తెలంగాణ లోని మంచిర్యాల జిల్లాలో వింత సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళకు ఒంటి కన్నుతో మగ శిశువు జన్మించాడు. అయితే కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన శంకర్ భార్య ప్రియాంక ను ప్రసవం కోసం చెన్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకున్న సమయంలో సాధారణ ప్రసవం జరిగింది. దీనితో ఆమె ఒంటి కన్నుతో ఉన్న శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఇది ఆమెకు రెండవ సంతానం. […]