Telugu News » Tag » AP Capital
Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ, అమరావతి కోసం భూములిచ్చిన రైతులు సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. గతంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు.. అంటూ అమరావతి నుంచి తిరుపతి వరకు చేపట్టిన పాదయాత్రకు పెద్దగా ఇబ్బందులేవీ లేవు. అయితే, ఈసారి అమరావతి నుంచి అరసవిల్లి దేవస్థానానికి ప్రారంభించిన యాత్రలో మాత్రం అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. కాగా, ఈ యాత్ర విషయమై తాజాగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఐడీ కార్డులు వున్నవారే […]
Dharmana : వైసీపీ సీనియర్ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు మూడు రాజధానుల కోసం రాజీనామాకు సిద్ధమయ్యారు. రాజీనామా చేసేందుకుగాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. రాజీనామాకు అనుమతివ్వాలంటూ ముఖ్యమంత్రిని కోరారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. అయితే, ధర్మాన ప్రసాదరావుని వారించారు ముఖ్యమంత్రి జగన్. మూడు ప్రాంతాలకు సమ న్యాయమే ధ్యేయమని ముఖ్యమంత్రి ధర్మాన ప్రసాదరావుతో చెప్పారు. ఇప్పటికే రాజీనామా చేసిన ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ.. మూడు రాజధానులకు మద్దతుగా ఇటీవలే వైసీపీ ఎమ్మెల్యే […]
Amaravathi: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది.? అన్న ప్రశ్నకు అధికార వైసీపీ స్పష్టంగా సమాధానం చెప్పడంలేదు. చంద్రబాబు హయాంలో అమరావతిని రాష్ట్ర రాజధానిగా నిర్ణయిస్తే, అప్పటి ప్రతిపక్షం వైసీపీ కూడా ఆ నిర్ణయానికి మద్దతు తెలిపింది. అయితే, అధికారంలోకి వచ్చాక, గత మూడేళ్ళుగా అమరావతి అభివృద్ధి పట్ల వైసీపీ సర్కారు చిత్తశుద్ధి చూపలేదు. ఒకటి కాదు, మూడు రాజధానులంటూ వింత వాదననకు వైసీపీ తెరలేపింది. అప్పటినుంచి, అమరావతి మరింతగా అయోమయంలో పడింది. మూడు రాజధానుల బిల్లు చుట్టూ చాలా […]
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఇటీవల చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంను రేపుతున్నాయి. అమరావతి రైతుల పోరాటం ఏడాది పూర్తి అయిన సందర్బంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో భారీ కార్యక్రమం నిర్వహించారు. అమరావతి శంకుస్థాపన జరిగిన ప్రాంతం వద్దకు వెళ్లిన చంద్రబాబు నాయుడు అక్కడ భూమి పూజ చేసిన మట్టికి సాష్టాంగం పడ్డాడు. ఆ సమయంలోనే సీఎం జగన్ పై విరుచుకు పడ్డాడు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఏం పీకారు అంటూ […]
ఏపీ రాజకీయాలు ఎక్కువగా రాజధాని చుట్టు తిరుగుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అమరావతిని రాజధాని అంటూ ప్రకటించి అభివృద్ది మొదలు పెట్టింది. అమరావతి ఆరంభ దశలో ఉన్న సమయంలోనే సీఎంగా జగన్ రావడంతో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తే రాష్ట్రం బాగా అభివృద్ది చెందుతుంది అంటూ మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం తెలిపడం కూడా జరిగింది. కాని మూడు రాజధానుల బిల్లుకు కోర్టులో అనుమతులు దక్కలేదు. మూడు రాజధానులు అవసరం […]
ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తరలించొద్దని డిమాండ్ చూస్తూ రాష్ట్ర ప్రజలు చేస్తున్న ఉద్యమం ఈ నెల 15కి అంటే రేపటికి ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో అటు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇటు బీజేపీ నేతలు ఈరోజు ఒకేసారి చేసిన కీలక వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమరావతి పోరాటానికి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం విజయవాడలో భారీ ర్యాలీ చేయాలని ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం నిర్ణయించింది. ఈ కార్యక్రమం నగరంలోని బీఆర్టీఎస్ రోడ్డులో ప్రారంభమవుతుందని […]
తెలుగు దేశం పార్టీ పై కోపమో లేదా మరేంటో కాని ఆ పార్టీ ఏర్పాటు చేసిన అమరావతి రాజధానిని రద్దు చేస్తూ రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు అవసరం అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి మొండిగా మూడు రాజధానుల బిల్లును తీసుకు వచ్చాడు. అమరావతి రైతులు దాదాపుగా ఏడాది కాలంగా రాజధాని కోసం ఆందోళనలు చేస్తున్నారు. రాజధాని ప్రాంత రైతుల్లో ఇప్పటికే వంద మంది వరకు జగన్ నిర్ణయం వల్ల ప్రాణాలు విడిచారు అంటూ తెలుగు […]
ఏపీలో ఈమద్య కాలంలో వరుసగా అక్రమ కట్టడాలను కూల్చి వేస్తున్నారు. ప్రభుత్వం ముందస్తు నోటీసులు ఇచ్చి కూల్చి వేస్తున్నాం అంటూ చెబుతుంటే కట్టడాలకు సంబంధించిన యజమానులు మాత్రం తమకు ఎలాంటి నోటీసులు అందలేదు అంటున్నారు. ఇప్పటి వరకు కూల్చి వేతలకు సంబంధించిన విషయాలను కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే రెండు విషయాలు అర్థం అవుతున్నాయి. ఒకటి ఎక్కువ శాతం తెలుగు దేశం పార్టీకి చెందిన వారివి ఉన్నాయి. రెండు ఈ కూల్చివేతలు ఎక్కువ శాతం శని ఆదివారాల్లో ఉంటున్నాయి. […]