Telugu News » Tag » Amit Shah
Amit Shah : ఈ నడుమ కేంద్ర హోం మంత్రి అమిత్ షా సినీ సెలబ్రిటీలతో వరుసగా భేటీ అవుతున్నారు. మొన్న రాష్ట్రానికి వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ను, నితిన్ ను కలిశారు. ఇప్పుడు ఆయన మరోసారి హైదరాబాద్ రాబోతున్నారు. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి అమిత్ షా చేరుకోనున్నారు. రేపు ఉదయం రాజమౌళి, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ నివాసాలకు వెళ్లనున్నారు. ముందుగా రాధాకృష్ణ ఇంటికి ఉదయం 11.05 వెళ్లి 11.35 […]
Sitaram Idol : అయోధ్య రామ మందిరం నిర్మాణం చివరి దశకు చేరుకుంది. రామాలయంలో ప్రతిష్టించబోతున్న శ్రీరాముడు, సీతాదేవి విగ్రహాల తయారీ కార్యక్రమం మొదలయింది. సీతారాముల విగ్రహం తయారీ కోసం అత్యంత ప్రత్యేకమైన రాళ్లను నేపాల్ దేశం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభుత్వం తెప్పించింది. ఇప్పటికే గోరక్ పూర్ కి చేరుకున్న ఆ అతి పెద్ద పవిత్రమైన రాళ్లు అయోధ్యకు తరలించే కార్యక్రమం జరుగుతుంది. సీతారాముల విగ్రహం తయారీ కోసం నేపాల్ నుండి తెప్పిస్తున్న ప్రత్యేక […]
BJP And Aam Aadmi Party : దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరియు హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం అయినా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు వాడి వేడిగా జరగబోతున్నాయి. గుజరాత్ లో ఇప్పటి వరకు ఆరు సార్లు బిజెపి అధికారంలో దక్కించుకుంది. అద్భుతమైన ఫలితాన్ని దక్కించుకుంటూ గుజరాత్లో బిజెపి నిలిచింది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్లో అధికార పగ్గాలు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. […]
Telangana : ‘నేను తెలంగాణకు వెళుతున్నా.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. ప్రజలు బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు సిద్ధంగా వున్నారు..’ అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తాజాగా ఓ జాతీయ న్యూస్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ మరింత బలపడిందన్న అమిత్ షా, దక్షిణాది రాష్ట్రాల్లోనూ బీజేపీ పాగా వేస్తోందని చెప్పుకొచ్చారు. దేశంలో అన్ని రాష్ట్రాల్నీ తమ ప్రభుత్వం సమానంగా చూస్తోందనీ, ఏ రాష్ట్రం పట్లా వివక్ష తమ […]
Telangana State : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు ప్రధాని నరేంద్ర మోడీ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది అంటూ రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలను సీఎం కేసీఆర్ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సిబిఐ కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నో ఎంట్రీ చెప్పేసింది. తెలంగాణలోకి సిబిఐ ప్రవేశాన్ని అడ్డుకోవాలని నిర్ణయాన్ని ముఖ్య మంత్రి కేసీఆర్ గతంలోనే చేశారంటూ అధికారులు తెలియజేశారు కానీ కొన్ని కారణాల వల్ల […]
Telangana TRS Vs Telangana BJP : సెప్టెంబర్ 17వ తేదీ.. తెలంగాణలో సరికొత్త రాజకీయ హంగామాకి కారణమైంది. వివిధ రాజకీయ పార్టీలు, ఈ రోజు ప్రత్యేకమైన కార్యక్రమాలు తెలంగాణ వ్యాప్తంగా చేపట్టాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడిగా, కేంద్ర ప్రభుత్వం విడిగా వేడుకలు నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వానికీ ఆహ్వానం పలికింది.. విమోచోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా కోరుతూ. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి అతిథులు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం అతిథులు కేంద్రం […]
Amit Shah And Prabhas : తెలంగాణలో ఎలాగైనా అధికారం సంపాదించాలని కలలుగంటున్న బీజేపీ పెద్దలు ఇక్కడ అందివచ్చే ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. తెలంగాణలో ఏది జరిగినా దాన్ని రాజకీయంగా వాడుకునేందుకు ఢిల్లీ నుంచి వాలిపోతున్నారు. ఇటీవల మునుగోడు సభకు వచ్చిన కేంద్రహోంమంత్రి అమిత్ షా టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ తో భేటి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్టీఆర్ ను పార్టీలోకి ఆహ్వానించారని.. ఆయనతో తెలంగాణలోని ఆంధ్రా ఓటర్ల ఓట్లు, కమ్మవారిని తమవైపు తిప్పుకునేందుకు […]
