Telugu News » Tag » andra pradesh
Pawan Kalyan : ‘అప్పట్లో టీడీపీ ప్రభుత్వం, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం.. ఆ తర్వాత ఇంకో ప్రభుత్వం.. ఇలా ప్రభుత్వాలు మారతాయి. మాతో కూడా మీరు కలిసి పని చేయాల్సి రావొచ్చు. మీరు పనిచేయాల్సింది పార్టీల కోసం కాదు, ప్రజల కోసం. కొందరు పోలీస్ అధికారుల్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేస్తున్నా.. మీరు ఎవరి కోసం పని చేస్తున్నారో, వాళ్ళు ప్రతిపక్షంలో వున్నప్పుడు మీ మీద నమ్మకం లేదని అన్నారు..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, […]
Janasena : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా సహజంగానే జనం పోటెత్తుతారు. 2019 ఎన్నికలకు ముందు చూశాం.. జనసేనాని జనంలోకి వెళితే, ఆయన్ని చూసేందుకు వచ్చే జనం ఎలా వున్నారో.! వేలాది మందిని, లక్షలాది మందిని రప్పించడం జనసేనాని పవన్ కళ్యాణ్‌కి పెద్ద కష్టమైన విషయమేమీ కాదు. కానీ, వారిని అదుపు చేయడమే కష్టం. ఏం జరిగింది 2019 ఎన్నికల్లో.? జనసేనాని పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. చిత్రంగా […]
Balakrishna : నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తోన్న టాక్ షో ‘అన్‌స్టాబుల్’ రెండో సీజన్ మొదటి ఎపిసోడ్‌లో కావాలనే కొన్ని డైలాగుల్ని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా డిజైన్ చేసినట్లున్నారు. వైసీపీ అధినేతని టార్గెట్ చేస్తూ, ‘పబ్జీ’ డైలాగ్ పెట్టించారు. ఇది చంద్రబాబు నిర్వాకమా.? బాలయ్య పైత్యమా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ‘మీరు పబ్జీ ఆడతారా.?’ అంటూ ఒకటికి రెండు సార్లు నందమూరి బాలకృష్ణ, టీడీపీ అధినేత చంద్రబాబుని ప్రశ్నించారు. ‘స్నేక్స్ అండ్ ల్యాడర్’ […]
YSRCP : మూడు రాజధానుల విషయమై సమగ్రమైన బిల్లుని అసెంబ్లీలో పెడతామంటూ గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు.. అది కూడా అసెంబ్లీ సాక్షిగా. అంతకు ముందు తెచ్చిన మూడు రాజధానుల బిల్లు న్యాయ వివాదాల్లో ఇరుక్కోవడంతో వైసీపీ సర్కారే ఆ బిల్లుని వెనక్కి తీసుకుంది. శాసన వ్యవస్థలో న్యాయ వ్యవస్థ జోక్యం ఎంతవరకు సబబు.? అంటూ సభలో చర్చించారు కూడా. కొండను తవ్వి ఎలుకని కూడా పట్టలేదన్న చందాన ఆ వ్యవహారం నడిచింది. తాజా అసెంబ్లీ […]
RK Roja And Nara Lokesh : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ నేత, నగిరి ఎమ్మెల్య, మంత్రి రోజా. నారా లోకేష్‌ని పిల్ల పిత్రేగాడంటూ మండిపడ్డ రోజా, ఎమ్మెల్యేగా గెలవలేక దొడ్డిదారిలో ఎమ్మెల్సీ అయి, మంత్రి పదవి దక్కించుకున్నాడని నారా లోకేష్ మీద విమర్శలు చేశారు. ‘కొడాలి నాని గడ్డంలోని తెల్ల వెంట్రుకని కూడా పీకలేరు..’ అంటూ టీడీపీపై చెలరేగిపోయారు రోజా. […]
Vasundhara Devi : 2019 ఎన్నికల సమయంలో భర్త నందమూరి బాలకృష్ణకు మద్దతుగా చాలా చాలా కష్టపడి ఎన్నికల ప్రచారం చేశారు వసుంధర. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే. చంద్రబాబు తరఫున భువనేశ్వరి ప్రచారం చేయడం, వైఎస్ జగన్ తరఫున భారతి ఎన్నికల ప్రచారం చేయడం.. ఇవన్నీ సర్వసాధారణమైన విషయాలే. అయితే, గత కొంతకాలంగా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, పలు సేవా కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటున్నారట. ఇటీవల స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరు […]
Senior Journalist : ఓ న్యూస్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు లీక్ అవుతున్నాయి. ఈ రోజుల్లో న్యూస్ ఛానళ్ళలో సీనియర్ జర్నలిస్ట్ అన్న ట్యాక్ కొంత మందికి కోట్లు ఆర్జించి పెడుతోందన్నది బహిరంగ రహస్యం. సాధారణంగా అధికార పార్టీ అనుకూల మీడియాకి చెందిన జర్నలిస్టులకైతే పండగే పండగ. కానీ, ఇక్కడ వ్యవహారం వేరేలా వుంది. అధికా పార్టీ మీద నిత్యం పడి ఏడ్చే మీడియాకి చెందిన జర్నలిస్టులూ ఆర్థికంగా అత్యున్నత స్థాయికి ఎదుగుతున్న […]
