Viral News : కోహ్లీ, రోహిత్ ని తిట్టాడని స్నేహితుడిని నరికేశాడు
NQ Staff - October 14, 2022 / 10:00 AM IST

Viral News : ఇండియాలో సినిమా స్టార్స్ ని, క్రికెటర్స్ ని అభిమానించే వారు ఏ స్థాయిలో ఉంటారు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మధ్య తమిళ నాడులో స్టార్ హీరోల కోసం కొట్టుకుని చంపుకునే వరకు హీరోల అభిమానులు వెళ్లారు.
ఒకానొక సమయంలో హీరోలకి కూడా చిరాకు కలిగించే అంత అభిమానం ను వారి యొక్క అభిమానులు చూపించడం జరుగుతుంది. ఇక క్రికెట్ స్టార్స్ కి దేశ వ్యాప్తంగా భాషతో సంబంధం లేకుండా అభిమానులు ఉంటారు. ముఖ్యంగా టీమ్ ఇండియా స్టార్స్ విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ లకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ తోనే వారు ఇండియాస్ టాప్ మోస్ట్ హీరోస్ గా నిలిచారు అనడంలో కూడా సందేహం లేదు.
కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న వారిద్దరూ మోస్ట్ పాపులారిటీ దక్కించుకున్న క్రికెటర్స్ జాబితాలో ఉంటారు. తమ అభిమాన క్రికెటర్ ని స్నేహితుడు విమర్శించాడనే ఉద్దేశంతో ఏకంగా ఒక వ్యక్తి నరికి చంపిన సంఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది.
వివరాల్లోకి వెళితే తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి క్రికెట్ గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. వారిద్దరూ క్రికెట్లో అనేక విషయాలని చర్చించారు. ఆ తర్వాత ఒకతను కోహ్లీ మరియు రోహిత్ శర్మ ల గురించి విమర్శించాడట.. దాంతో మరో వ్యక్తి కోహ్లీ మరియు రోహిత్ శర్మ లను విమర్శించే స్థాయి నీది కాదు అంటూ వాగ్వాదానికి దిగాడు.
ఇద్దరి మధ్య గొడవ చిలికి చిలికి పెద్దదయింది.. ఇద్దరు కూడా నువ్వా నేనా అన్నట్లుగా గొడవపడ్డారు. చివరికి ఒక వ్యక్తి మరో వ్యక్తిని నరికి చంపేశాడట. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ లను విమర్శించడంతో తట్టు కోలేకపోయి హత్య చేశాడంటూ పోలీసులు తెలియజేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.