Prabhas : కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 17న హైద్రాబాద్ రానున్న సంగతి తెలిసిందే. తెలంగాణ విమోచన దినోత్సవం నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైద్రాబాద్ వస్తున్నారు. హైద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. కాగా, గతంలో అమిత్ షా హైద్రాబాద్ వచ్చినప్పుడు ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుతోనూ, సినీ నటుడు జూనియర్ ఎన్టీయార్‌తోనూ భేటీ అయిన సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా […]
Amit Shah And Nikhil : కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా, త్వరలో హైద్రాబాద్ రాబోతున్నారు. అమిత్ షా హైద్రాబాద్ పర్యటనలో యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధతో భేటీ అవుతారు. ‘కార్తికేయ-2’ సినిమా ఘనవిజయం సాధించిన దరిమిలా, హీరోని అభినందించనున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. కాగా, సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవంగా బీజేపీ నిర్వహిస్తున్న విషయం విదితమే. కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా […]
NTR : టాలీవుడ్ ఇప్పటికే చాలా కష్టాలనే ఎదుర్కొంటుంది. నిర్మాతలు పెట్టిన పెట్టుబడి రావడం లేదంటూ ఇటీవల నెల రోజుల పాటు బంద్ కూడా ప్రకటించి షూటింగ్ లు జరపకుండా ఆపి వేశారు. ఇక హీరోలు మరియు టెక్నీషియన్స్ ఇంకా నటీనటులు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటున్నామంటూ ఆందోళన చేస్తూ ఉన్నారు. సినిమాల సక్సెస్ రేటు ఎక్కువ లేకపోవడంతో నిర్మాతలు సినిమాలను నిర్మించేందుకే ముందుకు రావడం లేదు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ […]
Somu Veeraju : బీజేపీ కోసం జూనియర్ ఎన్టీయార్ సేవల్ని వాడుకుంటామంటూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీయార్‌కి ప్రజామోదం వుందనీ, జనాల్ని ఆకర్షించగల శక్తి ఆయనకు వుందనీ, ఆయన సేవల్ని భవిష్యత్తులో తమ పార్టీ ఉపయోగించుకుంటుందనీ సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. నిజానికి, జూనియర్ ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీ మనిషి. టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీయార్ చేపట్టాలనే డిమాండ్ టీడీపీలో చాలాకాలంగా వుంది. కానీ, చంద్రబాబు తన పుత్ర రత్నం లోకేష్ […]
Telangana Movement : భారతదేశంలో తెలంగాణ ప్రాంతం విలీనమయ్యింది దాదాపు డెబ్భయ్ ఏళ్ళ క్రితం. తెలంగాణకు భారత ప్రభుత్వం ద్వారా నిజాం ప్రభుత్వం నుంచి విమోచన లభించింది.! దీన్ని కొందరు విద్రోహం అని కూడా అంటుంటారు. ఇందులో ఏది నిజం.? అంటే, ఆయా వ్యక్తులు లేదా పార్టీల ఆలోచన విధానాల్ని బట్టి వుంటుందనుకోండి.. అది వేరే సంగతి. తెలంగాణ ఉద్యమంలో సెప్టెంబర్ 17వ తేదీకి చాలా ప్రాధాన్యత వుండేది. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక, సెప్టెంబర్ 17వ […]
Jr NTR And Kodali Nani : యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి ఒకప్పుడు అత్యంత సన్నిహితుడు కొడాలి నాని. ప్రస్తుతం వైసీపీలో వున్న కొడాలి నాని, గతంలో తెలుగుదేశం పార్టీ నేత. వైఎస్ జగన్ హయాంలో మంత్రిగా పని చేశారు కొడాలి నాని. అయితే, మూడేళ్ళ తర్వాత పదవిని కొనసాగించుకోలేకపోయారాయన. ప్రస్తుతం గుడివాడ ఎమ్మెల్యేగా కొడాలి నాని వున్నారు. ఇటీవల బీజేపీ జాతీయ నాయకుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైద్రాబాద్ వచ్చినప్పుడు జూనియర్ […]
Kodali Nani : నిన్న రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద ఉన్న హోటల్ నొవోటెల్ లో అమిత్ షా – ఎన్టీఆర్ ల భేటీ జరిగింది. సుమారు 45 నిమిషాల పాటు సమావేశం జరిగితే… వీరిద్దరూ ఏకాంతంగా 20 నిమిషాల పాటు చర్చించుకున్నారు. అనంతరం భోజనం చేశారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనని మెచ్చుకునే క్రమంలోనే అమిత్ షా.. ఎన్టీఆర్‌ని కలిసారని ప్రచారం జరుగుతుండగా, కొందరు నేతలు మాత్రం భేటిపై అనేక విషయాలు చెప్పుకొస్తున్నారు. […]
Bandi Sanjay : ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ , బీజేపీ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఒకరిపై ఒకరు అవాకులు చెవాకులు పేల్చుకుంటున్నారు. అయితే ఆగస్టు 21న తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ ఆలయాన్ని సందర్శించగా, ఆలయం నుండి బయటకు వచ్చాక బండి సంజయ్ అమిత్ షా చెప్పులు పట్టుకొని అతనికి అందించారు. బండి సంజయ్ వ్యవహరించిన తీరును కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు విమర్శించారు. స్ట్రాంగ్ కౌంటర్.. సీఎం కేసీఆర్ తనయ […]