Telugu News » Tag » APCMjagan
ఏపీలో వైసీపీ, టీడీపీ పార్టీల్లో గ్రూపు రాజకీయాలు సాధారణంగా కనిపిస్తూనే ఉంటాయి. అయితే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్ రాజకీయాలు ఉన్న బయటపడేవి కావు. ఇక వైసీపీ నుండి 23మంది ఎమ్మెల్యేలను టీడీపీ లోకి లాక్కున్నా.. ఎప్పుడు ఎలాంటి సమస్యలు రాలేదు. ఏ నియోజకవర్గంలో కూడా ఎలాంటి విభేదాలు లేవనే చెప్పాలి. కానీ ప్రస్తుతం వైసీపీ అధికారం చేపట్టి 19నెలలు కూడా కాలేదు. అంతర్గత కుమ్ములాటలు పెద్ద ఎత్తున బయటపడటంతో ఆఖరికి పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లి […]
ఏపీలో తిరుపతి లోక్ సభ స్థానానికి ఉపఎన్నిక జరగవలసిన విషయం తెలిసిందే. అయితే తిరుపతి వైసీపీ ఎంపీ దుర్గాప్రసాద్ రావు కరోనా మహమ్మారి దాటికి మృతి చెందారు. దీనితో అనూహ్యంగా అక్కడ ఉపఎన్నికకు దారి తీసింది. ఇక సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైన కైవసం చేసుకోవాలని వైసీపీ సన్నాహాలు సిద్ధం చేసుకుంటుంది. మరోవైపు ఈ ఉపఎన్నికలో సత్తాచాటాలని టీడీపీ, బీజేపీ, జనసేన లు కూడా ఎదురుచూస్తున్నాయి. పథకాలు ఫలించేనా : ఏపీలో ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు […]
ఏపీలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అయితే పోలవరం నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం కేంద్రం మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిన విషయం తెలిసిందే. పోలవరం నిర్మాణానికి 30 వేల కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం ప్రకటించింది. దీనితో వైసీపీ ప్రభుత్వం ఒక్కసారిగా కంగు తిన్నంత పనయింది. వాస్తవానికి టీడీపీ హయాంలో 55 వేల కోట్లకు నివేదిక పంపారు. దానికి కేంద్రం ఆమోద ముద్ర కూడా వేసింది. ఇక […]
ఏపీలో వైసీపీ, టీడీపీ పార్టీల మధ్య గ్రూపు రాజకీయాలు సహజంగానే సాగుతుంటాయి. ముఖ్యంగా అనంతపురం టీడీపీలో జేసీ ఫ్యామిలీ, పరిటాల ఫ్యామిలీల మధ్య పచ్చ గడ్డివేస్తే భగ్గుమనేలా ఉండేది. అయితే సందర్భం వచ్చినప్పుడు మాత్రం కలిసిమెలిసి ముందుకు సాగుతుంటారు. సాధ్యమైనంతవరకు ఎవ్వరి పని వారు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటారు. అయితే తాజా రాజకీయ పరిమాణాల నేపథ్యంలో పరిటాల శ్రీరామ్ జేసీ ఫ్యామిలీకి మద్దతుగా మాట్లాడరు. అయితే తాజాగా జేసీ పై జరిగిన దాడిని శ్రీరామ్ స్పందిస్తూ వైసీపీ […]
ఏపీలో నివర్ తుఫాన్ దెబ్బకు భారీగా పంట నష్టం వాటిల్లింది. దీనితో నష్టపోయిన రైతులను స్వయంగా వెళ్లి పరామర్శిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే దింట్లో భాగంగా నిన్న పాముర్రు, కంకిపాడు, అవనిగడ్డ ప్రాంతాల్లో పర్యటించారు. ఇక రైతులతో పంట నష్టాన్ని అడిగి తెలుసుకొని, నష్టపరిహారం అందేలా ప్రభుత్వంపై వత్తిడి తీసుకొస్తామని భరోసా ఇచ్చాడు. ప్రతిఒక్క రైతుకు ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తామని చెప్పుకొచ్చాడు. ఇక ఇదిలా ఉంటె తాజాగా పవన్ తిరుపతిలో మీడియాతో […]
వైసిపి నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఈ మధ్య పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. అయితే నిరంతరం ఎక్కువగా టీవీ షోల్లో పాల్గొనే రోజా, ఈ మధ్య ఆ షోలలో కూడా కనిపించడం లేదు. అటు తెర మీద, ఇటు రాజకీయంగా కూడా కాస్త మొహం చేటేసింది రోజారమని. అయితే ఆమె పార్టీ కార్యక్రమాల్లో సరిగ్గా పాల్గొనకపోవడానికి గల కారణం తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవటమే అని అంటున్నారు రోజా సన్నిహితులు. అయితే వైసీపీ ప్రతిపక్షంలో […]
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నాడు. అయితే ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు విడుదల చేసి ఏపీ ప్రజలకు ఆపన్న హస్తంగా నిలుస్తున్నాడు. ఇప్పటికే రైతు భరోసా, ఉచిత విద్యుత్, సర్కార్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, వైఎస్సార్ పెళ్లి కానుక, వైఎస్సార్ ఆసరా, అమ్మ వడి వంటి ఎన్నో పథకాలను అమలు చేసాడు సీఎం జగన్. ఇక ముఖ్యంగా ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాడు. […]
