Telugu News » Tag » సీఎం కేసీఆర్
Eatala: ఈటల రాజేందర్ కుటుంబం ఈరోజు ఆదివారం వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. ఆయన మరికొద్దిసేపట్లో దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. ఈటల సతీమణి జమున ఇటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మీడియా సమావేశం పెట్టి సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరతారనే వార్తల నేపథ్యంలో ఆయన హస్తినకు పయనం కావటం గమనార్హం. అదే ధైర్యంతో అన్నట్లుగా ఆయన భార్య తొలిసారి తెర మీదికి వచ్చి రాష్ట్ర ప్రజలకు తన వాదన […]
Lock Down: తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ని మరోసారి పొడిగించారు. ఇంకో పది రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నాలుగు గంటల సేపు సడలింపు ఇస్తుండగా ఇకపై మధ్యాహ్నం ఒంటి గంట వరకు జనం బయట తిరగొచ్చని, రెండింటి లోపు ఇంటికి చేరాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇవాళ ఆదివారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన […]
Rythubandhu : తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ శనివారం శుభవార్త చెప్పింది. వచ్చే నెల అంటే జూన్ 15వ తేదీ నుంచి రైతుబంధు డబ్బులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 15వ తేదీ నుంచి 25వ తేదీ లోపు పది రోజుల్లో అందరికీ ఈ ఆర్థిక సాయాన్ని వాళ్ల బ్యాంకు ఖాతాల్లో వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఈరోజు వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. ‘పార్ట్-బీ’ నుంచి ‘పార్ట్-ఏ’లోకి చేరిన రైతులకు కూడా […]
Bandi: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సార్ నిన్న గురువారం ఆణిముత్యాల్లాంటి కొన్ని మాటలు వదిలాడు. కాబట్టి వాటి గురించి ఇవాళ గొప్పగా చెప్పుకోవాలి. సీఎం కేసీఆర్ ఏడేళ్లుగా ప్రగతిభవన్ నుంచి బయటికి రాలేదంట. ఇది వందకు రెండొందల శాతం నిజం. ‘‘బండి సంజయ్ కుమార్ అస్సలు అబద్ధాలాడడు’’ అనటానికి ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు. ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ ఆస్పత్రిలో గంట సేపు ఉండి ఏడేళ్లకు సరిపోను ప్రచారం చేసుకున్నాడంట. సీఎం కేసీఆర్ […]
KCR : ఇప్పుడు కాదు.. 2014 నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ వర్సెస్ ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్టుగా ఉంది వ్యవహారం. 2014 నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో కావచ్చు.. ఇతర హామీల విషయంలో కావచ్చు.. తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఎప్పుడూ గొడవలే. కేంద్రం కూడా తెలంగాణపై చిన్నచూపు చూస్తోందనే భావన కూడా అందరిలో ఉంది. అందుకే.. సీఎం కేసీఆర్ కూడా అప్పట్లో కేంద్రంపై కాస్త దూకుడుగానే ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ […]
AP-TS: రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇవాళ గురువారం రెండు ముఖ్యమైన అప్డేట్స్ చోటుచేసుకున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించబోమని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తేల్చిచెప్పింది. పరిస్థితులు కుదుటపడ్డాకే జరపుతామని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఏపీలో మూడు స్థానాలు ఈ నెలాఖరున, తెలంగాణలో ఆరు సీట్లు జూన్ మూడో తేదీన ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు సీఈసీకి రీసెంటుగా లెటర్ […]
KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెచ్చుకున్నట్లు రాష్ట్ర సర్కారు మొన్నీమధ్య చెప్పుకోవటాన్ని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కరోనా కంట్రోల్ కోసం సీఎం కేసీఆర్ ఇచ్చిన సలహాలను, సూచనలను విని పీఎం మోడీ ప్రశంసించినట్లు ప్రచారం చేసుకోవటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంకా నయం.. ఢిల్లీకి పిలిచి సన్మానం చేస్తామన్నట్లు ప్రకటించుకోలేదు.. సంతోషం అని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. […]
