ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే ఏడాదిన్నర గడిచిపోయింది. తొలుత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేటప్పుడు రెండున్నర ఏళ్ల తరువాత మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుందని జగన్ చెప్పారు. దీంతో తోలి దఫాలో పదవులు దక్కనినవారు ఆ సమయం కోసం ఎదురుచూటున్నారు. అలాంటివారిలో నెల్లూరు జిల్లా సీనియర్ లీడర్ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. వైఎస్ జగన్ పెట్టిన నాటి నుండి ఆయన వెంటే ఉన్నారు. టీడీపీలో మంచి భవిష్యత్తు ఉన్నా వదులుకుని వదిలేసి జగన్ పక్కన చేరారు. నెల్లూరు జిల్లా రాజకీయాల మీద మంచి పట్టున్న నేత. గత ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుపొందారు. […]