Virat Kohli : కోహ్లీ కెప్టెన్సీనే కాదు క్రికెట్ నే వదిలేయాల్సిన సమయం వచ్చిందా?
NQ Staff - September 7, 2022 / 04:38 PM IST

Virat Kohli : టీం ఇండియాలో సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి గొప్ప ఆటగాడు విరాట్ కోహ్లీ అంటూ ఆయన అభిమానులు చాలా మంది అంటూ ఉంటారు. ఆ మాట నిజమే… కానీ ఒకప్పుడు, ఇప్పుడు కాదు అంటూ కొందరు క్రీడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వయసు మీద పడుతున్నా కొద్ది ఆటపై పట్టు కోల్పోవడం కామన్ విషయం. కానీ విరాట్ కోహ్లీ ఇంకా వయసు చాలా ఉండగానే ఆటపై పట్టు కోల్పోతున్నాడు అంటూ ఆయన అభిమానులు స్వయంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా మ్యాచ్ ల్లో ఫ్లాప్ అవుతున్న విరాట్ కోహ్లీ ముందు ముందు మరిన్ని సవాళ్లను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మొన్న పాకిస్తాన్ పై పర్వాలేదు

Virat Kohli Failed Miserably Match Against Sri Lanka
అనిపించినా తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో దారుణంగా విఫలం అయ్యాడు. అంతకు ముందు మ్యాచ్ ల్లో కూడా ఆయన ఏమాత్రం ఫామ్ లో చూపించలేక పోయాడు. ఇటీవలే కెప్టెన్సీ వదిలేసిన విరాట్ కోహ్లీ త్వరలోనే క్రికెట్ ని కూడా వదిలేయాల్సి వస్తుందేమో అంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో స్టార్ బ్యాట్స్ మెన్స్ గా పేరు దక్కించుకున్న ఎంతో మంది కొన్నాళ్లు ఫామ్ కోల్పోవడంతో క్రికెట్ కి దూరం అవ్వాల్సి వచ్చింది. విరాట్ కోహ్లీ కూడా ఇలాగే దారుణమైన ఫామ్ కొనసాగిస్తే బయటికి వెళ్లాల్సిందేమో అంటున్నారు.
ఆయన వెళ్లకున్నా బీసీసీఐ వెళ్లగొట్టే అవకాశాలు ఉన్నాయంటూ క్రీడా పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విరాట్ కోహ్లీ తన ఆట తీరును మెరుగు పరుచుకొని మునుపటి కోహ్లీని తీసుకురావాలంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాబోయే వరల్డ్ కప్ లో ఆయన ప్రదర్శన అత్యంత కీలకంగా కాబోతుంది.