Telugu News » Tag » వైఎస్ జగన్
YS Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ 175 సీట్లకుగాను మొత్తంగా 175 సీట్లూ కొల్లగొట్టేయాలని. ‘ఒక్క నియోజకవర్గాన్ని కూడా మిస్ కాకూడదు ఈసారి. మనం చాలా చాలా మంచి పనులు చేస్తున్నాం. మనకు ఓట్లు అడిగే హక్కు నూటికి నూరు శాతమూ వుంది. రిజల్ట్ కూడా నూటికి నూరు శాతం రావాల్సిందే..’ అని వైసీపీ అధినేత వైఎస్ జగన్, పార్టీకి చెందిన ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలతో తెగేసి చెబుతున్నారు. ప్రతిపక్షం […]
YS Jagan : ‘తప్పుడు మాటలు మాట్లాడినా.. అబద్ధాలు చెప్పినా రాజకీయ నాయకులకు చెప్పులు చూపించాలి..’ అని ఓ సారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అంతే కాదు, ఇంకో సందర్భంలో ‘చెప్పులు కాదు, చీపుళ్ళు చూపించాలి..’ అని సెలవిచ్చారు. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మీద ప్రతిపక్ష నేతగా వున్న సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలివి. ఆనాటి ఆ విషయాల్ని తాజగా జనసేన పార్టీ గుర్తు చేసుకుంటోంది. ‘మీరు చెప్పిందే […]
YS Jagan : ‘ఎట్టి పరిస్థితుల్లోనూ 175కి 175 నియోజకవర్గాల్లోనూ గెలిచి తీరాలి. గెలిస్తే గౌరవం పెరుగుతుంది, ఓడితే గౌరవం తగ్గుతుంది.. ఒక్క స్థానాన్నీ వదులుకోవడానికి సిద్ధంగా లేం.. జుట్టు వుంటే, దాన్ని ఎలాగైనా ముడి వేసుకోగలం. అధికారం లేకపోతే ఏమీ చేయలేం..’ అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంపై నిర్వహించిన వర్క్ షాప్ సందర్భంగా పార్టీకి చెందిన ప్రజా ప్రతినిథులతో […]
NTR : ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా వైసీపీ సర్కారు మార్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం నిలబడుతుందా.? షరామామూలుగానే బ్యాక్ ఫైర్ అవుతుందా.? అన్నది ముందు ముందు తేలుతుంది. అయితే, ఈ వ్యవహారంలో టీడీపీ గింజుకోవడం మామూలే. కానీ, దెబ్బ గట్టిగా తగిలింది మాత్రం యంగ్ టైగర్ ఎన్టీయార్‌కే. సమీప భవిష్యత్తులో యంగ్ టైగర్ ఎన్టీయార్ గనుక టీడీపీ పగ్గాలు చేపడితే, రాజకీయంగా తనకు ఇబ్బందేనని బహుశా వైఎస్ జగన్ మోహన్ […]
Renuka Chaudhary : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, ‘పుట్టు పూర్వోత్తరాల’ విషయమై నిస్సిగ్గుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ పుట్టుక గురించి మాజీ మంత్రి కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దానిపై స్పందిస్తూ, వైఎస్ జగన్ పుట్టుక గురించి టీడీపీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వెరసి, ఏపీలో అత్యంత జుగుప్సాకరమైన రాజకీయాలు నడుస్తున్నాయి. ‘ఎవరు ఎవరికి పుట్టారో […]
YS Jagan : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సహచర మంత్రుల్లో కొందరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారట. అది కూడా క్యాబినెట్ సమావేశంలోనట. అలాగని తొలుత టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం జరిగింది. ఆ తర్వాత అది నిజమేనంటూ వైసీపీ అనుకూల మీడియా కూడా కథనాలు షురూ చేసింది. ముఖ్యమంత్రిగా అధికార పీఠమెక్కాక, మూడేళ్ళ తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి ఇలా సహచర మంత్రుల మీద మండిపడ్డారన్నది మీడియాలో వినిపిస్తోన్న కథనాల సారాంశం. కానీ, […]
YS Jagan : ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సీబీఐ కోర్టులో విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదా.? హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ జగన్ ‘రోజువారీ విచారణకు హాజరు’ నుంచి ఏ మేరకు మినహాయింపు పొందినట్లు.? ప్రజా ప్రతినిథులపై కేసుల సత్వర విచారణ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు, సీబీఐ కోర్టు.. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి రోజువారీ విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ప్రతి […]
YS Jagan : సీన్ మారింది.! 175 సీట్లలో జనసేన పోటీ చేస్తుందా.? లేదా.? అన్న విషయమై వైసీపీ ప్రశ్నలు సంధిస్తోంటే, దానికి కౌంటర్ ఎటాక్ అన్నట్టు.. పూర్తిగా ఐదేళ్ళపాటు రాష్ట్రాన్ని పరిపాలిస్తారా.? లేదా.? అని జనసేన నుంచి ప్రశ్నాస్త్రం దూసుకొచ్చింది. థానోస్ రెడ్డి (ముఖ్యమంత్రి వైఎస్ జగన్) ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలనీ, ఆయన చేత ఆ సమాధానం చెప్పించాలనీ వైసీపీకి సవాల్ విసిరారు నాగబాబు. అంటే, వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం ఖాయమైపోయిందన్నమాట. ఈ […]
