Telugu News » Tag » బండి సంజయ్
KTR : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తాంత్రిక పూజలు చేస్తారంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేయడంపై, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సోషల్ మీడియా వేదికగా చాలా చాలా ఘాటుగా స్పందించారు. కేసీయార్ తనయుడు, మంత్రి కేటీయార్.. ట్విట్టర్‌లో సంచలన ట్వీట్ పెట్టారు. ‘ఈ లవంగం గారిని ఇలాగే వదిలెయ్యకండిరా బీజేపీ బాబులు. పిచ్చి ముదురి తొందర్లో కరవడం మొదలు పెడతాడేమో, మతిలేని మాటలతో […]
Bandi Sanjay : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సిద్ధమవుతున్నారు. ఇప్పటిదాకా మూడు విడతల పాదయాత్ర పూర్తి చేసిన బండి సంజయ్, ఈసారి నాలుగో విడత పాదయాత్రలో మల్కాజిగిరి పార్లమెంటు మీద స్పెషల్ పోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి పాదయాత్ర మొదలు కానుంది. ప్రారంభ సభకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ హాజరు కానున్నారు. ఈ నెల 22న పెద్ద అంబర్ […]
Bandi Sanjay : తెలంగాణ బీజేపీ అధ్యక్సుడు, ఎంపీ బండి సంజయ్ ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్రకు సంబంధించి మూడు విడతల పాదయాత్ర పూర్తి చేశారు. మూడో విడత పాదయాత్ర యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నుంచి వరంగల్ భద్రకాళి దేవస్థానం వరకు జరిగిన సంగతి తెలిసిందే. త్వరలో బండి సంజయ్, నాలుగో విడత పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని మూడో విడత పాదయాత్ర ముగింపు సమయంలోనే బండి సంజయ్ ప్రకటించేశారు. సెప్టెంబర్ 12 నుంచి బండి […]
Bandi Sanjay : ‘మా ప్రభుత్వం తెలంగాణను ఉద్ధరించేస్తోంది.. మా పాలనలో ప్రజలు సంతోషంగా వున్నారు..’ అని తెలంగాణ రాష్ట్ర సమితి చెప్పుకుంటోంది. ప్రజలేమో, ‘గులాబీ పాలన సరిగ్గా లేదు.. మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకోవడంలేదు’ అంటున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా ఎక్కడికక్కడ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కి వినతులతో స్వాగతం పలుకుతున్నారు ప్రజలు. ప్రధానంగా నిరుద్యోగ యువత పెద్దయెత్తున వితన పత్రాల్ని బండి సంజయ్‌కి అందిస్తున్నారు. ఆ తర్వాతి స్థానంలో పేద, బడుగు, […]
Bandi Sanjay : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు అనుమతిచ్చింది. ఈ ప్రజా సంగ్రామ యాత్ర ప్రస్తుతం మూడో పార్ట్ కొనసాగుతున్న విషయం విదితమే. మొదటి దశ పాదయాత్ర సక్సెస్ అయ్యింది. రెండో విడుత పాదయాత్ర డబుల్ సక్సెస్ అయ్యింది. అయితే, మూడో విడత పాదయాత్రకు వచ్చేసరికి ప్రభుత్వం ఆటంకాలు కల్పించడం షురూ చేసింది. అధికార పార్టీ అడ్డమైన వేషాలూ వేస్తోందంటూ బీజేపీ మండిపడుతూ వస్తోన్న విషయం […]
Bandi Sanjay : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు ఆటంకాలు ఎదురయ్యాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ బండి సంజయ్‌కి నోటీసులు పంపిన వరంగల్ పోలీసులు, ప్రజా సంగ్రామ యాత్ర ఆపెయ్యాలని అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై గవర్నర్‌కి కూడా ఫిర్యాదు చేసిన బీజేపీ, తాజాగా కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే, ఫిర్యాదుపై తక్షణ విచారణకు న్యాయస్థానం నిరాకరించింది. రేపు బండి సంజయ్ తరఫున […]
Bandi Sanjay : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు కేసీయార్ సర్కారు బ్రేకులేసేందుకు ప్రయత్నిస్తున్న విషయం విదితమే. ప్రజా సంగ్రామ యాత్రను తక్షణం నిలిపివేయాల్సిందిగా వరంగల్ పోలీసులు, బండి సంజయ్‌కి నోటీసులు జారీ చేశారు. పాదయాత్ర సందర్భంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారనీ, ఈ నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం వుందనీ వరంగల్ పోలీసులు ఈ మేరకు బండి సంజయ్‌కి నోటీసులు పంపడం జరిగింది. అయితే, ఈ వ్యవహారంపై బీజేపీ సీరియస్ అయ్యింది. […]
