Telugu News » Tag » టీడీపీ
Chandrababu Naidu : సొంత నియోజకవర్గంలో చంద్రబాబు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితిని అధికార వైసీపీ కల్పిస్తోంది. ఎలాగైనా కుప్పం నియోజకవర్గాన్ని వచ్చే ఎన్నికల్లో కైవసం చేసుకోవాలని చూస్తోన్న వైసీపీ, అందుకు అనుగుణంగా కుప్పంలో అల్లర్లను ప్రోత్సహిస్తోందన్న విమర్శలున్నాయి. చంద్రబాబు తాజాగా కుప్పంలో పర్యటిస్తుండగా, చంద్రబాబుపైకి వైసీపీ శ్రేణుల్ని ఆ పార్టీకి చెందిన కొందరు కీలక నేతలే ఎగదోస్తున్నట్లు టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రాబుకి జడ్ ప్లస్ భద్రత వుంది. కేంద్రం కల్పిస్తోన్న భద్రత ఇది. […]
India TV : 2024 ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోల్డన్ని సర్వేలు జరుగుతున్నాయి. ఎవరికి వారే.. అన్న చందాన, అన్ని రాజకీయ పార్టీలూ సర్వేలు చేయించుకుంటున్నాయి. రాజకీయ పార్టీల సొంత సర్వేలకు తోడు, ఆ పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్న వ్యక్తులు, సంస్థలూ పలు రకాల సర్వేలు చేస్తుండగా, తటస్థంగా మరికొంతమంది వ్యక్తులు సంస్థలు కూడా సర్వేలు చేస్తుండడం చూస్తున్నాం. నేషనల్ మీడియా, లోకల్ మీడియా.. ఇలా ఎడా పెడా […]
Telugu Desam Party : తెలుగుదేశం పార్టీకీ, భారతీయ జనతా పార్టీకీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అది కూడా ఏపీ బీజేపీ వర్సెస్ ఏపీ టీడీపీ మాత్రమే. జాతీయ స్థాయిలో బీజేపీకి టీడీపీ అంశాల వారీగా మద్దతిస్తూ వెళుతోంది. తెలంగాణలో అయితే టీడీపీ దాదాపుగా గల్లంతయిపోయింది. అయితే, రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ, తెలుగుదేశం పార్టీ మద్దతు తీసుకుంటే ఎలా వుంటుందన్న ఆలోచన చేస్తోందట. […]
Daggubati Venkateswara Rao: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుని ఆసుపత్రిలో పరామర్శించారు. ఇటీవల దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి స్వల్ప గుండెపోటు రావడంతో, ఆయనకు అపోలో వైద్యులు స్టెంట్ వేశారు. ప్రస్తుతం దగ్గుబాటి వెంకటేశ్వరరావు కోలుకుంటున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావుని ఆసుపత్రిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పరామర్శించారు. ఆ సమయంలో అక్కడే దగ్గుబాటి పురంధరీశ్వరి కూడా వున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు యోగ క్షేమాల గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. స్వర్గీయ ఎన్టీయార్‌కి వెన్నుపోటులో […]
TDP 2004 లో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన వంగవీటి రాధా ఆ తర్వాత చేసిన కొన్ని రాజకీయ తప్పులు కారణంగా దాదాపుగా తన రాజకీయ జీవితాన్ని పాడు చేసుకున్నాడు అనే మాటలు వినిపించాయి. నిలకడ లేని నిర్ణయాలతో తనకు తానే కిందకు దించుకున్నాడు రాధా.. బెజవాడ లో వంగవీటి అనే పేరుకు ఒక బ్రాండ్ ఉంది, కానీ దానిని కొనసాగించడంలో చాలా వరకు విఫలమైయ్యాడు రాధా.. ప్రస్తుతం టీడీపీ లో కొనసాగుతున్న రాధా, గత ఎన్నికల తర్వాత […]
Chandrababu : ఓటుకు నోటు కేసు మరోసారి చర్చకు వచ్చింది. ఏసీబీ స్పెషల్ కోర్టులో విచారణకు వచ్చిన ఈ కేసుకు సంబంధించి పలు విషయాలను కోర్టు తాజాగా ధృవీకరించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని… అలా చేస్తే మనవాళ్లు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుతారని చంద్రబాబు తనకు హామీ ఇచ్చారంటూ అప్పటి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కోర్టుకు వెల్లడించారు. తనతో ఫోన్ లో చంద్రబాబే మాట్లాడారని ఆయన స్పష్టం చేశారు. ఏసీబీ స్పెషల్ కోర్టు […]
TDP గ్రామ పంచాయతీ ఎన్నికలతోపాటు మున్సిపల్ ఎలక్షన్ లో కూడా పచ్చ బ్యాచ్ ని తిరస్కరించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్న తిరుపతి బైఎలక్షన్ లోనూ కళ్లు బైర్లు కమ్మేలా తీర్పిచ్చారు. దీంతో వాళ్లు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థంకావట్లేదు. అధికార పార్టీ వైఎస్సార్సీపీ దొంగ ఓట్ల సాయంతో విజయం సాధించిందని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇవాళ సోమవారం ఆరోపించారు. తద్వారా డాక్టర్ గురుమూర్తికి ఓటేసినవాళ్లందరూ దొంగలనే అర్థం వచ్చేలా మాట్లాడారు. తిరుపతి […]
Chandra Babu దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో ప్రధాని మోడీ పనితీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బీజేపీ అంటే భయపడే కొందరు నేతలు మౌనం వహిస్తున్న కానీ, మరికొందరు మాత్రం బహిరంగంగానే మోడీ పై విమర్శలు చేస్తున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మోడీకి అనుకూలమో లేక వ్యతిరేకమో తెలియని పరిస్థితి ఉంది.. తాజాగా బాబు మాటలు వింటే మాత్రం మోడీకి వ్యతిరేకంగానే వ్యాఖ్యలు చేసినట్లు అర్ధం చేసుకోవచ్చు. బాబు మాట్లాడుతూ ఈ […]