Bandla Ganesh : ‘కాటన్ దుస్తుల ఛాలెంజులు ఆపి 175 సీట్లకు పోటీ చేస్తున్నారా.? లేదా.? ఇండిపెండెన్స్ డే రోజునైనా ప్రకటించండి..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా సెటైర్‌తో కూడిన సవాల్ విసిరిన విషయం విదితమే. తమలపాకుతో నువ్వొకటిస్తే, తలుపు చెక్కతో నేనొకటిస్తా.. అన్నట్లుంటుంది వ్యవహారం రాజకీయాల్లో. అంబటి రాంబాబుకేనా సెటైర్లేయడం తెలుసు.? పవన్ కళ్యాణ్‌కి లక్షలాది, కోట్లాది మంది వీరాభిమానుల్లేరా.? అందులో ఎంతమంది […]
Janasena Party : జనసేన పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఓటు బ్యాంకు గణనీయంగా పెరగనుందని పలు సర్వేలు చెబుతున్నాయి. రెండింతలు, ఆ పైన ఓటు బ్యాంకు జనసేనకు పెరుగుతుందనే విషయాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా వెల్లడించడంపై రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా జనసేన పార్టీ గ్రామ స్థాయిలో కొంతమేర బలపడిన మాట వాస్తవం. స్థానిక ఎన్నికల్లోనే ఇది నిరూపితమయ్యింది. అయితే, సాధారణ ఎన్నికలకొచ్చేసరికి లెక్కలు మారిపోతాయ్. జనసేన […]
Minister Roja And Pawan Kalyan : కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే నేను.. లక్షలు విలువ చేసే కార్లు కొనుక్కోలేనా అమ్మా.! ఏం న్యాయమిది.? ఏం మాట్లాడుతున్నారు మీరు.? మీరు మాట్లాడే మాటల్లో ఏమన్నా అర్థం వుందా.? అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మినిస్టర్ రోజాకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా కౌంటర్ ఇచ్చారు. కొన్నాళ్ళ క్రితం జనసేన పార్టీ కోసం జనసేనాని కొత్తగా స్కార్పియో కార్లను కొనుగోలు చేసిన విషయం విదితమే. అయితే, […]
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘భీమ్లానాయక్’ సినిమాని అంత తేలిగ్గా మర్చిపోయేలా లేరు. ఔను, ఆ స్థాయిలో ఆ సినిమాని ఆంద్రప్రదేశ్‌లోని అధికార పార్టీ ఇబ్బంది పెట్టింది. మొత్తం వ్యవస్థలన్నిటినీ ‘భీమ్లానాయక్’ సినిమా మీద అప్పట్లో మోహరించిన వైనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే, ఓ సినిమా విషయమై మొత్తంగా అధికారమంతా అడ్డుపడి పని చేయడమన్నది ఇంతవరకూ జరలేదనే చర్చ అప్పట్లో జరిగింది. టిక్కెట్ల ధరల […]
Nara Lokesh : రాజకీయాలెంతలా దిగజారిపోతున్నాయో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. ఆమె వైసీపీ కార్యకర్త. ‘జగనన్న అభిమాని’ అని చెప్పుకుంటుంది. మొన్నీమధ్యనే వెలుగు చూసిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ లీక్ వ్యవహారంలో ఆమెపైనా అనుమానాలొచ్చాయి.. ఆ వీడియోలో గోరంట్ల మాధవ్‌తో వీడియో కాల్ మాట్లాడుతున్నది ఆమేనని. తన మీద టీడీపీ దుష్ప్రచారం చేస్తోందనీ, జనసేన కూడా ఆ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ ఆమె పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు కేసు […]
Pawan Kalyan : మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు.? ఏం చేస్తున్నారు.? సినిమా షూటింగులైతే ప్రస్తుతానికి జరగడంలేదు. కొన్నాళ్ళ క్రితం వైరల్ ఫీవర్ కారణంగా స్వల్ప అస్వస్థతకు గురైన పవన్ కళ్యాణ్, కొన్ని రోజులకే పూర్తిగా కోలుకున్నారు. మరి, రాజకీయ తెరపై ఎందుకు కనిపించడంలేదట.? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చాలా హాట్ టాపిక్స్ నడిచాయి. అందులో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో లీక్ వ్యవహారం ఒకటి. కానీ, […]
YS Sunitha Reddy : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇప్పటికీ మిస్టరీగానే మారింది. ఆయన హత్య కేసును ఛేదించాలంటూ వివేకా కూతురు సునీతా రెడ్డి చాలా రోజుల నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని ఆ మధ్య కోర్టును ఆశ్రయించారు. దీంతో సీబీఐ ఎంక్వేరికి ఆదేశించింది హైకోర్టు. వేరు రాష్ట్రంలో విచారణ… ఒక వైపు సీబీఐ అధికారులు దర్యాప్తు స్పీడప్ […]
Gorantla Madhav : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ విషయంలో అధికార పార్టీ అడ్డంగా బుక్కయిపోయింది. ప్రభుత్వం సైతం ఈ వ్యవహారంలో అభాసుపాలయ్యింది. రాష్ట్ర హోంమంత్రి ఒకలా, అనంతపురం ఎస్పీ ఇంకోలా.. ఈ కేసు గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. సర్క్యులేషన్‌లో వున్న వీడియో ఒరిజినల్ కాదని మాత్రమే ఎస్పీ ఫకీరప్ప చెప్పారు. పైగా, హిందూపురం ఎంపీ తమకు ఫిర్యాదు చేయలేదనీ అన్నారు. […]