Telugu News » Tag » కాంగ్రెస్ పార్టీ
Revanth: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఈరోజు శనివారం ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రి వద్ద ఇకపై రోజూ వెయ్యి మందికి ఉచితంగా భోజనం పెట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య, సెక్యూరిటీ సిబ్బంది, రోగులు, వాళ్ల బంధువులు, అంబులెన్సుల డ్రైవర్లు.. ఇలా అందరికీ ఈ సర్వీస్ అందిస్తామని స్పష్టం చేశారు. లాక్ డౌన్ కొనసాగినన్నాళ్లు ఇది కంటిన్యూ అవుతుందని […]
Eatala: టీఆర్ఎస్ ఎమ్మెల్యే, తాజా మాజీ మంత్రి ఈటల రాజేందర్ పొలిటికల్ ప్లానేంటో అర్థం కావట్లేదు. ఆయన ఎక్కువగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులను కలుస్తున్నారు. మొన్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డే ఈటల ఇంటికి వెళ్లి మంతనాలు జరపగా ఇవాళ మంగళవారం ఈటలే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నేత భట్టి విక్రమార్క వద్దకు వెళ్లి కలిశారు. రాష్ట్రంలోని లేటెస్ట్ రాజకీయ పరిస్థితులపై వాళ్లిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ హైదరాబాద్ లోని భట్టి […]
GHMC: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని లింగోజిగూడ డివిజన్ కి జరిగిన ఉపఎన్నికలో ఎవరూ ఊహించనివిధంగా కాంగ్రెస్ పార్టీ క్యాండేట్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి గెలిచారు. దీంతో కమలనాథులు కంగుతిన్నారు. కాషాయం పార్టీ ఈ ఓటమిని కొనితెచ్చుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లింగోజిగూడ వ్యవహారం తెలంగాణ బీజేపీలో కొద్ది రోజులుగా కలకలం రేపుతోంది. 2020 డిసెంబర్ లో జరిగిన బల్దియా ఎన్నికల్లో ఈ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థి ఆకుల రమేష్ గౌడ్ విజయం సాధించినా.. […]
Congress: వి.హనుమంతరావు(వీహెచ్) తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. రాజ్యసభ మాజీ సభ్యుడు. ప్రస్తుతం కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో దేశం మొత్తమ్మీద ఏ రాజకీయ నాయకుడికీ, ఏ పార్టీ లీడర్ కీ రాని బ్రహ్మాండమైన ఆలోచన ఆయనకి వచ్చింది. గ్రేట్. ప్రజాప్రతినిధి అంటే ఇలా ఉండాలి. నిత్యం కాకపోయినా కనీసం ఇప్పుడైనా ఇలా జనం గురించే ఆలోచించాలి. ఆయన తమ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ కి […]
Nagarjuna Sagar : తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ శాసన సభ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డి ఇవాళ శనివారం ఒక తమాషా సవాల్ విసిరారు. అన్ని పార్టీల వాళ్లూ నామినేషన్లు వేసి సైలెంటుగా ఇంట్లోనే కూర్చుందామని, ఎవరూ ప్రచారం చేయొద్దని, అప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దామని ఛాలెంజ్ చేశారు. ఇలా చేస్తే తానే తప్పకుండా విజయం సాధిస్తాననేది ఆయన ధీమా. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో, బీజేపీ నేతలు […]
Congress Party : నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ శాసన సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు, ఆశలు గంగలో కలిసినట్లేననిపిస్తోంది. ఎందుకంటే.. ఎమ్మెల్యే పదవి తన స్థాయికి చిన్నదని, అయినప్పటికీ అధిష్టానం పోటీచేయమంటోంది కాబట్టి చేస్తానని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ హోం మంత్రి జానారెడ్డి నిన్న(శుక్రవారం) అన్నారు. ఆయన చెప్పింది అక్షరాలా నిజమే కావొచ్చు. అత్యంత అనుభవం కలిగినవాడు అవ్వొచ్చు. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ సార్లు గెలిచిన లీడర్ కూడా […]
తెలంగాణలో కాంగ్రెస్ కాస్త వెనుకబడిందని అందరు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే గతంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీయే ఉండేది. ఇక అధికార పార్టీ పై తీవ్రంగా విమర్శలు చేస్తూ బలమైన గొంతును వినిపించేది. ఇక దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ గెలుపుతో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. ఇక ఈ ఉపఎన్నిక గెలుపుతో బీజేపీకి మాత్రం ఎక్కడలేని బలం లభించిందనే చెప్పాలి. ఇక దుబ్బాక జోష్ ను ఎక్కడ తగ్గించకుండా బల్దియా ఎన్నికల్లో కూడా […]