KCR : తెలంగాణ సీఎం కేసీఆర్, వైఎస్ షర్మిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల దూకుడుతనం వల్లే వాళ్లిద్దరి మధ్య వైరం ఏర్పడింది. డైరెక్ట్ గా ఆమె సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండటం టీఆర్ఎస్ పార్టీ నేతలకు కూడా మింగుడు పడటం లేదు. దీంతో వైఎస్ షర్మిల, టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది. రాజకీయంగా షర్మిల ఎక్కువగా సీఎం కేసీఆర్ నే […]
CM KCR : తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్నోళ్లకు, మరో 80 వేల మంది ప్రైవేట్ టీచర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఆదివారం శుభవార్త చెప్పారు. రేషన్ కార్డులో పేర్లు ఉన్నోళ్లకు ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున అదనపు బియ్యాన్ని ఉచితంగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీన్ని రెండు నెలల పాటు అమలు చేయాలని స్పష్టం చేశారు. దీంతోపాటు రాష్ట్రంలోని సుమారు లక్షా 20 వేల మంది ప్రైవేట్ టీచర్లకు నెలకు రూ.2,000 నగదు, 25 […]
Modi-Kcr : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ ఆదివారం రాత్రి ప్రశంసించారు. కరోనా నియంత్రణ కోసం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. వాటిని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ప్రధాని మోడీకి తెలియజేశారు. దీంతో మోడీ కేసీఆర్ కి ఫోన్ చేసి ‘మీరు ఇచ్చిన సూచనలు సలహాలు బాగున్నాయి’’ అని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి మరింత ఆక్సీజన్ అందించాలని, రెమ్ డెసివిర్ […]
KCR: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన అధికారిక నివాసమైన ప్రగతిభవన్ కి 20 రోజుల విరామం తర్వాత ఇవాళ గురువారం మధ్యాహ్నం వచ్చారు. కరోనా వైరస్ పాజిటివ్ అని తేలటంతో ఆయన ఇన్నాళ్లూ మెదక్ జిల్లాలోని తన వ్యవసాయ క్షేత్రంలోనే ఉన్న సంగతి తెలిసిందే. మొన్న మంగళవారం నిర్వహించిన కొవిడ్-19 టెస్టులో నెగెటివ్ అని నిర్ధారణ కావటంతో సీఎం ఇక తన రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈరోజు హైదరాబాద్ కి చేరుకున్నారు. వైద్య, ఆరోగ్య మంత్రి […]
CM KCR: కరోనా వైరస్ ను జయిస్తానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందే చెప్పి సాధించారు. నిన్న మంగళవారం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో ఆయనకి ఎట్టకేలకు కొవిడ్ నెగెటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో కేసీఆర్ పర్సనల్ డాక్టర్ ఎంవీ రావు ఇటీవల చెప్పిన విషయాలు గుర్తుకొస్తున్నాయి. కరోనా పాజిటివ్ అని తేలినప్పటికీ సీఎం కేసీఆర్ ఎంతో ధైర్యంగా ఉన్నారని, వైరస్ ను జయిస్తానని ఆత్మవిశ్వాసంతో చెప్పిన ఆయన దాన్ని నిరూపించారని ఎంవీ రావు ఈమధ్య […]
Etela Rajender : ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈటల రాజేందర్ గురించే చర్చ. ఈటల రాజేందర్ ను చివరకు మంత్రి వర్గం నుంచి కూడా బర్తరఫ్ చేశారు. త్వరలోనే ఆయన టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తారని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే.. సీఎం కేసీఆర్ కావాలని ఈటల రాజేందర్ ను టార్గెట్ చేశారని.. ఆయన డైరెక్షన్ లోనే ఇదంతా జరిగిందని… చివరకు రైతులు కేసీఆర్ కు లేఖ రాయడం దగ్గర్నుంచి… మంత్రి వర్గం నుంచి […]
తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయి. అధికార టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ హైకమాండ్ చాలా సీరియస్ గా ఉంది. 100 ఎకరాల అసైన్డ్ భూములను మంత్రి ఈటల కబ్జా చేశారని… దానిపై చర్యలు తీసుకోవాలంటూ కొందరు రైతులు సీఎం కేసీఆర్ కు లేఖ రాయడంతో వెంటనే సీఎం కేసీఆర్ దానిపై విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేశారు. వెంటనే మంత్రి ఈటల భూకబ్జాపై మీడియాలో కథనాలు […]
Etela Rajender : తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ విషయంలో ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఇటీవల చాలా మీటింగుల్లో ఆయన రాజకీయాలపై చూపించిన ఆక్రోశం మామూలుది కాదు. రాజకీయాలు మారిపోయాయని… రాజకీయ నాయకులను కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. అలాగే… సంక్షేమ పథకాల విషయంలో కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం చేసిందే. ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద దుమారం రేపాయి. ఈటల రాజేందర్ ను […]