Federer : ప్రపంచ టెన్నిస్ సంచలనం ఫెదరర్ షాకింగ్ నిర్ణయం.!

NQ Staff - September 15, 2022 / 09:18 PM IST

158858Federer : ప్రపంచ టెన్నిస్ సంచలనం ఫెదరర్ షాకింగ్ నిర్ణయం.!

Federer : ప్రపంచ టెన్నిస్ సంచలనం రోజర్ ఫెదరర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. టెన్నిస్ స్టార్ ప్లేయర్ రోజర్ ఫెదరర్‌ని ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది, కోట్లాదిమంది అభిమానులు అభిమానిస్తారు. టెన్నిస్ క్రీడకు తనదైన గ్లామర్ అద్దిన మేటి క్రీడాకారుల్లో రోజర్ ఫెదరర్ కూడా ఒకరు.

World tennis sensation Federer's shocking decision

World tennis sensation Federer’s shocking decision

కాగా, రోజర్ ఫెదరర్ తీసుకున్న సంచలన నిర్ణయం పట్ల ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు షాక్‌కి గురయ్యారు. ‘ఇలా చేయడం అస్సలేమాత్రం బాగా లేదు..’ అంటూ అభిమానంతోనే తమ అభిమాన క్రీడాకారుడిపై వ్యాఖ్యలు చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా టెన్నిస్ అభిమానులు.

రిటైర్మెంట్ ప్రకటించిన రోజర్ ఫెదరర్..

టెన్నిస్ కెరీర్‌లో ఫెదరర్ 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్ళను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ రంగంలో ఇంకెవరికీ సాధ్యం కాని అనేక రికార్డుల్ని ఆయన నెలకొల్పాడు. అయితే, తన ఇరవై నాలుగేళ్ళ టెన్నిస్ ప్రయాణానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు ప్రకటించాడాయన.

అభిమానులందరికీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పిన రోజర్ ఫెదరర్, తన భార్య మిర్కాకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపడం గమనార్హం. వచ్చే వారంలో జరిగే లావర్ కప్ తనకు చివరి ఈవెంట్ అని ఆయన వ్యాఖ్యానించాడు.

టెన్నిస్‌తో తన అనుబంధం విడదీయలేనిదనీ, అంతర్జాతీయ పోటీలకు దూరంగా వున్నా, ఇంకో రకంగా ఆటతోనే తన జీవితం కనొసాగుతుందని చెప్పాడు.