Telugu News » Tag » APGovernor
ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణలో దాదాపు రూ. 500 కోట్ల మేరకు అవినీతి జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఈ అవినీతిలో వైసీపీ నాయకులు పెద్ద మొత్తంలో డబ్బును దండుకున్నారని చంద్రబాబు ఆరోపణలు చేశారు. ఇళ్ల నిర్మాణాలనికి అనువుగాని భూములను సేకరించారని, చిత్తడి నేలలు, ముంపు భూములు, మడ అడవులను ప్రభుత్వమే కొనుగోలు చేయడం దుర్భరమని మండిపడ్డారు. ఆవ భూములు, చిత్తడి నేలల […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రాజధాని మార్పు అనే అంశం రోజుకో మలుపు తిరుగుతుంది. వికేంద్రీకరణ, సీఆర్డిఎఫ్ బిల్లులను ఈనెల 14వరకు నిలిపివేస్తూ హై కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లడంపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోని జగన్, […]
అమరావతి: 2019 ఎన్నికల్లో జగన్ సాధించిన విజయం చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా పట్టించుకోకుండా పట్టుదలతో ప్రయత్నించి, చివరికి గెలిచి సీఎం పదవిని దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలోని రాజంపాలెంలో వైసీపీ నాయకులు సీఎం జగన్ మోహన్ రెడ్డికి గుడి కట్టనున్నారు. ఈ గుడికి సంబంధించిన భూమి పూజను గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్ నిర్వహించారు. మన దేశంలో ఇప్పటివరకు హీరోయిన్స్ ఖుష్భూ, ఇలియానా, నయనతార లాంటి వారికి కూడా […]
కరోనా కల్లోలం సృష్టిస్తుంది. పట్టణాలు, పల్లెలు అని తేడా లేకుండా అన్ని చోట్ల విస్తరిస్తుంది. అయితే ఈ మహమ్మారి పెళ్లి జరగవలసిన ఓ ఇంట్లో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే ఏపీ లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఓ యువకుడు కరోనా సోకి చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు. అయితే బుధవారం ఆ యువకుడు పెళ్లిపీటలు ఎక్కావాల్సిన లోపే మరణించారు. ఆదోనిలోని 11వ వార్డుకు చెందిన 28 సంవత్సరాల వయస్సు గల యువకుడు గత నెల […]
అమరావతి: కరోనాతో రాష్ట్రంలో ప్రజలు బిక్కుబిక్కుమంటున్న తరుణంలో అక్టోబర్ 15 నుండి రాష్ట్రంలో కళాశాలలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఉన్నత విద్యపై ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ నెలలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి కావలసిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలిపారు. అక్రమాలకు పాల్పడే కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని […]
ఏపీ రాజధానిని అమరావతి నుండి తొలగిస్తూ, రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడు హయాంలో రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు. రాజధానిని అమరావతి నుండి మార్చి తమకు అన్యాయం చేయవద్దని, మొదట అమరావతిని రాజధానిగా చేయడానికి ఒప్పుకున్న జగన్ ఇప్పుడు ఎందుకు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నార్తు. రాజధాని అంశంపై […]
ఏపీ పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు ఆ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం ఆమోదం తెలిపారు. దీనితో మూడు రాజధానులకు అధికారికంగా అనుమతి లభించింది. ఇక మూడు రాజధానులలో… ఏపీకి శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూల్ మారనున్నాయి. సీఆర్డీఏ చట్టం-2014 రద్దు బిల్లుతో పాటు, ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లులకు జనవరి 20వ తేదీన ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. ఇక బిల్లులపై చర్చ జరపడానికి శాసన […]