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త సంవత్సరంలో కూడా ఎదురు దెబ్బలు తప్పట్లేదు. 2021లోకి అడుగు పెట్టిన తొలి రోజే మరో పెద్ద వికెట్ పడిపోయింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్ష పదవికి తీవ్రంగా పోటీపడుతున్న ఇద్దరు బలమైన నేతల్లో ఒకరైన రేవంత్ రెడ్డికి ఈరోజు న్యూ ఇయర్ విషెష్ తోపాటు మరో హ్యాపీ న్యూస్ వినిపించింది. మాట తప్పనన్న చిన్న కోమటిరెడ్డి.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభాల్లో ఒకరైన […]
తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ పదవి రభస కొనసాగుతుంది. అయితే పీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు రాజీనామా చేసాడో గాని, ఇక అప్పటినుండి ఆశావహులు పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్నారు. పీసీసీ పదవి దక్కించుకొవాలని పార్టీలో పలువురు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె తాజా సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి దాదాపు ఖరారయినట్లేనని పలు వార్తలు వస్తున్నాయి. ఇక ఇలా వస్తున్న వార్తలకు ఆ పార్టీలో ఉన్న సీనియర్ లీడర్లకు […]
తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ పదవి కీలకంగా మారింది. ఇక ఈ పదవి కోసం పార్టీలోని పలువురు నాయకులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతల అభిప్రాయాలను కూడా సేకరించి అధిష్టానం కు అప్పగించాడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్. ఇక దీనితో ఎప్పుడెప్పుడు పీసీసీ పదవిని ప్రకటిస్తారా అని తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్నాయి. ఇక ఇప్పటికే పీసీసీ రేసులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి […]
తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో కలహాలు మొదలయ్యాయి. వాస్తవానికి పీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు రాజీనామా చేసాడో గాని అప్పటినుండి పార్టీలో రచ్చ జరుగుతుంది. ఇక ఖాళీగా ఉన్న పీసీసీ పదవి కోసం పార్టీలో చాలామంది నాయకులు పోటీపడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సొంత కుంపటిలోనే విభేదాల సమస్య వెంటాడుతుందని చెప్పాలి. అయితే పీసీసీ పదవి మీద ఉన్న శ్రద్ధ కాంగ్రెస్ పార్టీ పై పెట్టిన బాగుండేదని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో పదవుల […]
టాలీవుడ్ సీనియర్ నటీమణి విజయశాంతి కర్తవ్యం వంటి సినిమాల్లో సూపర్ పవర్ ఫుల్ పాత్రలను పోషించి తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ హీరోయిన్ అయ్యారు కానీ నిజజీవితంలో ఆమె జీరో అని ప్రతిసారి నిరూపించుకుంటూనే ఉన్నారు. ప్రజల సమస్యల పై పోరాడుతానని.. ప్రజల సంక్షేమం కొరకు పని చేస్తానని రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి ఇంటికే విజయశాంతి పరిమితమవుతారు. 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో పట్టుమని పది రోజులు కూడా ప్రజల్లోకి వెళ్ళి సమస్యలను తీర్చడానికి ఆమె ప్రయత్నించలేదు. 1998 […]
తెలంగాణలో నాగార్జునసాగర్ ఉపఎన్నిక రావడంతో అన్ని పార్టీలు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అయితే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో అక్కడ ఉపఎన్నికకు దారి తీసింది. ఇక సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ భావిస్తుంది. ఇక ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉండడంతో ఫుల్ జోష్ లో కనిపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి గత ఎన్నికల్లో నోముల నర్సింహయ్య చేతిలో పరాజయం అయ్యారు. […]
జిహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి నుండి పోటీ చేసి ఓటమి చెందిన అభ్యర్థులతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఇక ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే ప్రతిఒక్క నాయకుడికి అండగా ఉంటానని చెప్పుకొచ్చాడు. అలాగే ఎన్నికల ప్రచారంలో అంతమంది కనిపించిన తీరా పోలింగ్ సెంటర్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడలేదని పేర్కొన్నారు. పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ఎవ్వరు ఉపయోగించుకోలేదని అన్నారు. ఓటమి […]
విజయశాంతికి పేరులోనే విజయం ఉంది తప్ప పేరుకు తగ్గట్లు ఆమె రాజకీయ జీవితం అంత విజయవంతంగా సాగలేదనే చెప్పాలి. తెలుగు సినిమాల్లో లేడీ సూపర్ స్టార్ రేంజ్ నుంచి రాములమ్మ అనే కొత్త ఇమేజ్ సంపాదించుకున్న తర్వాత రాజకీయాల్లోకి వచ్చింది. ఇప్పుడేమో రాంరాం రాములమ్మ అనే కొత్త బ్యాడ్ ఇమేజ్ ని సొంతం చేసుకుంటోంది. విజయశాంతిని రాంరాం రాములమ్మ అనటానికి కారణం ఆమె పదే పదే పార్టీలు మారటం. 1998లో తొలిసారి పాలిటిక్స్ లోకి ఎంటరైన విజయశాంతి […]