Telugu News » Tag » టీఆర్ఎస్
YS Sharmila : సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ మండలం లక్కవరంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల నిరసన దీక్షకు దిగడం సంచలనంగా మారింది. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా షర్మిల లక్కవరంలో నిరుద్యోగ నిరాహార దీక్షకు దిగారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర శ్రేణులూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ శ్రేణులకు వ్యతిరేకంగా హంగామా సృష్టించాయి. దాంతో, ఇరు వర్గాల మధ్యా తోపులాట, చిన్నపాటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. వైటీపీ నేత ఏపూరి సోమన్నపై […]
TRS : ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా ఈటల రాజేందర్ గురించే చర్చ. ఉన్నట్టుండి.. ఒక్కసారి ఈటల రాజేందర్ పై సీఎం కేసీఆర్ ఉక్కుపాదం మోపారు. ఆయనపై భూకబ్జా వ్యవహారంలో విచారణకు ఆదేశాలు జారీ చేయడం మొదలు.. ఆయన గురించి మీడియాలో కథనాలు ప్రసారం కావడం, ఆ తెల్లారే ఆయన మంత్రిత్వ శాఖను సీఎం కేసీఆర్ బదలాయించుకోవడం, ఆ తర్వాత ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం.. అన్నీ చకచకా జరిగిపోయాయి. పక్కా ప్లాన్ ప్రకారం.. ఈటల […]
Etela Rajender : మంత్రి హరీశ్ రావు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆయన్నను పార్టీలో అందరూ ట్రబుల్ షూటర్ అని అంటుంటారు. టీఆర్ఎస్ పార్టీలో హరీశ్ రావుది ప్రత్యేక స్థానం. పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్న ఆయన ఆ మధ్య కొన్ని రోజులు సైలెంట్ అయిపోయారు. పార్టీ కీలక వ్యవహారాల్లోనూ పాల్గొనలేదు. ఏది ఏమైనా.. కేసీఆర్ అల్లుడు కావడంతో.. వాళ్ల మధ్య ఏవైనా విభేదాలు వచ్చాయేమో అని అంతా అనుకున్నారు. కానీ.. ప్రస్తుతం ఈటల […]
Eatala: కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈటల రాజేందర్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ లా నిలుస్తున్నారు. ఆయనకి, టీఆర్ఎస్ కి మధ్య కొంత బాకీ మిగిలిపోయింది. ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఈటల రాజీనామా చేస్తే ఆ బంధం పూర్తిగా తెగిపోతుంది. దీంతో కొత్త ఎపిసోడ్ మొదలవుతుంది. దీనికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చని, రేపో మాపో అని అంటున్నారు. ఈటల కమలం పార్టీలోకి కాలు మోపటం లాంఛనమే అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ […]
Telangana: తెలంగాణ రాజకీయం గరంగరంగా సాగుతోంది. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్, టీఆర్ఎస్ వర్సెస్ ఈటల అన్నట్లు నడుస్తోంది. ‘రైతు గోస – బీజేపీ పోరు దీక్ష’ పేరుతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఇవాళ సోమవారం ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. పాడిందే పాడరా పాచిపళ్ల దాసుడా అనే సామెత మాదిరిగా అతను మళ్లీ కేసీఆర్ పై విమర్శలు చేశాడు. చెప్పింది చేయని, ఏమీ చేయని ఏకైక సీఎం అంటూ ఎద్దేవా చేశాడు. అయితే.. నూతన […]
Etela Rajender : ఈటల రాజేందర్.. ప్రస్తుతం తెలంగాణలో ఆయనే హాట్ టాపిక్. ఆయనపై భూకబ్జా వ్యవహారంలో ఆరోపణలు చేయడంతో పాటు మంత్రి వర్గం నుంచి కూడా తీసేసిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు కష్టాలు ఇంకా ఎక్కువయ్యాయి అని అనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉండటంతో.. ఆయనకు హుజూరాబాద్ టీఆర్ఎస్ కార్యకర్తలు, ఇతర నేతలు ఇన్ని రోజులు అండగా ఉన్నారు. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఆయనకు అండగా ఉన్న […]
Mayors: ఈరోజు శుక్రవారం తెలుగు మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్న ఈ రెండు ఫొటోల్లో ఉన్నోళ్లు ఎవరంటే ఒకరు గుండు సుధారాణి. మరొకరు పునుకొల్లు నీరజ. గుండు సుధారాణి గతంలో రాష్ట్ర స్థాయిలో బాగా పరిచయం ఉన్న పేరే. మాజీ ఎంపీ. ఐదారేళ్ల కిందటే తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఈమెను ఇవాళ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా గులాబీ పార్టీ సెలెక్ట్ చేసింది. నీరజను ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా […]
Etela Rajender ఈటల రాజేందర్ వ్యవహారంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడని, కేవలం పార్టీ నుండి బహిష్కరించటమే కాకుండా ఏకంగా జైలుకు పంపే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు గాసిప్స్ వచ్చాయి, అయితే ఇప్పుడు ఈటల విషయంలో తెరాస పార్టీ కొంచం వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. ఈటల వ్యవహారం చూసిన తర్వాత తొందర పడి ఏమైనా నిర్ణయం తీసుకుంటే మొదటికే మోసం వస్తుందని భావించిన తెరాస ప్రస్తుతానికి సైలెంట్ గా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. క్యాబినెట్ […]
