Telugu News » Tag » AndhraPradesh
Andhrapradesh : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఇటీవల పార్టీ శ్రేణుల్ని, ముఖ్య నేతల్ని ఉద్దేశించి ‘త్యాగాలకు సిద్ధమవ్వాలి..’ అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. జనసేన అలాగే టీడీపీతో పొత్తు దిశగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 2024లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. అయితే, అప్పుడే ఎన్నికల హంగామా కనిపిస్తోంది రాజకీయ వర్గాల్లో.! జనసేనతో పొత్తు దాదాపు ఖాయమైపోయిందని తెలుగు తమ్ముళ్ళు చెప్పుకుంటున్నారు. అయితే జనసేనకు కేటాయించేది 25 నుంచి 30 అసెంబ్లీ నియోజకవర్గాలు […]
30 Years Prudhvi : టాలీవుడ్ ప్రేక్షకులకు 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ సుపరిచితుడుగా మారిన పృథ్వీ ప్రస్తుతం తీవ్ర వడిదుడుకులను ఎదుర్కొంటున్నాడు. హాయిగా కమెడియన్ గా సినిమాలు చేసుకోక ఏదో పొడి చేద్దాం అన్నట్లుగా రాజకీయాల్లోకి వెళ్లి వైకాపాలో జాయిన్ అయ్యాడు. అక్కడ నానా కష్టాలు పడి.. జగన్ ను మచ్చిక చేసుకునేందుకు నోటికి వచ్చినట్లుగా ప్రత్యర్థులను తిట్టి చివరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో ఒక పదవిని దక్కించుకున్నాడు. దాన్ని సరిగా నిలబెట్టుకోలేక పోయాడు. […]
Sr NTR : స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎలా చనిపోయారు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. వృధ్యాప్యానికి తోడు, మానసిక వ్యధ ఆయన మరణానికి కారణంగా చెబుతారు. భార్య లక్ష్మీపార్వతి ఆయన మరణానికి కారణమని కొందరు అంటుంటారు. చంద్రబాబు పొడిచిన వెన్నుపోటు వల్లనే.. అంటారు ఇంకొందరు. ఏది నిజం.? ఏమోగానీ, ‘స్వర్గీయ నందమూరి తారక రామారావుని చంపేశారు..’ అంటూ తాజాగా ఆయన సతీమణి లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు చేశారు. అప్పుడెప్పుడో చంపేస్తే, ఇన్నాళ్ళూ ఎందుకు లక్ష్మీపార్వతి పోలీసులను […]
Chandrababu: గత 40 ఏళ్లుగా రాజకీయాల్లో తన వెన్నంటి నిలిచిన కుప్పం నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునేందుకు స్థానిక శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఎట్టకేలకు కదిలారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అక్కడి ప్రజల్ని ఆదుకోవటం కోసం సొంత నిధులు కోటి రూపాయలు వెచ్చించేందుకు ముందుకు వచ్చారు. ఇవాళ శుక్రవారం కుప్పంలోని పార్టీ లీడర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తన సెగ్మెంటులో యుద్ధప్రాతిపదికన వైద్య సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. దీనిపై జిల్లా కలెక్టర్ […]
AP-TS: కరోనా వైరస్ సెకండ్ వేవ్ నేపథ్యంలో అత్యవసర వైద్య సేవల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య స్వల్ప వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే అంబులెన్సులను తెలంగాణలోకి రానీయట్లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వ లేదా సంబంధిత ఆస్పత్రి అనుమతి ఉంటే అభ్యంతరం చెప్పట్లేదని తెలంగాణ అంటోంది. ఈ నేపథ్యంలో కొందరు తెలంగాణ హైకోర్టుకి వెళ్లారు. దీంతో ఏపీ అంబులెన్సులకు పర్మిషన్ ఇవ్వకపోవటం సరికాదని న్యాయస్థానం పేర్కొంది. అయినా ఈరోజు శుక్రవారం మళ్లీ […]
