Telugu News » Tag » amaravati
Amaravati : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో జగన్ సర్కారుకి సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించినట్లయ్యింది. అయితే, రాజధానిలో నిర్మాణాల్ని ఆరు నెలల్లో పూర్తి చేయాలన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించడం ద్వారానే ఈ ఊరట లభించింది. రాజధానిని ఎలా అభివృద్ధి చేయాలన్నదానిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించలేమనీ, అలా ఆదేశించడానికి హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా.? హైకోర్టు ప్రభుత్వంలా వ్యవహరిస్తే, క్యాబినెట్ ఎందుకు.? అని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నలు సంధించింది. మూడు రాజధానులకు గ్రీన్ […]
PM Narendra Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన కోసం వైసీపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. అటు పార్టీ తరఫున, ఇటు ప్రభుత్వం తరఫున కూడా.. అన్నట్లుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని రాకతో రాష్ట్రానికి పండగ.. అంటోంది వైసీపీ. నిజానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికితే సరిపోతుంది. అధికారిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటే సరిపోతుంది. కానీ, […]
Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ, అమరావతి కోసం భూములిచ్చిన రైతులు సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. గతంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు.. అంటూ అమరావతి నుంచి తిరుపతి వరకు చేపట్టిన పాదయాత్రకు పెద్దగా ఇబ్బందులేవీ లేవు. అయితే, ఈసారి అమరావతి నుంచి అరసవిల్లి దేవస్థానానికి ప్రారంభించిన యాత్రలో మాత్రం అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. కాగా, ఈ యాత్ర విషయమై తాజాగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఐడీ కార్డులు వున్నవారే […]
Amaravati : ఒక వైపు ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ ప్రచారం చేస్తూనే మరో వైపు అమరావతిలో కీలక మార్పులకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుగు దేశం పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. తాజాగా అమరావతి ప్రాంతంలో పేదల కోసం ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసి అక్కడ వారి ఇళ్ల నిర్మాణం కు ప్రభుత్వం సహకారం అందించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. గవర్నర్ ఆమోద ముద్ర…. రాజధాని లోని ఐదు గ్రామాల పరిధిలో 900 ఎకరాల భూమిని […]
Andhra Pradesh : ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు. మూడు రాజధానుల వ్యవహారంపై ఎటూ తేలడంలేదు గానీ, కొత్తగా పలు డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి రాజధానుల విషయమై. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతానికైతే ఒకే ఒక్క రాజధాని వుంది. అదే అమరావతి. కానీ, దాన్ని అధికార వైసీపీ గుర్తించడంలేదు. మంత్రులెవరూ అమరావతిని రాజధానిగా అంగీకరించడంలేదు.. ముఖ్యమంత్రిదీ అదే పరిస్థితి. మూడు రాజధానులైతేనే అమరావతిని శాసన రాజధానిగా గుర్తిస్తాం.. లేదంటే, అమరావతి స్మశానం […]
Minister Botsa Satyanarayana : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతానికైతే అమరావతి మాత్రమే రాజధాని. వైసీపీ చెబుతున్నట్లు ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అన్న కోణంలో చూసినా, అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతిలో ఇల్లు కట్టుకున్నారు, అక్కడి నుంచే పరిపాలన కూడా సాగిస్తున్నారు. శాసనసభ, హైకోర్టు, సెక్రెటేరియట్.. అన్నీ అమరావతిలోనే వున్నాయి. అమరావతి కాకుండా ప్రస్తుతం రాష్ట్రానికి ఇంకో రాజధాని వుందని ఎలా చెప్పగలం.? కానీ, మంత్రి బొత్స […]
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని లేదా రాజధానుల చుట్టూ జరుగుతున్న రాజకీయం చూస్తోంటే, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవసరమే లేదన్నట్లు అక్కడి అధికార పార్టీ వ్యవహరిస్తోందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి.! చంద్రబాబు హయాంలో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక్క రాజధాని సరిపోదు, మూడు రాజధానులతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి.. అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వస్తున్నారు. ఒక్కటే వద్దు.. మూడైతే ముద్దు.. అసలంటూ ఏదీ వద్దు.! […]
