కేరళ: కేరళలోని కోజికోడ్ విమానాశ్రమంలో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం రన్ వే పై నుండి అదుపుతప్పి 35 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తీసుకురావడానికి చేపట్టిన ‘వందే భారత్ మిషన్’ కార్యక్రమంలో భాగంగా ఎయిర్ ఇండియాకు సంబంధించిన బోయింగ్ 737(ఫ్లైట్ ఐఎక్స్ 1344) దుబాయ్ నుండి కేరళకు బయలుదేరింది. కోజికోడ్ లోని రన్ వే-10పై […]