Virat Kohli : విరాట్ కోహ్లీ చితక్కొట్టుడు.! ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.?

NQ Staff - September 8, 2022 / 10:23 PM IST

157362Virat Kohli : విరాట్ కోహ్లీ చితక్కొట్టుడు.! ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.?

Virat Kohli : గత కొంతకాలంగా క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సరిగ్గా రాణించలేకపోతున్నాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. దీంతో, అభిమానులు ఒకింత కలత చెందుతున్నారు. ఎలాగైతేనేం, చితక్కొట్టేశాడు విరాట్ కోహ్లీ. అదీ ఆఫ్గాన్ జట్టు మీద.

Virat Kohli century drought smashes against Afghanistan

Virat Kohli century drought smashes against Afghanistan

ఆసియా కప్ టీ20 సిరీస్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ బాదాడు. దాదాపు వెయ్యి రోజుల తర్వాత విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి సెంచరీ జాలువారడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విమర్శకుల నోళ్ళు మూత పడినట్లేనా.?

నిజానికి, తాజా సిరీస్‌లో విరాట్ కోహ్లీ స్థిరంగా రాణిస్తున్నాడు. మిగతా జట్టు సభ్యుల్లో కొంత నిర్లక్ష్యం కనిపిస్తున్నా, కోహ్లీ మాత్రం ఆకట్టుకుంటున్నాడు. అయినాగానీ, కోహ్లీ మీదనే తరచూ విమర్శలు వస్తున్నాయి.

కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్నాక, ఈక్వేషన్స్ మారిపోవడం.. కోహ్లీని పదే పదే మాజీ క్రికెటర్లు టార్గెట్ చేయడం తెలిసిన విషయాలే. కోహ్లీ అంటే, ప్రపంచ క్రికెట్‌లో మేటి ఆటగాడు. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. ఫామ్ కోల్పోవడం ఏ ఆటగాడికైనా సహజమే.

కానీ, క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ఎంతటి అత్యున్నత శిఖరాల్ని అధిరోహించాడో.. అంతకు మించిన లోతుల్ని విమర్శకుల కారణంగా ఎదురుచూడాల్సి వస్తోంది. ఈ సెంచరీతో అయినా విమర్శకుల నోళ్ళకు మూతలు పడితే అంతకన్నా కవాల్సిందేముందని కోహ్లీ అభిమానులు అంటున్నారు.