Telugu News » Tag » నిమ్మగడ్డ
Nimmagadda : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ తనకు పంపిన నోటీసుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ శుక్రవారం సాయంత్రం స్పందించారు. శాసన సభ్యుల సభా హక్కులను తాను ఉల్లంఘించానన్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ఆరోపణల్ని ఖండించారు. అసెంబ్లీ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. ఎమ్మెల్యేల హక్కులు ఉలంఘించానంటున్న ఈ నోటీసులకు అసలు విచారణ పరిధే లేదని నిమ్మగడ్డ తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆయన శాసన సభ […]
Nimmagadda : కరవమంటే కప్పకు కోపం. విడవమంటే పాముకు కోపం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఏపీఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిస్థితి అచ్చం ఇలాగే తయారైంది. గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు ముందు అధికార పార్టీ వాళ్ల చేత నానా మాటలు పడ్డాడు. ఎలక్షన్లు అయిపోయాక ప్రతిపక్ష పార్టీలతో మొట్టికాయలు వేయించుకుంటున్నాడు. అపొజిషన్ పార్టీ అనే పదం వాడటం కూడా ఇక్కడ చాలా ఎక్కువే. ఎందుకుంటే నిమ్మగడ్డను తాజాగా తప్పుపట్టినాయన కాంగ్రెస్ వ్యక్తి కాబట్టి. ఏపీలో […]
Municipal Fight : ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో స్టేట్ ఎలక్షన్ కమిషన్ (ఎస్ఈసీ) గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలను నిర్వహించనున్నారు. ఎలక్షన్స్ కి కొత్త ప్రకటన జారీ చేయాలని కోరుతూ దాఖలైన 16 వ్యాజ్యాలను న్యాయస్థానం శుక్రవారం తోసిపుచ్చింది. మునిసిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చి దాదాపు ఏడాది కావొస్తున్నందున కొత్త ప్రకటన ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోరారు. గతేడాది నోటిఫికేషన్ వచ్చినప్పుడు నామినేషన్లు […]
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రస్తుతం ఏం చెబితే దాన్ని అధికారులు గుడ్డిగా ఫాలో అవ్వాల్సిందే. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను ఫాలో అవ్వాల్సిందేనంటూ హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా… ప్రూఫ్ కోసం వీడియో తీయాలంటూ ఎన్నికల అధికారులను ఆదేశించాలంటూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు అయింది. దానిపై హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. పంచాయతీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియను సీసీ కెమెరాలతో నిఘా […]
ఏపీలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి నెలకొన్నది. పంచాయతీ ఎన్నికల తర్వాత మునిసిపల్ ఎన్నికలు రానున్నాయి. దీంతో వరుసగా ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మునిసిపల్ ఎన్నికలతో పాటుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా వరుసగా రానున్నాయి. అయితే.. పంచాయతీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అడ్డంకులు సృష్టించినా.. చివరకు ఎన్నికల కమిషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అలాగే మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ […]
Nimmagadda : ఏపీలో ఓ వైపు రెండో దశ పంచాయతీ ఎన్నికలకు పోలింగు జరుగుతుండగా మరో వైపు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్ఈసీకి) మధ్య పరిస్థితి మళ్లీ మొదటికొచ్చేలా ఉంది. మూణ్నాలుగు రోజులుగా ఈ రెండు వర్గాల సీరియస్ మూడ్ మారిందని, కాస్త చల్లబడ్డాయని అనుకుంటున్న తరుణంలో మరోసారి వివాదం రాజుకుంది. నిన్న శుక్రవారం రాష్ట్ర మంత్రి కొడాలి నానీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై విమర్శలు చేయగా ఆయన వివరణ కోరారు. […]
AP panchayat elections : ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అటు రాష్ట్ర ఎన్నికల కమిషర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ గానీ, ఇటు జగన్ ప్రభుత్వం గానీ, ఆయన పార్టీ గానీ, చివరికి భగవంతుడు కూడా ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏపీ లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహణ వ్యవహారం పలుమార్లు హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్లినట్లే ఇప్పుడూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఒక కేసు నమోదైంది. ఏకగ్రీవాల ప్రస్తావన కూడా ఇందులో వచ్చింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ పొరుగు […]
