Virat Kohli : ఆ షేక్ హ్యాండ్ తో వెయ్యి రోజుల శాపం వదిలించుకున్న విరాట్ కోహ్లీ
NQ Staff - September 9, 2022 / 12:31 PM IST

Virat Kohli : టీం ఇండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ దాదాపు మూడు సంవత్సరాల తర్వాత సెంచరీ కొట్టాడు. 1000 రోజుల తర్వాత 100 కొట్టాడు అంటూ ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ఆసియా కప్ ఓడిపోయిన కూడా ఆఫ్ఘనిస్తాన్ పై జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ చేసిన సెంచరీ భారత క్రికెట్ అభిమానులకు ఉత్సాహాన్ని నింపింది. రాబోయే రోజుల్లో విరాట్ కోహ్లీ నుండి మరిన్ని అద్భుతమైన ఇన్నింగ్స్ చూడబోతున్నామంటూ ఈ సెంచరీ తో నిరూపితమైంది అంటూ విరాట్ కోహ్లీ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే సమయంలో సోషల్ మీడియాలో

Virat Kohli Shook Hands with Pakistan Batsman Babar Azam Before Asia Cup
ఒక విషయం తెగ హల్చల్ చేస్తుంది. ఆసియా కప్ కి ముందు పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ బాబర్ ఆజమ్ తో విరాట్ కోహ్లీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ తర్వాతే విరాట్ కోహ్లీ పూర్తిగా మారిపోయాడు.
ఆసియా కప్ కి ముందు బాబర్ అద్భుతమైన ఫామ్ లో ఉండేవాడు.. కానీ అనూహ్యంగా ఆసియా కప్ లో అతడు అన్ని మ్యాచ్ల్లో కూడా నిరాశపరిచాడు. మరోవైపు విరాట్ కోహ్లీ అంతకు ముందు అన్ని మ్యాచ్ ల్లో కూడా నిరాశపర్చాడు. కానీ ఆసియా కప్ లో మాత్రం సూపర్ హిట్ అయ్యాడు.
దాంతో ఆ షేక్ హ్యాండ్ వల్ల శాపం అనేది కోహ్లీ నుండి బాబర్ కి వెళ్లి పోయిందని.. అందుకే బాబర్ ఫ్లాప్ అవుతున్నాడు. తన శాపం వెళ్లిపోవడంతో కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు అంటూ సోషల్ మీడియాలో కొందరు కామెడీగా పోస్టులు పెడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం ప్రస్తుతం మారింది చర్చనీయాంశంగా మారింది.