Sourav Ganguly : తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ కి మిసెస్ గంగూలీ.. ఫ్యాన్స్ లో టెన్షన్
NQ Staff - October 7, 2022 / 09:50 AM IST

Sourav Ganguly : టీమిండియా మాజీ కెప్టెన్ ప్రస్తుత బీసీసీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భార్య డోనా తీవ్ర అనారోగ్య సమస్యతో కోల్‌కతలోని వుడ్ ల్యాండ్స్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు.
రెండు రోజుల క్రితం ఆమెకు తీవ్రమైన గొంతు నొప్పి మరియు దగ్గు రావడంతో హాస్పిటల్ కి కుటుంబ సభ్యులు తీసుకు వెళ్లారు. కానీ ఆ విషయాన్ని కుటుంబ సభ్యులు మీడియాకు తెలియకుండా గోప్యంగా ఉంచారు.
హాస్పిటల్ వర్గాల నుండి తాజాగా సౌరవ్ గంగూలీ భార్య డోనా గంగోలీ అనారోగ్య విషయమై మీడియాకు లీక్ అయింది. ఆమెకు వైద్యులు పరీక్షలు నిర్వహించి ఆమెకు చికెన్ గున్య వైరస్ సోకినట్లుగా నిర్ధారించారు.
ప్రస్తుతం ఆమెను అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వుడ్ ల్యాండ్స్ హాస్పిటల్ వర్గాల వారు అధికారికంగా ప్రకటించారు.
సౌరవ్ గంగూలీ అభిమానులు ఆమె ఆరోగ్య విషయంలో ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.