Telugu News » Tag » దుబ్బాక
తెలంగాణలో కాంగ్రెస్ కాస్త వెనుకబడిందని అందరు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే గతంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీయే ఉండేది. ఇక అధికార పార్టీ పై తీవ్రంగా విమర్శలు చేస్తూ బలమైన గొంతును వినిపించేది. ఇక దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ గెలుపుతో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. ఇక ఈ ఉపఎన్నిక గెలుపుతో బీజేపీకి మాత్రం ఎక్కడలేని బలం లభించిందనే చెప్పాలి. ఇక దుబ్బాక జోష్ ను ఎక్కడ తగ్గించకుండా బల్దియా ఎన్నికల్లో కూడా […]
అసలు తెలంగాణలో ఏం జరుగుతోందో ఏమీ అర్థం కావడం లేదు. టీఆర్ఎస్ పార్టీ రోజురోజుకూ బలహీనం అయిపోతోంది. బీజేపీ పుంజుకుంటోంది. మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీపై తెగ విమర్శలు చేసిన కేసీఆర్.. ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని బీజేపీని పొగిడేస్తున్నారు. అసలు.. కేంద్రం ఏం చేస్తుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇచ్చేది లేదు. కేంద్ర పథకాలన్నీ వేస్ట్. ఆయుష్మాన్ భవ దరిద్రమైన పథకం.. అంటూ పొద్దున లేస్తే ప్రధాని మోదీని విమర్శించేవారు […]
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏ రాష్ట్రంలో అయినా సరే.. పార్టీని ఏమాత్రం ప్రజలు ఆదరించడం లేదు. ఘోరంగా ఓడిస్తున్నారు. తెలంగాణలోనూ అంతే. ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘోరంగా ఓటమి చెందింది. ఆ ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. […]
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆరెస్) ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా తమ మనసులోని మాటలను బయటపెడుతున్నారు. యువ రాజుకు పట్టాభిషేకం కావాలని వారంతా కోరుకుంటున్నారు. రాష్ట్ర మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు (కేటీఆర్)ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలని డైరెక్ట్ గా, ఓపెన్ గానే చెబుతున్నారు. తాజాగా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ చేసిన వ్యాఖ్యలు ఈరోజు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి. పెద్దాయన ఇకొద్దు.. టీఆరెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్)ను […]
తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో తనకు తిరుగు లేదంటూ దూసుకు పోతున్న సమయంలో అనూహ్యంగా బీజేపీ పెద్ద తలనొప్పిగా మారింది. ఆ పార్టీ సాధించిన విజయాలు చిన్నవే అయినా కూడా వారికి అదే కొండంత బలంను ఇచ్చింది. కేసీఆర్ అండ్ టీం కు భయంను కలిగిస్తున్నాయి. పార్లమెంట్ లో ఒకప్పుడు బీజేపీ కేవలం రెండు సీట్లు ఉన్న పార్టీ. అలాంటి పార్టీ అధికారం దక్కించుకుంది. అందుకే బీజేపీ అంటే కేసీఆర్ కు ఎక్కడో కాస్త టెన్షన్ కనిపిస్తుంది. […]
ఒక్కప్పుడు ప్రజలను, ప్రజా ప్రతినిధులను కలుపుకొని ఉద్యమాలు చేసి, తెలంగాణ రాష్ట్రము సాధించటంలో కీలక భూమిక పోషించిన కేసీఆర్, ఆ తర్వాత సీఎం అయిన దగ్గర నుండి అలాంటి సంప్రదాయానికి స్వస్తి చెప్పినట్లు తెరాస నేతలే చెపుతుంటారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆరేళ్ళ నుండి ఇప్పటి వరకు పెద్దగా ప్రజాప్రతినిధులతో కేసీఆర్ మాట్లాడింది చాలా తక్కువ. ఆయన అపాయింట్ మెంట్ దొరకటం అనేది బ్రహ్మ పదార్థం లాగా మారిపోయింది. ఏదైనా సమావేశాలు ఉంటే తప్ప కేసీఆర్ నుంచి […]
సెంట్రల్ లో బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నయంగా ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటుచేస్తామని కేసీఆర్ ఎప్పటినుంచో అనుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇది కేసీఆర్ వల్ల అవుతుందా? మిగతా పార్టీల వారు ముందుకు వస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే మోదీ ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆయా రాష్ట్రాల రైతులు ఢిల్లీలో ఉద్యమాలు చేస్తున్నారు. బీజేపీ పార్టీ పట్ల రైతుల నుంచి, ఆయా పార్టీల నుంచి వ్యతిరేకత వస్తున్న తరుణంలో కేసీఆర్ ఇదే తగిన సమయంగా […]
తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. అయితే మొన్నటివరకు రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తిరుగులేకుండా ఉన్నప్పటికీ, ఒక్కసారిగా రాజకీయాల్లో మార్పులు సంభవించాయి. ఇక దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ అనూహ్య విజయంతో టీఆర్ఎస్ కు కష్టాలు మొదలయ్యాయి. అయితే దుబ్బాకలో గెలిచిన ఊపును అలానే కొనసాగించి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి దీటుగా సీట్లు సాధించింది. దీనితో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ తలనొప్పిగా మారింది. ఇక బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రతిసారి కెసిఆర్ పై విరుచుకుపడుతూ వివాదాస్పదంగా […]
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల సమీకరణాలు మారిపోతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలిచిన తర్వాత కేసీఆర్ అప్రమత్తమయ్యారు. కానీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ దూకుడికి అడ్డుకట్ట వేయలేకపోయారు. తెరాస సర్కారు పై ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారని బీజేపీ పార్టీ క్షేత్ర స్థాయిలో ప్రచారం చేస్తూ తమ పార్టీని బలోపేతం చేసుకుంటూ పోతోంది. కేసీఆర్ ఎన్ని ప్రగల్భాలు పలికినా.. ప్రజలు మాత్రం ఆయన్ని నమ్మడం లేదనేది స్పష్టంగా […]
తెలంగాణలో నువ్వా- నేనా అన్నట్లు హోరాహోరీగా తలపడుతున్న తెరాస, బీజేపీ పార్టీలు నేతలు దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో చేసిన హడావిడి అంత ఇంత కాదు. కేసీఆర్ ఏకంగా కేంద్ర బీజేపీ మీద యుద్ధమే ప్రకటించాడు. అలాంటిది చడీచప్పుడు లేకుండా ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసి వచ్చాడు. అయితే కేసీఆర్ ను బీజేపీ పెద్దలే రమ్మని పిలిచినట్లు తెలుస్తుంది. కేంద్రానికి, కేసీఆర్ కి మధ్య నున్న ప్రస్తుత సంబంధాలను గమనిస్తే కేసీఆర్ కు అతి తక్కువ సమయంలో […]
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని కలిసి చర్చించారు. మొన్నటి వరకు తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్ ప్రస్తుతం బీజేపీ నేతలతో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే కొద్ది రోజుల పాటు ఢిల్లీలోనే పర్యటించిన కేసీఆర్ ఆదివారం సాయంత్రం తిరిగి తెలంగాణకి వచ్చేసారు. ఐతే కేసీఆర్ ఢిల్లీ పర్యటనను ముగించగానే.. బండి సంజయ్ ఢిల్లీకి పయనమయ్యారు. దీంతో […]
తెలంగాణాలో దుబ్బాక ఉపఎన్నిక తరువాత మరో ఉపఎన్నిక జరగనుంది. అయితే నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు నోముల నర్సింహయ్య అకాల మరణంతో అక్కడ ఉపఎన్నిక కు దారి తీసింది. ఇక దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ అనూహ్య విజయంతో అదే జోష్ ను జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా కొనసాగించి తమ సత్తాను చాటింది. దీనితో త్వరలో జరిగే నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కూడా గెలవాలని కసిగా ఉంది. ఇక ఈ ఉపఎన్నిక కోసం బలమైన నేతను బరిలోకి దింపాలని ఆలోచనలో ఉంది. […]
టి.ఆర్.ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హస్తిన పర్యటన ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యింది. మూడు రోజుల పాటు.. కేసీఆర్ ఢిల్లీ పర్యటన సాగనుంది. గులాబీ పార్టీ అధినేత తన పర్యటనలో భాగంగా.., ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆపాయిట్మెంట్ కోరారు. వీరిత్ పాటు.., కొంత మంది కేంద్ర మంత్రులను కూడా కేసీఆర్ కలవనున్నారట. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ పనుల గురించి కేసీఆర్ ఈ పర్యటనలో కేంద్ర […]
తెలంగాణాలో అనుకోకుండా ఉపఎన్నికలు వస్తుడడంతో కెసిఆర్ కు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి చెందడంతో కెసిఆర్ కు కాస్త సెగ తగిలింది. ఇక అప్పటివరకు రాష్ట్రంలో బీజేపీ లేదని చెప్పిన.. దుబ్బాకలో ఓటమి తరువాత బీజేపీని అంతతేలిగ్గా తీసుకోవద్దని తమ పార్టీ నాయకులకు సూచించాడు. ఇక తరువాత జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీ దూకుడును ప్రదర్శించి టీఆర్ఎస్ కు గట్టి పోటీనిచ్చింది. దీనితో సులువుగా మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని భావించిన టీఆర్ఎస్ అసలు […]
పీఎం మోదీ, కేసీఆర్ తో కయ్యానికి కాలు దువ్వుతున్నాడా.? 2023 లో సార్వత్రిక ఎన్నిలకల్లో బీజేపీ గెలుస్తుందా..? అనే అనుమానాలకు తెర దించుతున్నాయి వరస ఎన్నికలు. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ని విస్తరిస్తూ వస్తున్న మోదీకి తెలంగాణ, ఆంధ్రాలో అంత ఈజీ గా పట్టు చిక్కలేదు. 2014 నుండి 2018 వరకు ఎలాంటి ప్రభావం చూపలేని నరేంద్ర మోదీ తొలిసారిగా 2018 లోక్సభ ఎలక్షన్స్ లో నాలుగు సీట్లు గెలిచి బీజేపీ తమ ఆశలను సజీవంగా ఉంచుకుంది. […]