Venkaiah naidu : ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి రాష్ట్రపతిగా ప్రమోషన్ రాకుండా అడ్డుకున్నది ఎవరు.? అన్నదానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడు అన్ని విధాలా అర్హుడు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. విషయ పరిజ్ఞానం చాలా చాలా ఎక్కువ. దేశానికి రాష్ట్రపతిగా సేవలందించేందుకు అన్ని అర్హతలూ వెంకయ్యనాయుడికి వున్నాయి.
అన్నిటికీ మించి, సుదీర్ఘకాలం పాటు వెంకయ్యనాయుడు, భారతీయ జనతా పార్టీలో పనిచేశారు. వెంకయ్యనాయుడు అనుభవం భారతీయ జనతా పార్టీకి బోల్డంత ఉపయోగపడింది. బీజేపీ ఆయనకు ఎన్నో పదవులు ఇచ్చింది. అయినాగానీ, ఆయన్ని ఇంకాస్త బాగా గౌరవించి వుండాల్సిందన్న అభిప్రాయం రాష్ట్రపతి పదవి విషయమై వినిపిస్తున్నాయి.
మోకాలడ్డిందెవరు.?

వెంకయ్యకు రాష్ట్రపతి పదవి రాకపోవడానికి కారణం వైసీపీయేనంటూ ఓ ప్రచారం జరుగుతోంది. గతంలో, తెలుగు నేల నుంచి సర్వోన్నత న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ అయ్యే అవకాశం జస్టిస్ ఎన్వీ రమణకు వస్తే, మోకాలడ్డేందుకు వైఎస్ జగన్ విశ్వ ప్రయత్నం చేసిన మాట వాస్తవం. కానీ, వైఎస్ జగన్ పాచిక పారలేదు.
- Advertisement -
కానీ, రాష్ట్రపతి పదవి విషయంలో వైఎస్ జగన్ సక్సెస్ అయ్యారంటూ టీడీపీ అనుకూల మీడియా ఆరోపిస్తోంది. ఇందులో నిజమెంత.? అంటే, ప్రధాని నరేంద్ర మోడీ తలచుకుంటే, వెంకయ్యనాయుడికి రాష్ట్రపతి పదవి వచ్చి వుండేది. అంతే తప్ప, వైఎస్ జగన్ అడ్డుకున్నారనేది సబబు కాదు.. అన్నది నిర్వివాదాంశం.