Connect with us

Latest News

సుశాంత్ ది పక్కా సూసైడే , తేల్చేసిన డాక్టర్లు

Published

on

Share the News from here

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో రోజుకో కొత్త కోణం బయటకు వస్తుంది. అయితే సుశాంత్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక సుశాంత్ ది ఆత్మహత్య లేక హత్య అనే కోణంపై దర్యాప్తు జరుగుతుంది. అయితే తాజాగా ఎయిమ్స్ వైద్య బృందం సంచలన విషయాలు బయట పెట్టారు. సుశాంత్ సింగ్ ‌ది హత్య కాదని.. అది ఆత్మహత్యేనని ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్ల బృందం సీబీఐకి తెలిపింది.

అయితే సుశాంత్ కు విషం ఇచ్చారనో, గొంతు నులిమి చంపారనో వచ్చిన ఆరోపణలను ఈ బృందం తప్పుపట్టింది. ఇక ఈ మేరకు సీబీఐకి తమ మెడికో లీగల్ ఒపీనియన్ ని తెలిపింది. అలాగే సుశాంత్ పోస్ట్ మార్టం, అటాప్సీ రిపోర్టులను ఎయిమ్స్ ఫోరెన్సిక్ డాక్టర్లు సమగ్రంగా పరివేక్షించారు. సుశాంత్ ది సూసైడ్ కేసే తప్ప, మర్డర్ కేసు కాదని.. ఇదంతా కూడా ఘటనా స్థలం వద్ద దొరికిన ఆధారాల ద్వారా వెల్లడైందని పేర్కొన్నారు. ఇక ఈ ఆధారాలతో సీబీఐ సుశాంత్ సూసైడ్ కేసు కోణంలో దర్యాప్తు చేయనుంది.

Do NOT follow this link or you will be banned from the site!