Usain Bolt: ఒలింపిక్ వీరుడి ఖాతా నుండి రూ.103 కోట్లు మాయం
NQ Staff - January 19, 2023 / 09:02 PM IST

Usain Bolt : ఒలింపిక్ వీరుడు ఉసేన్ బోల్ట్ కి మతి పోయేంత పని అయింది. తన పరుగులతో ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న బోల్డ్ కు అతి పెద్ద షాక్ తగిలింది. తన ఖాతాలోని 103 కోట్ల రూపాయలు మాయమవడంతో అతడు షాక్ అయ్యాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే జమైకాకి చెందిన స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ సంస్థలో ఉసేన్ బోల్ట్ యొక్క రిటైర్మెంట్ మరియు లైఫ్ టైం సేవింగ్స్ ఖాతా ఉంది. ఆ ఖాతాలో బోల్ట్ 12.8 మిలియన్ డాలర్లను సేవ్ చేశాడు.
ఇటీవల ఉసేన్ బోల్ట్ ఖాతాలో కేవలం 12 వేల డాలర్లు మాత్రమే చూపించాయి. దాంతో స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ సంస్థ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎంక్వౌయిరీ చేసిన పోలీసులు కంపెనీ మాజీ ఉద్యోగి మోసానికి పాల్పడ్డట్లుగా గుర్తించారు.
పది రోజుల్లోపు ఆ ఉద్యోగి మొత్తం డబ్బుని చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరించారు. మరో వైపు ఉసేన్ బోల్ట్ ఒక్కడి ఖాతాలోనే కాకుండా మొత్తం 30 మంది ఖాతాల్లో భారీ నగదు మాయమైనట్లుగా గుర్తించారు.
ఈ అతి పెద్ద ఆర్థిక లూటీ పై జమైకా ఆర్థిక మంత్రి స్పందిస్తూ సదరు బ్యాంక్ పై చర్యలు తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. అంతే కాకుండా బ్యాంకును ప్రస్తుతానికి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని విధులు నిర్వహిస్తున్నట్లుగా కూడా మంత్రి పేర్కొన్నారు.