Bandi Sanjay : ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ , బీజేపీ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఒకరిపై ఒకరు అవాకులు చెవాకులు పేల్చుకుంటున్నారు. అయితే ఆగస్టు 21న తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ ఆలయాన్ని సందర్శించగా, ఆలయం నుండి బయటకు వచ్చాక బండి సంజయ్ అమిత్ షా చెప్పులు పట్టుకొని అతనికి అందించారు. బండి సంజయ్ వ్యవహరించిన తీరును కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు విమర్శించారు. స్ట్రాంగ్ కౌంటర్.. సీఎం కేసీఆర్ తనయ […]
Bandi Sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభ సభలో కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డిలు పాల్గోనున్నారు. జనంతో మమేకమై ప్రజా సమస్యలను తెలుసుకుని మేనిఫెస్టో రూపకల్పన చేస్తామన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర .. యాదాద్రి నుండి మొదలై 5 జిల్లాలు, 12 […]
Telangana: తెలంగాణ రాజకీయం గరంగరంగా సాగుతోంది. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్, టీఆర్ఎస్ వర్సెస్ ఈటల అన్నట్లు నడుస్తోంది. ‘రైతు గోస – బీజేపీ పోరు దీక్ష’ పేరుతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఇవాళ సోమవారం ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. పాడిందే పాడరా పాచిపళ్ల దాసుడా అనే సామెత మాదిరిగా అతను మళ్లీ కేసీఆర్ పై విమర్శలు చేశాడు. చెప్పింది చేయని, ఏమీ చేయని ఏకైక సీఎం అంటూ ఎద్దేవా చేశాడు. అయితే.. నూతన […]
Bjp Vs Congress : పశ్చిమ బెంగాల్ లో బీజేపీ కార్యాలయం పైన, ఆ పార్టీ కార్యకర్తల పైన, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీవాళ్లు దాడి చేశారనే సాకుతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చేస్తున్నామన్న బండి సంజయ్ వ్యాఖ్యలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. ఆయనకు నిజంగా దమ్ముంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నా చేయాలని సవాల్ విసిరారు. బీజేపీ నాయకులు పక్క రాష్ట్రాల్లో అల్లర్ల పైన ఇక్కడ దీక్షలు […]
Bandi Sanjay : తెలంగాణలో ఓ వైపు కరోనా విజృంభిస్తున్నా…. మరోవైపు పురపాలక ఎన్నికల హడావుడి మొదలైంది. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ముగియగానే… పురపాలక ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది ఒకరకంగా చెప్పాలంటే మినీ పురపోరు. గ్రేటర్ వరంగల్, గ్రేటర్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మరో ఐదు మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దీంతో మరోసారి ఎన్నికలు హీటెక్కాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ […]
KTR నోటి దురుసుతనానికి కేరాఫ్ అడ్రస్ బండి సంజయ్ అని మీరు భావిస్తున్నారా?. అతనికి సీఎం కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం తప్ప మరొకటి తెలియదని అనుకుంటున్నారా?. ఎందుకంటే రాష్ట్ర మంత్రి కేటీఆర్ సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ తప్ప మిగతావాళ్లంతా మంచోళ్లే అని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ని తాగుబోతు అని తిట్టడం పట్ల కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బండి సంజయ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటాన్ని మంత్రి […]
Bandi Sanjay బండి సంజయ్ కుమార్ బీజేపీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. దుబ్బాక, బల్దియాల్లో పార్టీని గెలిపించి ఒక వెలుగు వెలిగారు. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయేసరికి ఆయన్ని ఎవరూ పట్టించుకుంటున్నట్లు లేరు. చివరికి అదే బల్దియాలోని ఒక కార్పొరేటర్ స్థాయి లీడర్ కూడా బండి సంజయ్ ని దేఖట్లేదని నిన్న జరిగిన ఓ సంఘటనను బట్టి అర్థంచేసుకోవచ్చు. మామూలుగా కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రాంచందర్ రావు తదితరుల బ్యాచ్ ఎలాగూ బండిని పెద్దగా పరిగణనలోకి […]
Bandi : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారానికి నిన్న బుధవారమే వెళతారని, అక్కడ ఒక ర్యాలీలో పాల్గొంటారని అన్నారు. కానీ ఆయన వెళ్లలేదు. నేటితో ప్రచార గడువు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆయన అసలు తిరుపతి ప్రచారానికి ఎందుకు వెళ్లలేదు అనే ప్రశ్న తలెత్తుతోంది. కొంత మందేమో ఆయన నాగార్జునసాగర్ శాసనసభ ఉపఎన్నిక ప్రచారంలో బిజీగా ఉన్నారని చెబుతున్నారు. కానీ అది […]