Vijay Mallya And Chris Gayle : బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్‌ను విజయ్ మాల్యా కలిసాడు. ఈ ఇద్దరు కలిసి ఎంతో సరదాగా గడిపినట్టు తెలుస్తుంది. అయితే గేల్‌ను కలిసిన సందర్భంగా మాల్యా జ్ఞాపకాలను పంచుకున్నాడు. తన ట్విటర్‌లో గేల్‌తో కలిసి ఫొటోను షేర్ చేస్తూ.. “నా మంచి స్నేహితుడు, యూనివర్స్ బాస్ క్రిస్టొఫర్ హెన్రీ గేల్‌తో కలవడం చాలా ఆనందంగా ఉంది. అతన్ని నేను ఆర్సీబీలోకి తీసుకున్నప్పటి నుంచే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇప్పటికీ ఇదే అత్యుత్తమ ప్లేయర్ ఎంపిక” అని మాల్యా అన్నాడు.
భేటి వెనుక కారణం..
గేల్, విజయ్ మాల్యా ఘటన సోషల్ మీడియాలో సంచలనం రేపింది.బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ప్రారంభంలో మద్యం వ్యాపారి విజయ్ మాల్యా యాజమాన్యంలో ఉండేది. వెస్టిండీస్ ఓపెనర్ అయిన క్రిస్ గేల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సంవత్సరాలుగా ఆర్సీబీ జట్టు కోసం ఆడి సంచలనం సృష్టించారు.
క్రిస్ గేల్ 2011లో ఆర్సీబీలో చేరాడు. 2017 వరకూ అదే టీమ్‌కు ఆడాడు. 91 మ్యాచ్‌లలో ఏకంగా 3420 రన్స్ చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 154 కాగా.. 5 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. ఇప్పటికీ ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు అయిన 175 రన్స్‌ను గేల్ ఆర్సీబీ తరఫునే చేశాడు. ఈ మధ్యే గేల్ తన మరో ఐపీఎల్ ఓనర్ ప్రీతి జింటాను కూడా కలిశాడు.

గేల్ ఆర్సీబీ జట్టులో ఉన్న సమయంలో లీగ్‌లో ఆధిపత్యం చెలాయించారు. గేల్ 91 గేమ్‌లలో 43.29 సగటుతో, 154.40 స్ట్రైక్ రేట్‌తో 21 అర్ధసెంచరీలు,5 సెంచరీలతో సహా 3420 పరుగులు చేశాడు. గేల్ ఆర్సీబీ కోసం ఆడుతున్నప్పుడు సంచలనాత్మక 175 పరుగులు చేశాడు. ఇది టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు.
- Advertisement -
ఇక 2019లో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ ఛైర్మన్ మాల్యాను భారత్‌కు పంపాల్సి ఉంది.భారతదేశం, యూకే దేశాలు 1992లో మాల్యా అప్పగింత ఒప్పందంపై సంతకం చేశాయి.మాల్యా భారతదేశంలో మోసం మరియు మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.మాల్యా యూకేలో బెయిలుపై రహస్య జీవితం గడుపుతున్నారు. ఏదేమైన మాల్యా, గేల్ కలయిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.