Ruturaj Gaikwad : ఒకే ఒక్క ఓవర్లో ఏడు సిక్సర్లు: రుతురాజ్ గైక్వాడ్ పెను సంచలనం.!
NQ Staff - November 28, 2022 / 05:06 PM IST

Ruturaj Gaikwad : క్రికెట్లో ఆరు బంతులకు ఆరు సిక్సర్ల గురించి విన్నాం. టీమిండియా డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సృష్టించిన పెను విధ్వంసం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంగ్లాండ్ జట్టు మీద గతంలో యువరాజ్ సింగ్ ఈ ఫీట్ చేశాడు.
ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొడితే వింతేముంది.? అంతకన్నా ఎక్కువ కొడితే.. అది కదా అసలు సిసలు కిక్కు.. అనుకున్నాడో ఏమో, యంగ్ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ ఏకంగా ఏడు సిక్సర్లు బాదేశాడు.
ఓవర్లో ఆరు బంతులే.. కానీ, ఏడు సిక్సర్లు.. 43 పరుగులు.!
క్రికెట్లో ‘ఓవర్’ అంటే ఆరు బంతులు. అలాంటప్పుడు ఆరు సిక్సర్ల కంటే ఎక్కువ కొట్టడం సాధ్యం కాదు కదా.? పోనీ, ఏడు సిక్సర్లు కొట్టే అవకాశమున్నా పరుగుల వచ్చేవి నలభై రెండే కదా.!
కానీ, ఇక్కడ లెక్క మారింది. ఆరు బంతులే.. కాకపోతే, ఆ ఓవర్లో నో-బాల్ పడింది. సో, ఏడు బంతులయ్యాయన్నమాట. కానీ, ఆరు బంతుల్నే లెక్కేస్తారు.
పైగా, నో-బాల్కి అదనపు పరుగు. వెరసి, ఏడు సిక్సర్లు.. ఓ అదనపు రన్.. వెరసి నలభై మూడు పరుగులయ్యాయన్మమాట ఓవర్లో.
అయితే, ఇది అంతర్జాతీయ మ్యాచ్లో జరిగిన ఫీట్ కాదు.! అయినాగానీ, క్రికెట్ హిస్టరీలో ఇదొక సంచలనం అని నిస్సందేహంగా చెప్పొచ్చు.
Historic over by Ruturaj Gaikwad – 7 sixes in an over.
Mad knock! pic.twitter.com/Wsd329x7L4
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 28, 2022