Amaravati : అమరావతి రైతులు మరోమారు మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. గతంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు.. అంటూ అమరావతి నుంచి తిరుపతికి మహా పాదయాత్ర నిర్వహించారు అమరావతి కోసం భూములిచ్చిన రైతులు. ఇప్పుడేమో, అదే అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవెల్లికి మహా పాదయాత్ర చేపట్టనున్నారు. అయితే, షరామామూలుగానే అమరావతి రైతుల మహా పాదయాత్రకు పోలీసు శాఖ ‘రెడ్ సిగ్నల్’ వేసింది. పాదయాత్రకు అనుమతిచ్చేది లేదని సాక్షాత్తూ డీజీపీ స్పష్టం చేశారు. […]
Somu Veerraj : ‘మీరిద్దరూ కలిసి కదా, అమరావతిని నాశనం చెయ్యాలని చూసింది..’ అంటూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఓ వృద్ధుడు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుని నిలదీశాడు. ‘మనం మన అమరావతి’ పేరుతో బీజేపీ చేపట్టిన యాత్రలో సోము వీర్రాజు పాల్గొన్నారు. ఆగస్టు 4 వరకు రాజధాని గ్రామాల్లో ఈ యాత్ర సాగుతుందట. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన తర్వాత ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవసరమైంది. రాజధాని విషయమై కేంద్రం నియమించిన కమిటీ ఏం […]
YCP leaders : విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయి తీరుతుందనీ, చంద్రబాబు కాదు కదా, ఇంకెవరు అడ్డొచ్చినా విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవకుండా ఆపలేరనీ పదే పదే వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. ఇంతకీ, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవుతుందా.? లేదా.? న్యాయస్థానాల్లో కేసులున్నంత మాత్రాన, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవకుండా ఆగిపోదు. ప్రభుత్వానికి ఈ విషయంలో చిత్తశుద్ధి వుండాలి. అదే అసలు సమస్య. మూడు రాజధానులంటూ ప్రకటించేస్తే సరిపోదు. సరైన అధ్యయనం లేకుండా, రాష్ట్రానికి మూడు […]
YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చెయ్యాలనుకున్నారు. కర్నూలుని జ్యుడీషియల్ క్యాపిటల్‌గా మార్చాలనుకున్నారు. పూర్తిస్థాయి రాజధాని అమరావతిని కేవలం శాసన కార్యకలాపాలకే పరిమితం చేయాలనుకున్నారు. కానీ, వైఎస్ జగన్ ఆలోచనలు ఫలించలేదు. వైసీపీ ప్రభుత్వమే మూడు రాజధానుల బిల్లుని అసెంబ్లీలో పెట్టి, దాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, మూడు రాజధానులనేది జరిగే పని కాదు. ఆ విషయాన్ని గ్రహించలేనంత అమాయకత్వం అయితే […]
Amaravati: రాజధాని అమరావతి నిర్మాణానికి 60 నెలల సమయం పడుందంటోంది వైఎస్ జగన్ సర్కారు. ఈ మేరకు కోర్టులో ప్రభుత్వం తరఫున అఫిడవిట్ దాఖలు చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. చంద్రబాబు హయాంలో సుమారు 40 వేల కోట్ల రూపాయల మేర ఖర్చుతో పనులు ప్రారంభమయ్యాయనీ, వాటికి సంబంధించి రుణాల సమీకరణ ప్రారంభమయ్యిందనీ, అయితే బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడంలేదని ఏపీ ప్రభుత్వం కోర్టుకు పంపిన అఫిడవిట్‌లో పేర్కొనడం గమనార్హం. మూడు రాజధానుల చట్టానికి […]
అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ కన్వినర్ శివారెడ్డి తాజాగా సీఎం జగన్ ను లేఖ రాశారు. అమరావతి రాజధానిపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండిస్తూ.. సీఎం వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అమరావతి రాజధాని అనేది ఒకే కులానికి చెందినది కాదని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీ వేరు.. ఇప్పుడు ఉన్న ఏపీ వేరు. 13 జిల్లాలతో చిన్న రాష్ట్రంగా మిగిలిపోయింది. కాబట్టి అమరావతిని స్వాగతిస్తున్నాం.. అంటూ చెప్పింది మీరు కాదా.. […]
రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాల పంపిణి కార్యక్రమం మొదలైంది. దాదాపు 30 లక్షల ఇళ్ల పట్టాల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరిగింది. తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో ఇళ్ల స్థలాల పంపిణీకి హాజరైన సీఎం జగన్ ప్రసంగిస్తూ.. కేసులు, స్టేలు ఉండడంతో 3.74 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోయామని తెలిపారు. అమరావతిలో 54 వేల మంది పేదలకు పట్టాలివ్వాలని చెప్పుకొచ్చాడు. కార్యాచరణ చేపట్టి ముందడుగు వేస్తే.. కులపరమైన అసమతుల్యత […]
పేదవాడి సొంటింటి కల నేడు నిజమైందని, తమకు కూడా ఇల్లు ఉందని గర్వంగా తలెత్తుకు జీవించే పరిస్థితి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కల్పించారని మంత్రి పేర్ని నాని అన్నారు. ఇబ్రహీంపట్నం గాజులపేటలో పేదల ఇంటి స్థలాల లే – అవుట్ వద్ద జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వసంత వెంకటకృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ “పేదలు […]