గత ఎన్నికల్లో టీడీపీని చిత్తు చిత్తుగా ఓడించింది ఎవరయ్యా అంటే వైఎస్ జగన్ అని పక్క రాష్ట్రం ప్రజల్ని అడిగినా చెబుతారు. దశాబ్దాల మనుగడలో ఎన్నడూ చూడని, కలలో కూడ ఊహించని ఓటమిని చంద్రబాబుకు పరిచయం చేసింది జగనే అనేది నిర్వివాదాంశం. మహావృక్షం లాంటి బాబుగారిని కూకటి వేళ్ళతో సహా కూల్చేయడంతో జగన్ చుట్టూ ఒక హీరోయిక్ క్రేజ్ ఏర్పడిపోయింది. అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఇంకా కొన్నేళ్ల పాటు జగన్ గెలుపు గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. ఈ గెలుపు కోసం జగన్ టీడీపీ మీద ఎన్ని […]
ఏపీ వైసిపి ఎమ్మెల్యే ఆర్ కె రోజాకు సీఎం జగన్ మోహన్ రెడ్డి దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు. అయితే రోజా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో వైసిపిలో వర్గపోరు జోరుగా సాగుతుంది. ఇక నగరిలో రోజాకు మరియు మాజీ మున్సిపల్ ఛైర్మెన్ జేకే కుమార్ అతడి భార్య జేకే శాంతికి పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా వర్గపోరు జరుగుతుంది. ఇక ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతూ నగరి రాజకీయం రగులుతూ ఉండేది. ఇక ఈ […]
ఏపీలో జగన్ సర్కార్ కు మరొసారి ఎదురు దెబ్బ తగిలింది. అయితే ఏపీలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ ఎన్నికలకు ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ వ్యవహరిస్తున్నా విషయం తెలిసిందే. అయితే నిమ్మగడ్డ రమేష్ కు జగన్ సర్కార్ సహకరించడం లేదని ఆయన హై కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసాడు. ఇక నిమ్మగడ్డ వేసిన పిటిషన్ కు హై కోర్ట్ స్పందించింది. స్థానిక ఎన్నికలకు ఈసీ నిమ్మగడ్డ రమేష్ కు ఏపీ సర్కార్ […]
విజయవాడ ఇంద్రకీలాద్రిపై పెను ప్రమాదం సంభవించింది. అయితే ప్రస్తుతం కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో శరన్నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. ఇక ఈ రోజు ఐదవ రోజు సందర్భంగా అమ్మవారు సరస్వతి దేవి రూపంలో దర్శనం ఇస్తుంది. ఇక ఒక్కసారిగా దుర్గమ్మ దేవాలయం దగ్గర కొండచరియలు విరిగిపడడంతో కలకలం రేపింది. అయితే గత రెండుమూడు రోజులుగా వర్షాలు పడుతుండడంతో చిన్నచిన్న పడుతున్నాయని అధికారులు తెలిపారు. ఇక ఈరోజు ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఇక ఈ ప్రమాదంలో […]
ఏపీ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 9,742మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 86 మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 3,16,003కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా.. అనంతపురంలో 1123చిత్తూరులో 830ఈస్ట్ గోదావరిలో 1399గుంటూరులో 555కడపలో 673కృష్ణాలో 281కర్నూలులో 794నెల్లూరులో 755ప్రకాశంలో […]
ఏపీ ప్రభుత్వం రోజుకో నూతన విధానాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తున్నారు. నిన్ననే వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో నూతన విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ విధానం ద్వార రాష్ట్రంలోని ప్రతి పరిశ్రమకు ఆధార్ తరహాలో ఒక ప్రత్యేక సంఖ్య ఇవ్వనున్నారు. దీనికోసం రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల సర్వే నిమిత్తం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సర్వేలో పరిశ్రమలోని కార్మికులు, విద్యుత్, భూమి, నీటి లభ్యత గురించి తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. […]
అమరావతి: అభివృద్ధి పేరుతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ విధ్వంసం సృష్టిస్తున్నారని, మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయిడు వెల్లడించారు. తన హయాంలో జరిగిందే అభివృద్దని, జగన్ చేస్తుంది మాత్రం అభివృద్ధి కాదని పేర్కొన్నారు. తమ హయాంలో అన్ని జిల్లాల అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగామని, నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని, ఈసీ ఆఫ్ డూయింగ్ బిసినెస్ రాష్ట్రాన్ని దేశంలోనే ముందు స్థానంలోకి తెచ్చామని, విశాఖను ఆర్థిక రాజధానిగా ఏర్పాటు చేయడానికి […]