India : యువ భారత్ గెలిచింది
NQ Staff - October 12, 2022 / 09:32 AM IST

India : ఆస్ట్రేలియాలో జరగబోతున్న టీ20 ప్రపంచ కప్ కోసం టీం ఇండియా జట్టు అంతా అక్కడికి వెళ్ళింది. అయినా కూడా దక్షిణాఫ్రికా తో వన్డే సిరీస్ ని నిర్వహించడంతో చాలా మంది చాలా రకాలుగా ప్రశ్నించారు.
యువ భారత్ తో దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ నిర్వహించడం జరిగింది. యువకులు ఎలా రాణిస్తారు అనే అనుమానం వ్యక్తం అవుతున్న సమయంలోనే సిరీస్ ని 2-1 తో చేజిక్కించుకొని అద్భుతమైన విజయాలను నమోదు చేయడం జరిగింది.
బలమైన దక్షిణాఫ్రికా తో ద్వితీయ శ్రేణి జట్టు అయిన టీమిండియా యువ జట్టు ఎదుర్కోవడం మామూలు విషయం కాదు. ఇక్కడ అనుభవజ్ఞుడైన శిఖర్ ధావన్ కెప్టెన్ గా వ్యవహరించడంతో జట్టుకు కలిసి వచ్చింది.
తొలి వన్డేలో స్వల్ప తేడాతో ఓడినప్పటికీ ఆ తర్వాత అనూహ్యంగా బలం పుంజుకుని వరుసగా రెండు వన్డే ల్లో ప్రత్యర్థి దక్షిణాఫ్రికా జట్టును చిత్తు చేసి వన్డే సిరీస్ ని సీనియర్స్ లేకున్నా రెండు ఒకటి తో చేజెక్కించుకున్న యువ భారత్ పై క్రీడాభిమానులు క్రికెట్ విశ్లేషకులు అభినందనలు గుప్పిస్తున్నారు.
పలువురు యువ క్రికెటర్లు తమ సత్తా చాటారు, త్వరలోనే మరిన్ని విజయాలను తాము ముందుండి అందించబోతున్నామంటూ ఇవ్వ క్రికెటర్స్ ఈ మ్యాచ్ తో చెప్పకనే చెప్పారు. మరో వైపు టీమిండియా ఆస్ట్రేలియాలో ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా కింద మీద పడుతుంది.
రాబోయే టీ20 వరల్డ్ కప్ లో ఎలా ఆడుతుందో అనే ఆందోళన వ్యక్తం అవుతుంది. వారికి బదులుగా వీరిని టీ20 వరల్డ్ కప్ కు పంపించి ఉంటే బాగుండేదేమో అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.