Virat Kohli : ఒకప్పుడు మూడు ఫార్మాట్స్‌కి కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ ఫామ్ లేమి వలన కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడు. ఇక మునుపటి కోహ్లీని చూస్తాం అని అందరు భావించిన నేపథ్యంలో నిరాశపరుస్తూ వస్తున్నాడు. ఇప్పటికే కోహ్లీని వెస్టిండీస్, జింబాబ్వే టూర్స్‌కి విశ్రాంతి పేరుతో పక్కన పెట్టారు. ఇప్పుడు ఆసియా కప్‌కి అయిన ఎంపిక చేస్తారా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

కోహ్లీ.. ఏందిది?
ఆసియా కప్ 2022కు సంబంధించి టీమిండియా జట్టును ఆగస్టు 8(సోమవారం) ప్రకటించనున్నారు. ఉపఖండంలో జరిగే ఈ మెగాటోర్నీని టీమిండియా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రానున్న టి20 ప్రపంచకప్‌కు ఇది సన్నాహకంగా మారుతుందని బీసీసీఐ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆసియా కప్‌కు బెస్ట్ టీమ్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ యోచిస్తుంది.
ఇటీవలే గాయాలు.. ఫిట్‌నెస్ లేమి.. కరోనా కారణంగా జట్టుకు దూరమయిన టీమిండియా వైట్‌బాల్ వైస్‌కెప్టెన్ కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిసింది. కేఎల్ రాహుల్‌తో పాటు పేసర్ దీపక్ చహర్ కూడా ఆసియాకప్‌కు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే విరాట్ కోహ్లి ఆసియా కప్‌కు అందుబాటులో ఉండనున్నట్లు ఇప్పటికే సెలెక్టర్లకు హింట్ ఇచ్చాడు. కొంతకాలంగా ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న కోహ్లిని సెలెక్టర్లు పరిగణలోకి తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.
ఒకవేళ కోహ్లి జట్టులోకి ఎంపికైతే.. యథాతధంగా మూడో స్థానంలోనే వస్తాడు. అలా కాకుండా కోహ్లిని పక్కనబెడితే.. వన్‌డౌన్‌లో శ్రేయాస్ అయ్యర్‌లో ఒకరు బ్యాటింగ్ దిగనున్నాడు. అతనికి బ్యాకప్‌గా ఇషాన్ కిషన్ ఉంటాడు. ఇక మిడిలార్డర్‌లో సంజూ శాంసన్‌ను బ్యాకప్‌గా ఉంచనున్నారు.