Balakrishna గంధం చంద్రుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా కలెక్టర్. మొన్నీమధ్య వార్తల్లో నిలిచాడు. అతని పై అదే జిల్లాకు చెందిన ధర్మవరం శాసన సభ్యుడు (వైఎస్సార్సీపీ) కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డాడు. మంత్రుల్ని, ఎమ్మెల్యేల్ని, ఎంపీల్ని కలెక్టర్ గంధం చంద్రుడు ఏమాత్రం లెక్కచేయట్లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అతనొక పనికి మాలిన ఐఏఎస్ అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. వాళ్లిద్దరి మధ్య వాస్తవానికి ఏం జరిగిందో తెలియదు […]
టీడీపీ సీనియర్ నాయకుడు ధూళిపళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనది గుంటూరు జిల్లా చింతలపూడి. ఏమాత్రం సమాచారం లేకుండా… సుమారు 100 మంది పోలీసులను మోహరించిన ఏసీబీ అధికారులు ఇవాళ ఉదయం ఆయన్ను అరెస్ట్ చేశారు. ధూళిపాళ్ల సంగం డెయిరీ చైర్మన్ గా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. అయితే.. ఆ సంస్థలో అక్రమాలు జరిగాయని ధూళిపాళ్లపై ఆరోఫణలు ఉన్నాయి. దీంతో విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు… పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసి […]
TDP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కాపీ కొట్టడంలో తనకి తిరుగులేదని నిరూపించుకుంటోంది. తెలంగాణ రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను చూసి అచ్చం అవే అక్కడా ప్రవేశపెట్టాలని జగన్ సర్కార్ ని డిమాండ్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ ప్రభుత్వం కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ స్కూల్ టీచర్లకి నెలకి రూ.2,000 నగదు, ఒక్కొక్కరికి 20 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తోంది కదా. దీంతో ఏపీలో సైతం వైఎస్సార్సీపీ […]
TDP మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కరోనా వైరస్ సోకటం పై సెటైర్లు వేసిన మల్టీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ నిన్న మంగళవారం ఏపీలోని ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీని టార్గెట్ చేశారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై విరుచుకుపడ్డారు. వాళ్లిద్దర్నీ కరోనా వైరస్ లోని రెండు వేరియెంట్లతో పోల్చారు. ఆ రెండు వైరస్ లకీ తగిన వ్యాక్సిన్ తారక్ (జూనియర్ ఎన్టీఆర్) మాత్రమేనని […]
Tirupati తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నికను రద్దు చేయాలంటూ అధికార పార్టీ వైఎస్సార్సీపీ మినహా దాదాపు మిగతా అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. తెలుగుదేశం, బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి (సీఈసీకి) లేఖలు రాశాయి. కమలం పార్టీ అభ్యర్థి కె.రత్నప్రభ నిన్న మంగళవారం ఏకంగా ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎలక్షన్ రిజల్ట్ ప్రకటించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. రూలింగ్ పార్టీ భారీగా అక్రమాలకు పాల్పడిందని, పోలింగ్ కేంద్రాలను స్వాధీనం చేసుకుందని, దొంగ ఓట్లు […]
Chandrababu : ఏపీలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. టీడీపీ ప్రస్తుత పరిస్థితి ఇలా ఉండటానికి ముమ్మాటికీ చంద్రబాబే కారణం అని అంతా అనుకుంటున్నారు. 2019 ఎన్నికల వరకు ఏపీలో ఓ వెలుగు వెలిగిన పార్టీ ఇప్పుడు ఏమాత్రం బలం లేకుండా… బలహీనంగా తయారైందంటే దానికి కారణం ఖచ్చితంగా పార్టీ హైకమాండ్ ఫెయిల్యూర్ అనే చెప్పుకోవాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్షేత్రస్థాయి కార్యకర్తలను, నాయకులను పట్టించుకోలేదు అనే అపవాదు ఉన్నదే […]
Bye-Election : ఏపీలోని తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి, తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ సెగ్మెంట్ కి ఉప ఎన్నిక పోలింగ్ ఇవాళ శనివారం విజయవంతంగా ముగిసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా ప్రశాంతంగా ఓటింగ్ ముగిసింది. అయితే తిరుపతిలో సాయంత్రం 5 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం చాలా తక్కువ (55 శాతం మాత్రమే) పోలింగ్ నమోదు కాగా నాగార్జునసాగర్ లో రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉన్న డేటా మేరకు 88 […]