KL Rahul : అతడిని పక్కన పెట్టు… టీం ఇండియా కెప్టెన్ కి వీరేంద్ర సెహ్వాగ్‌ సలహా

NQ Staff - November 1, 2022 / 09:25 AM IST

KL Rahul : అతడిని పక్కన పెట్టు… టీం ఇండియా కెప్టెన్ కి వీరేంద్ర సెహ్వాగ్‌ సలహా

KL Rahul : టి20 వరల్డ్ కప్ లో భాగంగా తాజాగా సౌత్ ఆఫ్రికా పై ఓడిపోవడంతో భారత అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో కేఎల్ రాహుల్ యొక్క ఆట తీరుపై చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా సీనియర్లు కూడా ఈ సమయంలో కేఎల్ రాహుల్ ని పక్కకు పెట్టాలంటూ సూచిస్తున్నారు.

తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం ఈ విషయం గురించి స్పందించాడు. ప్రస్తుతం జరుగుతున్న మెగా టోర్నీ కోసం టీమిండియా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది.

ఆట పరంగా కేఎల్‌ రాహుల్ గొప్ప ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు, అయితే ఇప్పుడు అతడు సరైన ఫామ్ లో లేని కారణంగా అతడిని పక్కన పెట్టాల్సిందే. స్వదేశీ పిచ్ లపై అతడు గొప్ప ఇన్నింగ్స్ ఆడిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ జరుగుతున్నది ఆస్ట్రేలియాలో అనే విషయం తెల్సిందే.

కనుక అతడిని పక్కన పెట్టి అతని కంటే మెరుగైన ప్రదర్శన ఇచ్చే వారిని జట్టులోకి తీసుకుంటే ముందు ముందు విజయాలు సాధించే అవకాశం ఉంటుంది అంటూ వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్ రోహిత్ శర్మ కి సలహా ఇచ్చాడు.

వచ్చే మ్యాచ్ కి అయినా కెప్టెన్ రోహిత్ శర్మ సీనియర్స్ ఇచ్చిన సలహా ను పాటించి కేఎల్ రాహుల్ ని తప్పిస్తాడేమో చూడాలి. ఇప్పటికే కేఎల్ రాహుల్ కి చాలా అవకాశాలు వచ్చాయి.

పెద్ద జట్ల తో ఆడిన సందర్భంగా నే కాకుండా చిన్న టీమ్స్ తో ఆడిన సందర్భంలో కూడా రాహుల్ విఫలం అయ్యాడు. అందుకే అతడిని పక్కకు పెట్టాల్సిన సమయం వచ్చిందని మళ్లీ అతడు ఫామ్ నిరూపించుకోవాలంటే సీనియర్లు సూచిస్తున్నారు.

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us