరంగల్ పోలీసులు అడ్డు చెప్పడంపై బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నేడు దీక్ష కూడా చేపట్టాయి. ఇంకోపక్క, ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగింపు విషయమై హైకోర్టును ఆశ్రయించారు బండి సంజయ్. తమ వాదనలో న్యాయం వుందనీ, తమకు […]
CPI Narayana : కేంద్ర హోంమంత్రిని క్రిమినల్ అనడమేంటి.? మరీ ఇంత నీఛమా.? ఈ రోజుల్లో రాజకీయ నాయకుల మీద కేసులనేవి సర్వసాధారణం. అందులో క్రిమినల్ కేసులున్నాసరే, జనం వాటిని పట్టించుకోవడంలేదు. అలాగని నేర చరిత్ర వున్న రాజకీయ నాయకుల్ని సమర్థించగలమా.? సమర్థించలేం. కాకపోతే, కేంద్ర హోంమంత్రి మీద ‘క్రిమినల్’ అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. వయసు మీద పడేకొద్దీ విజ్ఞత కోల్పోతున్నారు సీపీఐ నారాయణ. తాజాగా కేంద్ర హోంమంత్రి మీద అత్యంత జుగుప్సాకరమైన […]
Madhya Pradesh : ఇటీవల రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తూ వారిని భయబ్రాంతులకి గురి చేస్తున్నారు. చిన్నా చితకా కారణాలకు కూడా వారిపై దాడులు చేస్తున్నారు. ఆ మధ్య పార్టీ జెండా దిమ్మె నిర్మాణానికి అనుమతులు ఇవ్వలేదంటూ పంచాయతీ కార్యదర్శిపై దాడికి తెగబడ్డారు. సాక్షాత్తూ గ్రామ సర్పంచ్, మరో ఎంపీటీసీ సభ్యురాలి భర్త పంచాయతీ కార్యదర్శిని కర్రలతో కొట్టి గాయపరచడం నల్గొండ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఇంత దారుణమా? కర్నూలు జిల్లా హాలహర్విలో […]
Adhir Ranjan Chowdhury : కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న విషయం విదితమే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఉద్దేశించి ‘రాష్ట్రపత్ని’ అని ఆయన పేర్కొనడాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుపడుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ నేతలు పార్లమెంటు వేదికగా చేస్తున్న యాగీ అంతా ఇంతా కాదు. ‘నేను చేసిన వ్యాఖ్యలు పొరపాటే. అది మాట్లాడే సమయంలో దొర్లిన తప్పు తప్ప, ఉద్దేశ్య పూర్వకంగా రాష్ట్రపతిని రాష్ట్రపత్నిగా […]
CM Ramesh : రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత సీఎం రమేష్, తెలుగు రాష్ట్రాల మధ్య నలుగుతోన్న పోలవరం పంచాయితీపై తనదైన స్టయిల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు వల్లనే భద్రాచలం మునిగిపోయిందని తెలంగాణ రాష్ట్ర సమితి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు టీఆర్ఎస్ నేత, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘ఐదు గ్రామాల్ని తెలంగాణకు ఇచ్చేస్తే, మేం కరకట్ట నిర్మించుకుంటాం.. పోలవరం ప్రాజెక్టు […]
వైఎస్ జగన్ రాష్ట్రంలో తనకు ఎదురులేకుండా చూసుకునేందుకు అనేక వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీని ఆయన మేనేజ్ చేసున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ అధ్యక్ష పదవి నుండి టీడీపీకి అనుకూలమైన కన్నా లక్ష్మీనారాయణను తప్పించి సోము వీర్రాజు అధ్యక్షుడు కావడం, పదవిలో కూర్చున్న రోజు నుండి వీర్రాజు జగన్ మీద లేదా జగన్ ప్రభుత్వం మీద పెద్దగా నోరు మెదపడకపోవడం, కేవలం తెలుగుదేశం పార్టీనే ఎక్కువగా టార్గెట్ చేయడం, అమరావతికి అనుకూలంగా మాట్లాడిన నేతలను బీజేపీ నుండి సస్పెండ్ చేయడం వంటి అనేక పరిణామాలు బీజేపీ తెరవెనుక వైసీపీకి సహకరిస్తోందనే వాదనలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. బీజేపీ కేంద్ర […]