Telugu News » Tag » కేటీఆర్
KTR : తెలంగాణ ఐటీశాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల విశ్వబ్రాహ్మణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో విశ్వబ్రాహ్మణ కులస్తులు ఆందోళలు చేపట్టారు. మంత్రి కేటీఆర్ చారి పేరుతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని.. తమను కించపరిచే విధంగా మాట్లాడరని అదే సామాజికవర్గానికి చెందిన కొందరు మండిపడుతున్నారు. మంత్రిపై ఆగ్రహం.. కేటీఆర్.. చారి, పప్పు చారి, తల్లోజు ఆచారి, అనే వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపించారు. ఈ మేరకు […]
KTR: డ్రగ్స్ కేసు వ్యవహారం రోజు రోజుకి ప్రకంపనలు పుట్టిస్తుంది. సినిమా,రాజకీయానికి చెందిన వారిపై కూడా ఆరోపణలు వస్తున్నాయి.ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన 12 మంది సెలబ్రిటీలను ఈడీ విచారించి పలు విషయాలను రాబడుతున్నారు. ఎక్సైజ్ అధికారులు సరిగ్గా విచారణ జరపనందునే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగంలోకి దిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ వైపు ఈ వ్యవహారంపై అధికార, విపక్ష పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు కొనసాగుతుండగా.. ఈ కేసులో మంత్రి కేటీఆర్ ప్రమేయం ఉందంటూ ఈడీకి ఫిర్యాదు […]
KTR: తెలంగాణ మంత్రి, కేసీఆర్ తనయుడు కేటీఆర్ సామాజిక సేవలో ఎప్పుడు ముందుంటారనే సంగతి తెలిసిందే. ఆయన చేస్తున్న ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలలో ఆయనకి మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి. డైనమిక్ లీడర్‌గా ప్రజలు ఆయనని కీర్తిస్తున్నారు. సోషల్ మీడియాలో కొందరు తమకు సాయం చేయాలని అభ్యర్దిస్తుండగా, వారికి తనదైన శైలిలో స్పందిస్తుంటారు కేటీఆర్. రియల్ హీరో గా కీర్తింపబడుతున్న సోనూసూద్… కేటీఆర్‌ని రియల్ హీరో అని కామెంట్ చేయడం గమనర్హం. ఎన్నో మంచి పనులతో […]
KTR: నిత్యం ప్రజలతో మమేకం అవుతూ, వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ సామాన్య ప్రజలలో ఒకడిగా కలిసిపోయి వారి సమస్యల పరిష్కారానికై పోరాడుతున్నారు కేటీఆర్. సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉండే కేటీఆర్ తన వద్దకు వచ్చిన ఏ సమస్యనైన వెంటనే పరిష్కరిస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్ యువ సింగర్ ప్రతిభకు మద్దతు ఇవ్వాలని కోరగా, వెంటనే స్పందించారు మెదక్ జిల్లాలోని నారంగి గ్రామంలో నివసిస్తున్న లక్ష్మణ చారి కూతురు శ్రావణిలో అద్భుతమైన టాలెంట్ ఉంది. ఆమె […]
KTR విలన్‌గా వెండితెర పై అలరించి ప్రేక్షకాభిమానం పొందిన సోనూసూద్ గత ఏడాది నుండి దేశానికి ఎంతో సేవ చేస్తున్నాడు. కరోనా ప్రళయం వలన చాలా మంది జీవితాలు దుర్భరంగా మారడంతో ఎంతో మందికి అండగా నిలిచాడు. వలస కూలీల దగ్గర నుండి విదేశాలలో చిక్కుకున్న విద్యార్ధులని తీసుకొచ్చే వరకు సోనూసూద్ చేసిన కృషి అమోఘం. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ అందక చాలా మంది మృతి చెందుతున్నారన్న విషయం తెలుసుకున్న సోనూసూద్ ప్రత్యేకంగా […]
తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ట్విట్టర్‌లో చాలా యాక్టివ్ అన్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ ప్రస్తుతం విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు పడుతున్న బాధలను గుర్తిస్తున్న కేటీఆర్ వెంటనే వాటికి శాశ్వత పరిష్కారం వచ్చేలా చూస్తున్నారు. సోషల్ మీడియాలోను ఆయనకు అనేక రిక్వెస్ట్‌లు వస్తుండగా, వాటిపై వెంటనే స్పందిస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నారు కేటీఆర్. అయితే తాజాగా తోటకూరి రఘుపతి అనే నెటిజన్ చేసిన రిక్వెస్ట్ ఆయనకు పెద్ద షాకిచ్చింది. వివరాలలోకి వెళితే రఘుపతి […]
KTR: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ, బాధితులను ఆదుకోవటంలో తెలంగాణ రాష్ట్ర సర్కారుకు Hdfc బ్యాంకు తన వంతు ఆర్థిక సాయం చేసింది. కోటీ 55 లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళంగా అందించింది. ఈ మేరకు బ్యాంకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విశాల్ భాటియా, తెలంగాణ స్టేట్ హెడ్ శ్రావణ్ కుమార్ ఇవాళ మంగళవారం రాష్ట్ర మంత్రి కేటీఆర్ ని కలిసి చెక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బ్యాంకు ప్రతినిధులకు కేటీఆర్ ట్విట్టర్ […]