Nimmagadda : టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు మీదున్నారు. ఏపీలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల హడావుడి నడుస్తున్న నేపథ్యంలో.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా ఆయన చేసిన ఫిర్యాదులో అధికారుల గురించి ఆరోపణలు చేశారు. ప్రతిపక్షాలు బలపరిచిన అభ్యర్థులను అధికారులు కావాలని వేధిస్తున్నారని.. ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతిపక్షాలు బలపరిచిన అభ్యర్థులకు సంబంధించిన పత్రాలను అధికారులు ఇవ్వడం లేదని… అలాగే అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. నామినేషన్లు వేసే వారిపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని […]
Nimmagadda : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఏపీఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ(సోమవారం) హైదరాబాదులోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో మెడికల్ టెస్టులు చేయించుకోనున్నారు. కంటికి ఇన్ఫెక్షన్ సోకటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి నిమ్మగడ్డ ఈ రోజు ఏపీలోని కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణపై ఆయన సంబంధిత జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించాల్సి ఉండగా ఆ పర్యటన అనూహ్యంగా రద్దయింది. రేపు (మంగళవారం) తొలి విడత పంచాయతీ […]
Nimmagadda : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఏపీ ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పీడుకి ఏపీ హైకోర్టు కొంచెం బ్రేక్ వేసింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆయన తెర మీదికి తెచ్చిన ‘ఈ-వాచ్’ యాప్ ని ఈ నెల తొమ్మిదో తేదీ వరకు (అంటే వచ్చే గురువారం దాక) వాడొద్దని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో నిమ్మగడ్డకు రాష్ట్ర హైకోర్టులో మరోసారి చుక్కెదురైనట్లయింది. గతంలో ఆయన జారీ చేసిన ఎలక్షన్ షెడ్యూల్ ని ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ […]
Nimmagadda : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఏపీఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిన్న(శనివారం) తనలోని రెండో కోణాన్ని చూపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పొగడటమే కాకుండా టీడీపీ చీఫ్ చంద్రబాబుకు నోటీసు కూడా ఇచ్చారు. తద్వారా అధికార పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అయినా నా దృష్టిలో ఒకటేనని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీవాళ్లు ఇన్నాళ్లూ తనపై చేస్తున్న ఆరోపణలు తప్పు అని నిరూపించుకున్నారు. టీడీపీకీ.. […]
Nimmagadda : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఏపీఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ రోజురోజుకీ స్వరం పెంచుతున్నారు. నిన్న ఇద్దరు మంత్రులను, ఒక ఎంపీని, ఒక ప్రభుత్వ సలహాదారుని టార్గెట్ చేసిన ఆయన ఈరోజు పరోక్షంగా సీఎం జగ్మోహన్ రెడ్డినే లక్ష్యంగా పెట్టుకొని సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం కడప జిల్లాలో పర్యటించిన నిమ్మగడ్డ.. మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్సార్ తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పెద్దాయన.. దివంగత నేత, ప్రియతమ నాయకుడు […]
Nimmagadda : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఏపీఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు అందరికీ రోల్ మోడల్ గా మారినట్లున్నాడు. రాజ్యాంగం పవరేంటో చూపిస్తున్నాడు. ఆయన చూపించిన బాటలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (టీఎస్ఈసీ) పార్ధసారధి కూడా నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే.. నిన్న ఓ ప్రముఖ తెలుగు దినపత్రికలో వచ్చిన ఒక వార్త ఇదే అభిప్రాయాన్ని కలిగిస్తోంది. అందులో..? తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ల పాలక వర్గం గడువు మార్చి 14న ముగిసిపోనుంది. […]
Nimmagadda ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో అధికార పార్టీ (వైఎస్సార్సీపీ) నాయకులు, మంత్రులు తనను ఇన్నాళ్లూ ఎన్ని మాటలన్నా, నిందించినా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిన్న ఎందుకో ఫైర్ అయ్యారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నా పట్టించుకోకుండా తనను దూషిస్తున్న, తూలనాడుతున్న మంత్రులపై అవసరమైతే కోర్టుకు వెళతానని హెచ్చరించారు. ఈ విషయాన్ని ముందుగా రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కి తెలియజేశారు. ఈ […]
Nimmagadda : ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల కన్నా సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ లీడర్ షిప్ లోని రాష్ట్ర ఎన్నికల సంఘానికి(ఎస్ఈసీకి) మధ్య జరుగుతున్న పోరులో ఎవరు పైచేయి సాధిస్తారన్నదే ఆసక్తికరంగా మారింది. ఎలక్షన్ కోడ్ సాకుతో ఎస్ఈసీ అధికార పార్టీవాళ్లకి, ప్రభుత్వ అధికారులకి పట్టపగలే చుక్కలు చూపిస్తుండగా వైఎస్సార్సీపీవాళ్లు కూడా నిమ్మగడ్డ ఎప్పుడు, ఎక్కడ దొరుకుతాడా అని కాచుకొని కూర్చుంటున్నారు. ఎట్టకేలకు వాళ్లకి ఎస్ఈసీ నిన్న […]