Janasena : ‘గుడ్ మార్నింగ్ సీఎం సర్’ హ్యాష్ ట్యాగ్ ఏ స్థాయిలో ట్రెండింగ్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై జనమే స్వచ్ఛందంగా సోషల్ మీడియా వేదికగా నినదించేలా చేయగలిగింది జనసేన పార్టీ ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా. జనసైనికులు పెద్దయెత్తున పోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టడం ఓ యెత్తయితే, ఏ రాజకీయ పార్టీకీ చెందని సామాన్యులూ, జనసైనికులతో పోటీ పడి మరీ తమ ప్రాంతంలో రోడ్ల దుస్థితిపై ఫొటోలు, […]
Draupadi Murmu : రాష్ట్రపతి ఎన్నికల విషయమై ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఒకేలా సంబరపడుతున్నాయి. జనసేన పార్టీకి వున్నదే ఒకే ఒక్క ఎమ్మెల్యే. ఆయనా వైసీపీలోకి దూకేశారాయె. దాంతో, రాష్ట్రపతి ఎన్నికల్లో జనసేన ప్రస్తావనే లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వచ్చిన (రాజధాని అమరావతిని వైసీపీ గుర్తిస్తుందా.? లేదా.? అన్నదానిపై సందేహాలున్నాయ్) రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకి అటు వైసీపీ, ఇటు తెలుగుదేశం పార్టీ.. రెండూ విడివిడిగా ఘనస్వాగతం పలికేశాయి. చంద్రబాబు […]
Janasena : మాజీ మంత్రి పేర్ని నానిపై జనసేన నేత కిరణ్ రాయల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పేర్ని నానిని వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కాపలా కుక్కగా అభివర్ణించారు కిరణ్ రాయల్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద, మాజీ మంత్రి పేర్ని నాని ఘాటైన విమర్శలు చేసిన దరిమిలా, దానికి కౌంటర్ ఎటాక్ అన్నట్లు కిరణ్ రాయల్ తీవ్రస్థాయిలో స్పందించారు. ‘జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ది వీకెండ్ ప్రజాసేవ అంటావా.? వారంలో ఏడు రోజులూ […]
YS Jagan Mohan Reddy : రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా.. ఆయనా ఓ సగటు తండ్రి.! ఔను, తన కుమార్తె ఉన్నత స్థానానికి ఎదిగితే, ఆ తండ్రికి ఎంత ఆనందంగా వుంటుంది.? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుమార్తె హర్ష, విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఇన్‌సీడ్ బిజినెస్ స్కూల్ నుంచి డిస్టిక్షన్‌లో పాస్ అయ్యారు. డిస్టింక్షన్‌లో పాస్ అవడమే కాదు, డీన్స్ జాబితాలోనూ చోటు సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, […]
RGV : తెలుగుదేశం పార్టీ మీదకు అస్త్రంలా ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ అనే సినిమాని వివాదాల ఫిలిం మేకర్ వర్మ తీయగలడు. పవన్ కళ్యాణ్ మీద మంటతోనూ వర్మ సినిమాలు చేయగలడు. అలాంటప్పుడు, వైసీపీకి వ్యతిరేకంగా వర్మ ఎందుకు సినిమాలు తీయడు.? ఔను, వర్మ ఆ రిస్క్ చెయ్యడు, చెయ్యలేడు. ఎందుకంటే, వర్మకి వైఎస్ జగన్ అంటే విపరీతమైన అభిమానం వుందని కాదు.. బోల్డంత భయం ఆయనకు వైఎస్ జగన్ మీద వుంది. అదీ అసలు సంగతి.. అన్నది […]
YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విదేశీ పర్యటనలకు వెళ్ళాలంటే కోర్టు అనుమతి తప్పక తీసుకోవాల్సి వున్న విషయం విదితమే. అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ జగన్, షరతులతో కూడిన బెయిల్ గతంలోనే పొందారు. ఆ షరతులకు లోబడే ఆయన వ్యవహరించాల్సి వుంది. మొన్నీమధ్యనే వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనేందుకు దావోస్ వెళ్ళినప్పుడూ వైఎస్ జగన్, సీబీఐ కోర్టు అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. అయితే, అప్పట్లో సీబీఐ, వైఎస్ జగన్ […]
YS Jagan : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్, విదేశాల్లో ఎంబీఏ చదివారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిగ్రీ చదివినట్లుగా ఆయన పలు సందర్భాల్లో చెప్పుకున్నారు కూడా. ఇప్పుడు ఈ ఇద్దరు నేతల చదువుల ప్రస్తావన ఎందుకంటే, ఈ అంశం చుట్టూనే రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. టీడీపీ వర్సెస్ వైసీపీ ఈ […]