KTR: తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ విసిరిన ఛలోక్తికి కాంగ్రెస్ పార్టీ నేషనల్ లీడర్ శశి థరూర్ కూడా సరదాగానే స్పందించారు. ‘‘కరోనా తదితర మందులకు నోటికి తిరగని పేర్లు ఎందుకు పెడతారో తెలియదు. ఈ వ్యవహారంలో శశిథరూర్ హస్తం ఉండి ఉండొచ్చు’’ అంటూ కేటీఆర్ నిన్న గురువారం ట్విటర్ లో జోక్ గా పేర్కొనగా దాన్ని శశిథరూర్ ఇవాళ శుక్రవారం రీట్వీట్ చేశారు. ఇలాంటి విషయాలు మీకెందుకు సార్.. నాకు వదిలేయండి.. నేను చూసుకుంటానుగా.. అంటూ […]
KTR కరోనా వైరస్ సోకిన ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్న మంగళవారం పూర్తి స్థాయిలో కోలుకోగా.. అదే సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందిన మంత్రి కేటీఆర్ కూడా నిన్న బుధవారం రాత్రి డిశ్ఛార్జ్ అయ్యారు. గత నెల 23వ తేదీన కేటీఆర్ కి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో వారం రోజుల పాటు హోం ఐసోలేషన్ లోనే ఉండి ట్రీట్మెంట్ పొందారు. డాక్టర్ల సూచనతో 30వ తేదీన ఒక కార్పొరేట్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. […]
Etela Rajender : ఈటల రాజేందర్.. ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా ఈటల గురించే చర్చ. తెలంగాణ రాజకీయాలు కూడా ఈటల చుట్టూనే తిరుగుతున్నాయి. గత వారం నుంచి ఈటల గురించే మీడియాలో కథనాలు. సీఎం కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్టుగా రాజకీయాలు జరిగాయి. మంత్రవర్గం నుంచి ఈటలను బర్తరఫ్ చేయడమే కాదు.. త్వరలోనే పార్టీ నుంచి కూడా ఈటల రాజేందర్ ను బహిష్కరించేందుకు పార్టీ అధిష్ఠానం యోచిస్తోందట. ఈనేపథ్యంలో ఈటల కూడా దూకుడు మీదున్నారు. […]
Devaryamjal: హైదరాబాద్ శివారు ప్రాంతమైన శామీర్ పేట మండలం దేవరయాంజాల్ గ్రామంలో తాజా మాజీ మంత్రి ఈటల రాజేందర్, అతని అనుచరులు 1,500లకు పైగా ఎకరాల దేవాలయ భూమిని కబ్జా చేశారనే ఫిర్యాదులు ఇవాళ వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విషయమూ విధితమే. అయితే అక్కడ ఈటలకు మాత్రమే కాదు.. మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డిలకు కూడా అక్రమంగా భూములు ఉన్నాయని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. […]
Jai Telangana: అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చాటుకుంటూ ఉంటారు. నచ్చిన వ్యక్తి పేరుని తన పిల్లలకి పెట్టుకోవటం సహజం. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో తన కుమారుడికి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) అని నామకరణం చేశారు. ఆ తర్వాత కేసీఆర్ టీడీపీ నుంచి బయటికి వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరుతో […]
TRS: తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీని వేరు చేసి చూడలేం. అది చాలా కష్టమైన పని. గడచిన 20 ఏళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. ‘మన’ అనే భావోద్వేగాన్ని(సెంటిమెంట్ ని) పుట్టించి, పెంచి పోషించిన ఈ పొలిటికల్ పార్టీ ఆవిర్భవించి ఈ రోజు సోమవారంతో 20 ఏళ్లు పూర్తవుతోంది. రేపు 21వ ఏట అడుగు పెడుతోంది. 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పుడు కేసీఆర్ ఒక్కడే. ఇప్పుడు ప్రతిఒక్కరూ కేసీఆరే. […]
POOJA HEGDE కరోనా సెకండ్ వేవ్ తన విశ్వరూపం చూపిస్తుంది. సామాన్యులనే కాదు సెలబ్రిటీలను సైతం వణికిస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొందరు కరోనా బారిన పడుతున్నారు. కరోనా విషయంలో మొదటి నుండి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా కరోనా వైరస్ బారిన పడడం ఆందోళన రేకెత్తించింది. అయితే ఈ సారి సినీ పరిశ్రమకు చెందిన వారే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. అందులోను బాలీవుడ్, టాలీవుడ్ […]
కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేసిన కేటీఆర్ .. స్వల్పలక్షణాలతో నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వాళ్లు దయచేసి కరోనా పరీక్షలు చేయించుకోండి’ అంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. కేటీఆర్‌కు కరోనా రావడంతో పార్టీ కార్యకర్తలతో పాటు, అయన అభిమానులు, మిత్రులు సోషల్‌మీడియాలో ఆయన కోలుకోవాలి అంటూ పోస్ట్‌లు, ట్వీట్లు […]