Connect with us

Entertainment

ఐపీఎల్ : సన్ రైజర్స్ బౌలర్ భువి స్థానంలో.. యువ బౌలర్ కు చోటు.

Published

on

Share the News from here

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నుండి బౌలర్ భువనేశ్వర్ కుమార్ గాయం కారణంగా ఈ సీజన్ కు దూరమైన విషయం తెలిసిందే. ఇక భువి దూరం అవడంతో సన్ రైజర్స్ కు కోలుకోలేని దెబ్బె అని చేప్పాలి. ఎందుకంటె జట్టులో కీలక బౌలర్ గా ఉన్నాడు భువి. మరి భువి దూరం అవ్వడంతో అతడి స్థానంలో ఎవరు వస్తారని సన్ రైజర్స్ అభిమానులు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. ఇక మొత్తానికి భువి స్థానాన్ని భర్తీ చేసారు. అయితే భువి స్థానంలో యర్రా పృథ్వీ రాజ్‌కు చోటు లభించింది.

ఈ కుర్రోడు 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ‌లు, 9 లిస్ట్ – ఏ మ్యాచ్ ‌లు, మూడు టీ20 మ్యాచ్‌ లు ఆడాడు. అలాగే తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌ లో 39 వికెట్లు తీయగా, టీ20 క్రికెట్‌ లో నాలుగు వికెట్లు తీశాడు.అయితే పృథ్వీ తెలుగు రాష్ట్రాల్లోని ఏపీ రాష్ట్రానికి చెందినవాడు. అతడి స్వస్థలం గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల ప్రాంతమని చెందినవాడని తెలుస్తుంది. అంతేకాదు 2019 ఐపీఎల్ లో కోల్‌కత్తా నైట్ ‌రైడర్స్ జట్టు తరపున పృథ్వీ ఆడాడు.

Do NOT follow this link or you will be banned from the site!