Virat Kohli : విరాట్ కోహ్లీ అప్పటిదాకా ‘గంగ’, ఆపై ‘చంద్రముఖి’.!

NQ Staff - October 26, 2022 / 01:08 PM IST

Virat Kohli  : విరాట్ కోహ్లీ అప్పటిదాకా ‘గంగ’, ఆపై ‘చంద్రముఖి’.!

Virat Kohli  : టీమిండియా ఇటీవల టీ20 వరల్డ్ కప్ సందర్భంగా దాయాది పాకిస్తాన్ మీద ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఓడిపోతుందనుకున్న మ్యాచ్.. టీమిండియా నెగ్గగలిగిందంటే, అది కేవలం విరాట్ కోహ్లీ మాయాజాలం వల్లనే సాధ్యమైంది.

అంతకు ముందు వరకూ ఆచి తూచి ఆడాడు.. కానీ, ఒక్కసారిగా విరాట్ కోహ్లీ చెలరేగిపోయాడు. ఇదెలా సాధ్యమైంది.? దీనికి సంబంధించి ఓ మీమ్ సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతోంది.

గంగ నుంచి చంద్రముఖిలా మారిన విరాట్ కోహ్లీ..

45 బంతుల వరకూ ‘చంద్రముఖి’ సినిమాలోని గంగలా వున్నాడు.. ఆ తర్వాత అతనిలోకి ‘చంద్రముఖి’ ఆత్మ ప్రవేశించినట్లుంది.. అని టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ చెబుతున్నట్లుగా ఆ మీమ్‌ని రూపొందించారు. క్షణాల్లో ఈ మీమ్ వైరల్‌గా మారింది.

అదీ నిజమే.. విరాట్ కోహ్లీ గతంలో ఎన్నడూ ఆడని కొత్త షాట్స్ ఈ మ్యాచ్‌లో ఆడాడు. దాంతో, కింగ్ కోహ్లీ అభిమానులు కూడా, ఆయనలోకి ఏదో కొత్త శక్తి ప్రవేశించిందనే అంటున్నారు. ‘విరాట్ కోహ్లీ.. వెర్షన్ 2.0) అని కొందరు అంటోంటే, గంగ నుంచి చంద్రముఖిలా మారిన విరాట్ కోహ్లీ అంటున్నారు.
నిజానికి, ఛేదనలో ఎప్పుడూ విరాట్ కోహ్లీ ఇలాగే పూనకం వచ్చినట్లు చెలరేగిపోతుంటాడనుకోండి.. అది వేరే సంగతి.

 

 

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us