AP panchayat elections : ఏపీ పంచాయతీ ఎన్నికల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)కి మధ్య నెలకొన్ని విభేదాలు ఈరోజు(శనివారం) తారస్థాయి చేరాయి. ఇప్పటికే మంత్రులు బొత్స, పెద్దిరెడ్డిలపై యాక్షన్ తీసుకోవాలంటూ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కి ఫిర్యాదు చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ ఏకంగా తానే రంగంలోకి దిగి క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పెద్ద షాక్ ఇచ్చారు. ఆయన్ని ఈ నెల 21 వరకు (అంటే […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే వైఎస్సార్సీపీ తన మేనిఫెస్టోలోని 95 శాతం హామీల్ని అమలు చేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆస్తిని, స్థిరాస్తిని అందించేందుకు గొప్ప కార్యక్రమం చేపట్టామని తెలిపారు. అర్హులైన అందరికీ ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇచ్చే ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు బుధవారం ఆయన విజయనగరం జిల్లా గుంకలాంకి వచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమోషనల్ గా మాట్లాడారు. ఇది మూడో పండగ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో […]
ఎవరు ఊహించని కరోనా మహమ్మారి ఈ భూమి మీద అడుగుపెట్టి ప్రపంచాన్ని చిన్నా భిన్నం చేసింది. కరోనా వలన ఎవరు ఊహించని మార్పులు వచ్చాయి. పిల్లలకు ఆన్‌లైన్ క్లాసులు, ఉద్యోగులకు ఇంటి దగ్గర నుండి పని చేసే అవకాశం, థియేటర్స్ దాదాపు 9 నెలల పాటు మూతపడడం, సినిమా షూటింగ్స్ ఆగిపోవడంతో ఎప్పుడు బిజీగా ఉండే సెలబ్రిటీలు 9 నెలల పాటు తమ ఫ్యామిలీతో కలిసి గడపడం వంటివి ఇలా ఎన్నో చాలా ఊహించనివి జరిగాయి. కరోనా […]
‘ వివాహం విద్య నాశనయహ-శోభనం సర్వనాశయహ ‘ అంటారు. పెళ్లి చేసుకుంటే చదువు ఇక అటకెక్కినట్లేనని, కార్యం జరిగితే సర్వం కోల్పోయినట్లేనని పెద్దలు చెబుతుంటారు. మనిషికి ఎడ్యుకేషన్ ఎంత ముఖ్యమో తెలిపే మాటలివి. ఉన్నత చదువులు చదువుకొని, మంచి ఉద్యోగం సంపాదించి, జీవితంలో స్థిరపడినప్పుడు పెళ్లి చేసుకుంటే ఆర్థికంగా గానీ దాంపత్యపరంగా గానీ ఇబ్బందులు రావనేది వీటి ఉద్దేశం. కానీ.. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివే ఇద్దరు మైనర్లు […]
ఏది మాట్లాడాలన్నా కానీ ఆచీ తూచి మాట్లాడాలని మన పెద్దలు అంటూనే ఉంటారు. మనం ఏ చిన్న తప్పు మాట్లాడినా గాని బుక్ అయిపోయినట్లే. సామాన్యుల వరకు ఇది ఓకే.. ఎందుకంటే సామాన్యులు ఏమి మాట్లాడిన గాని పెద్దగా పట్టించుకోరు. అదే రాజకీయ నాయకులు గాని, సినీ ప్రముఖులు గాని, సెలెబ్రిటీలుగాని ఏది మాట్లాడిన సరే అది కాస్త వైరల్ అవుతుంది. అందుకనే మాట్లాడే ముందు.. కాస్త ముందు వెనుక చూసి మాట్లాడమంటారు పెద్దలు. సాధారణంగా ఏ […]
ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉనికి కోసమే నానా అవస్థలు పడిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు తమదే అంటూ వీగిపోతోంది. తెలంగాణాలో అంటే మొదటి నుండి ఆ పార్టీకి బండారు దత్తాత్రేయ లాంటి కొందరు లీడర్లు ఉన్నారు. అందుకే ఈనాటికి బలపడగలిగింది. కానీ ఏపీలో ఒక్క వెంకయ్య నాయుడు మినహా ఆ పార్టీలు చెప్పుకోదగిన నేతలు ఉండేవారు కాదు. వెంకయ్యనాయుడు కూడ జాతీయ రాజకీయాల్లోనే ఎక్కువ దృష్టి పెట్టడం మూలాన ఆంధ్రా ప్రాంతంలో పెద్దగా హడావిడి కనిపించేది కాదు. కానీ రాష్ట్రం విడిపోయాక బీజేపీ పుంజుకుంది. అందుకు ప్రధాన కారణం […]
వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదాల మీద వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. 30 లక్షల మంది పేదలకు ఉచితంగా భూములిచ్చి అందరి మన్ననలు పొందాలనేది జగన్ ప్లాన్. ఉగాది రోజునే ఈ కార్యక్రమం చేయాలని వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. కోర్టులో అనేక పిటిషన్లు పడ్డాయి. న్యాయస్థానం ఇళ్ల పట్టాల పంపిణీపై స్టే ఇచ్చింది. దీంతో ఎంతో గొప్పగా చేయాలనుకున్న ఇళ్ల పట్టాల పంపిణీ నవ్వులపాలైపోతోంది. పలుసార్లు ఆశజూపి నిరాశ మిగల్చడంతో లబ్ధిదారుల్లో సైతం విసుగొచ్చేసింది. దీంతో […]
కేంద్రంతో సఖ్యతగా ఉంటేనే భవిష్యత్తు బాగుంటుందని భావించేవారు వైఎస్ జగన్. బీజేపీ ప్రభుత్వం కూడ వైసీపీ లాంటి పెద్ద పార్టీని, జగన్ లాంటి ప్రజాదరణ ఉన్న నాయకుడిని దగ్గర పెట్టుకుంటే మంచిదని భావిస్తూ వచ్చింది. గత ఏడాదిన్నర కాలంగా ఇదే మైండ్ సెట్ తో వ్యవహరించిన రెండు పార్టీలు పరస్పరం సహకారం అందించుకుంటూ వచ్చాయి. కేంద్రం ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకు మారు మాట్లాడకుండా జగన్ మద్దతిస్తే రాష్ట్రంలో జగన్ తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకించకుండా బీజేపీ సపోర్ట్ చేసింది. కానీ అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. అందుకు కారణం బీజేపీనే అనక […]
ఎన్నికల హామీల విషయంలో ఏ నాయకుడైనా తమకు, తమ పార్టీకి ప్రయోజనం కలిగేలా, జనం ఆకర్షితులు అయ్యేలా చూసుకుంటారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి ప్రత్యర్థుల సంగతిని పక్కనబెట్టి మేనిఫెస్టోలో తమకు అనుకూలంగా ఉండేలానే సంక్షేమ పథకాలను రూపొందించుకుంటారు. కానీ జగన్ మాత్రం తన ఎన్నికల హామీలను తనకు మేలు జరగడమే కాదు టీడీపీకి హాని జరిగేలా కూడ చూసుకున్నారు. దీన్నే ముందుచూపు అంటారు. గెలుపు మీద ఎంతో నమ్మకం ఉంటే తప్ప ఇలాంటి ప్లానింగ్ […]
అంతర్గత కలహాలు ప్రతి పార్టీలోనూ ఉంటాయి. కానీ సకాలంలో వాటిని గుర్తించి పరిష్కారం చేసుకునే పార్టీలే ఎక్కువ కాలం నిలబడతాయి. లేకపోతే ఆకాశంలో ఉన్నా సరే పతనం కావాల్సిందే. ప్రస్తుతం ఇలాంటి ప్రమాద ఘంటికలే వైసీపీలో వినబడుతున్నాయి. ఆ పార్టీలో అసంతృప్తులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. అధిష్టానానికి, కొందరు నేతలకు సమన్వయం కుదరట్లేదు. 151 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో అందరినీ అసంతృప్తి పరచడం హైకమాండ్ వల్ల కావట్లేదు. అన్నీ తానై చూసుకోలేకపోతున్నారు జగన్. అందుకే జిల్లాలను మూడు భాగాలుగా విభజించి ముగ్గురుకి అప్పగించారు. ఎక్కడికక్కడ మంత్రులకు […]