Etela Rajender తాజా మాజీ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ ఈటల రాజేందర్ కి అదే పార్టీ నుంచి ఫస్ట్ కౌంటర్ పడింది. అధికార పార్టీ తరఫున ఆయనకు వ్యతిరేకంగా గత మూడు నాలుగు రోజుల నుంచి ఎవరూ మాట్లాడలేదు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని ఇదే విషయమై విలేకరులు ప్రశ్నిస్తే ఆ అంశం ప్రస్తుతం సీఎం కేసీఆర్ పరిధిలో ఉందని చెప్పి తప్పించుకున్నారు. కానీ ఇవాళ మంగళవారం మరో మంత్రి కొప్పుల ఈశ్వర్ […]
Car: తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ ఏదైనా ఓటర్ల సెక్షన్ మాత్రం కారు పార్టీయే అవుతోంది. నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికలో జనం గులాబీ పార్టీ వెంటే నిలిచినట్లు నిన్న ఆదివారం వెలువడ్డ ఫలితంలో తేలగా ఇవాళ సోమ వారం జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్ కౌంటింగ్ లో సైతం ప్రజలు అధికార పార్టీకే మద్దతుగా నిలిచారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఐదు మున్సిపాలిటీలకు ఐదింటిని, రెండు మున్సిపల్ కార్పొరేషన్లలో ఒకదాన్ని ఇప్పటికే సొంతం చేసుకుంది. మరో మున్సిపల్ కార్పొరేషన్ […]
Etela Rajender తాజా మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్ చుట్టూ మరింతగా ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే అసైన్డ్ భూములను, అటవీ భూములను ఆక్రమించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆయనపై లేటెస్టుగా దాదాపు 1,561 ఎకరాల ఆలయ భూముల కబ్జా వ్యవహారం కూడా వెలుగు చూసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం పైనా దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సోమవారం ఒక కమిటీని నియమించింది. ఇందులో ఏకంగా నలుగురు ఐఏఎస్ ఆఫీసర్లు అందునా ముగ్గురు […]
GHMC: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని లింగోజిగూడ డివిజన్ కి జరిగిన ఉపఎన్నికలో ఎవరూ ఊహించనివిధంగా కాంగ్రెస్ పార్టీ క్యాండేట్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి గెలిచారు. దీంతో కమలనాథులు కంగుతిన్నారు. కాషాయం పార్టీ ఈ ఓటమిని కొనితెచ్చుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లింగోజిగూడ వ్యవహారం తెలంగాణ బీజేపీలో కొద్ది రోజులుగా కలకలం రేపుతోంది. 2020 డిసెంబర్ లో జరిగిన బల్దియా ఎన్నికల్లో ఈ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థి ఆకుల రమేష్ గౌడ్ విజయం సాధించినా.. […]
Sagar by poll : నాగార్జున సాగర్ లో కారు స్పీడ్ కు ఎవరు బ్రేకులు వేయలేకపోయారు. కారు స్పీడ్ కు కాంగ్రెస్ కంచుకోట బద్దలు అయిపోయింది. బీజేపీ పార్టీ అయితే కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేదు. నాగార్జున సాగర్ ఉపఎన్నికను టీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ సీరియస్ గా తీసుకొని.. సీఎం కేసీఆర్ ఏకంగా రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అదే టీఆర్ఎస్ పార్టీని నేడు గెలిపించింది. అలాగే… టీఆర్ఎస్ పార్టీకి సానుభూతి కూడా వర్కవుట్ […]
Etela Rajender : ఈటల రాజేందర్.. ఇప్పుడు తెలంగాణ మంత్రి కాదు. ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమే. ఇవాళ ఉదయమే ఓవైపు తనపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరుగుతుండగా… తెలంగాణ గవర్నర్ తమిళిసై… తన వైద్యారోగ్య శాఖను సీఎం కేసీఆర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం కేసీఆర్ ఇంత సడెన్ గా నిర్ణయాలు తీసుకుంటారని ఎవ్వరూ ఊహించలేదు. భూకబ్జాపై రైతులు లేఖ రాయడం, వెంటనే విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశించడం, తెల్లారే ఈటల […]
Etela Rajender : అందరూ అనుకున్నట్టుగానే… అందరూ ఊహించినట్టుగానే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మంత్రి పదవి పోయింది. డైరెక్ట్ గా కాకుండా… అన్నీ ఇన్ డైరెక్ట్ గా జరిగాయి. వైద్యారోగ్య శాఖను సీఎం కేసీఆర్ కు కేటాయిస్తూ తెలంగాణ గవర్నర్ తమిళిసై ఇవాళ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈటల రాజేందర్ కొన్ని ట్వీట్లు చేశారు. తాను వైద్యారోగ్య మంత్రిగా ఉన్న సమయంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. గత […]