Telugu News » Tag » గీతం యూనివర్సిటీ
తెలుగుదేశం పార్టీలోని ఒక్కో పెద్ద తలకు ఒక్కో విధానం ఉంది వైఎస్ జగన్ దగ్గర. గత ప్రభుత్వంలో ఎవరెవరు ఏయే అవినీతికి పాల్పడ్డారు, ఎవరి మీద ఎన్ని పాత కేసులున్నాయి అనేది బయటికి లాగి మరీ ఇరికించేస్తున్నారు. అలా ఇరుక్కున్న నాయకుడే అచ్చెన్నాయుడు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్ మీద, వైసీపీ మీద తన ప్రతాపం చూపించిన అచ్చెన్నాయుడు ప్రతిపక్షంలోకి మారినా దూకుడు తగ్గించుకోలేదు. ఇంకాస్త వాయిస్ పెంచి ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. అలా ఆయన ఎగిరిపడుతుండగానే ఈఎస్ఐ కుంభకోణాన్ని బయటికిలాగి మీద పెద్ద బండ వేశారు జగన్. ఆ దెబ్బతో […]
ఏపీలో కమ్యూనిస్టులు ఏనాడూ వంత పాడే రాజకీయాలు చేసింది లేదు. ప్రతి విషయంలోనూ వాళ్ళకంటూ ఒక సొంత నిర్ణయం ఉండేది. జనం తమను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా సమస్యల పట్ల స్పందిస్తూ, అప్పుడప్పుడూ పోరాటాలు చేస్తూ వచ్చారు. కానీ ఏనాడూ తెరవెనుక రాజకీయ నడిపిన చరిత్ర లేదు వాళ్లకి. జనంలో పలుకుబడి లేకపోయినా నిజాయితీపరులనే పేరైతే ఉండేది. ఇప్పుడది కనుమరుగవుతోంది. ఎన్నడూలేని తరహాలో తోడు కోసం ప్రధాన పార్టీల అండ కోసం అర్రులు చాస్తున్నారు వాళ్ళు . ఒకరేమో తెలుగుదేశం టర్న్ తీసుకుంటే ఇంకొకరేమో వైసీపీకి వంతపడుతున్నారు. మొన్నటికి మొన్న సీపీఐ నారాయణగారు విశాకహాలో గీతం […]
విశాఖ గీతం యూనివర్సిటీ రగడ పాలక పక్షం, ప్రతిపక్షం మధ్యన వేడిని తారాస్థాయికి చేర్చింది. చంద్రబాబు నాయుడు అండతో గీతం యాజమాన్యం ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేసిందని ఆరోపిస్తూ మున్సిపల్ అధికారులు ప్రహరీ సహా కొన్ని నిర్మాణాలను కూల్చేశారు. దీంతో ప్రతిపక్షం టీడీపీ కావాలనే జగన్ కక్ష తీర్చుకుంటున్నారని, చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని టార్గెట్ చేసి శ్రీభరత్ విద్యాసంస్థల మీద దాడికి దిగారని ఆరోపిస్తున్నారు. అయితే పాలకవర్గం మాత్రం ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే కూలగొట్టరా అంటూ వ్యంగ్యాస్త్రాలు వదులుతున్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేలా లేదు అధికారపక్షం. ఈ నేపథ్యంలో […]
గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుందని చెబుతూ విశాఖ మున్సిపల్ అధికారులు యూనివర్సిటీ నిర్మాణాలు కొన్నింటిని కూలగొట్టడం సంచలం రేపింది. గీతం యాజమాన్యం ఎండాడ, రిషికొండ ఏరియాల్లో సుమారు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని అనుమతులు లేకుండా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిందని, ఆ భూమి విలువ 800 కోట్లు ఉంటుందని అందుకే కూల్చేసి ప్రభుత్వం తన భూమిని తాను స్వాధీనం చేసుకుందని పాలక పక్షం అంటోంది. గీతం యూనివర్సిటీ చైర్మన్ బాధ్యతలను శ్రీభరత్ చూసుకుంటున్నారు. అయన స్వయానా నందమూరి బాలకృష్ణకు చిన్నల్లుడు. తెలుగుదేశం పార్టీ నేత కూడ. […]