Telugu News » Tag » Bathukamma
MLC kavitha : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సబ్బండ వర్ణాల పండుగ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పారు. ప్రతి ఏడాది కవిత బతుకమ్మ సంబురాల్లో పాల్గొంటారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మను పేర్చి మహిళలతో ఆడిపాడతారు. ఈ ఏడాది కూడా తన తల్లితో కలిసి బతుకమ్మను పేర్చి కవిత ఆడిపాడారు.ప్రజలకు ఎంగిలి బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పారు. ‘రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకైన ‘బతుకమ్మ’ పండుగ శుభాకాంక్షలు. ఇంటిల్లిపాదీ ఏకమై, ఊరువాడ ఒక్కచోట చేరి రంగురంగుల పూలను […]
Bathukamma : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు, భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోతున్న తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారిని తలచుకొని తోటి మహిళలు విచారించేవారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి […]
Bathukamma: తెలంగాణంలో ప్రత్యేకంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. రేపటి నుంచి ప్రారంభమయ్యే బతుకమ్మ పండుగ కోసం తెలంగాణ ఆడపడుచులు సిద్ధమవుతున్నారు. రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి నవరాత్రులు ఆడిపాడి ఆనందంగా జరుపుకునే పండుగే ఈ బతుకమ్మ పండుగ. భాద్రపద అమావాస్య రోజు ఎంగిలి బతుకుమ్మతో ప్రారంభమైన వేడుకలు ఆశ్వయుద్ధ శుద్ధ అష్టమి రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి.రేపు జరగనున్న ఎంగిలిపూల బతుకమ్మకు తెలంగాణ రాష్ట్రం […]
Bathukamma: తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు. ఈ నెల 25 నుంచి అక్టోబరు 3 వరకూ బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. పూల పండుగగా చెప్పే బతుకమ్మ కోసం ఈ పూలు ఆపూలు అని లేదు..ప్రకృతిలో దొరికే ఏ పూలైనా పేర్చొచ్చు. అప్పట్లో అయితే చుట్టుపక్కల దొరికే పూలన్నీ ఏరి పేరిస్తే..ఇప్పుడు మార్కెట్లో దొరికిన పూలతో బతుకమ్మలు పేరుస్తున్నారు. పూలెందుకు పేర్చాలి.. వర్షాకాలం పూర్తై శీతాకాలం ఆరంభంలో వచ్చే పండుగ ఇది. […]
Bathukamma: తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగే ఈ బతుకమ్మ పండుగ. ఈనెల 25 నుంచి బతుకమ్మ పండుగకు తెలంగాణ రాష్ట్రం సిద్ధమవుతోంది. రోజూ బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆడేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమికి ముందురోజు వచ్చే అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మ పేరుతో ప్రారంభమై దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. […]
KCR : తెలంగాణలో బతుకమ్మ పండుగని ఎంత ఘనంగా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నేండ్లుగా ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా 18 ఏండ్లు నిండిన బీపీఎల్ మహిళలందరికీ ఉచితంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని నేతన్నలను ఆదుకొనే ఉద్దేశంతో ప్రభుత్వం సిరిసిల్లలోని నేత కార్మికులకే చీరల తయారీ బాధ్యతలు అప్పగిస్తున్నది. వడివడిగా పంపిణీ.. ఉచితంగా ఇస్తున్న కోటి చీరల పంపిణీకి రంగం సిద్ధం కాగా, వచ్చే నెల 17 నుంచి వీటిని అన్ని […]
Srilankan And Pakistan : తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దం బతుకమ్మ వేడుకలు. తెలంగాణ ఏర్పాటు తరువాత బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ప్రతీ ఏటా ప్రభుత్వం తరఫున ఎంతో ఘనంగా ఈ వేడుకలను జరుపుతోంది. సేమ్ అదే తరహాలో శ్రీలంక- పాక్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా అభిమానులు స్టేడియంలో స్టెప్పులేసి అలరించారు.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. బతుకమ్మ స్టైల్‌లో.. గాలే వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు శ్రీలంక […]
MLC Kavitha తెలంగాణలో బతుకమ్మకి ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటే ఈ పండగను ప్రతి ఏటా దసరాకు ముందు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇప్పటికే బతుకమ్మ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. బతుకమ్మ దివ్య రూపం బుర్జ్ ఖలీఫాలపై కాంతిపుంజమై సాక్ష్యాత్కరించింది. శనివారం నాడు రాత్రి 9.45 గంటలకు తిరిగి 10.30 గంటలకు తెలంగాణ సాంస్కృతిక వైభవ దృశ్యమాలిక బుర్జ్ ఖలీఫాపై కనువిందు చేసింది. తెలంగాణ మలిదశ ఉద్యమ ప్రస్థానాన్ని టీఆర్‌ఎస్ స్థాపనతో ప్రారంభించి […]
తెలంగాణాలో మందుబాబులు రికార్డ్ స్థాయిలో మందు తాగేశారు. ప్రతి ఏడాది దసరాకు మద్యం అమ్మకాలు జోరుగా ఉంటాయి. అయితే ఈ ఏడాది కరోనా వైరస్ దాటికి అమ్మకాలు తగ్గుతాయని అందరు అంచనా వేశారు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యదికంగా ఈ ఏడాది దసరాకు మద్యం అమ్మకాలు పెరిగాయని తెలుస్తుంది. నిజానికి కరోనా వైరస్ దాటికి లాక్ డౌన్ కారణంగా మద్యం అమ్మకాలు చాలావరకు తగ్గిపోయాయి. ఇక తరువాత రోజురోజుకు మెల్లిమెల్లిగా అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయి. […]
తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండగకు మంచి గుర్తింపు ఉంది. అయితే సాధారణంగా ప్రతి పూజలో దేవుళ్లను పువ్వులతో పూజిస్తాం.. ఇక ఆ పువ్వులనే పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణది. తీరొక్క పువ్వు తెచ్చి పెత్తరమాస రోజున బతుకమ్మ పండగ మొదలవుతుంది. ముఖ్యంగా బతుకమ్మ పూజలో గౌరమ్మ ప్రత్యేకం అని చెప్పాలి. ఇక బతుకమ్మ ను అలంకరించే పువ్వులలో తంగేడు పువ్వు, గునుగు పువ్వు చాలా ప్రత్యేకం. అలాగే తీరొక్క పువ్వులతో కూడా బతుకమ్మను అలంకరిస్తారు తెలంగాణ ఆడపడుచులు. […]
తెలంగాణ మహిళామణులకు సర్కార్ శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో బతుకమ్మ పండగ గురించి చెప్పడం అవసరం లేదు. ప్రతి ఏడాది బతుకమ్మ పండగను ప్రతిష్టాత్మకంగా జరుపుతుంది. ఇక ప్రతి సంవత్సరం ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరలు పంపిణి చేస్తుంది సర్కార్. ఇక ఈ ఏడాది కూడా బతుకమ్మ చీరలు పంపిణి చేయనుంది. అయితే కరోనా ఉన్నప్పటికీ చీరాల పంపిణీకి మాత్రం వెనుకడుకు వేయలేదు సర్కార్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు ఈ […]