Shikhar Dhawan And Rishabh Pant : రోడ్డు ప్రమాదంపై మూడేళ్ళ క్రితమే రిషబ్ పంత్‌ని హెచ్చరించిన శిఖర్ ధావన్.!
NQ Staff - December 31, 2022 / 10:31 AM IST

Shikhar Dhawan And Rishabh Pant : టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
ఈ ఘటన ఎలా జరిగిందన్నదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అతి వేగం, ఆపై నిద్ర మత్తు ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు.
పంత్ ఆ హెచ్చరికని పాటించి వుంటే..
కొన్నాళ్ళ క్రితం.. అంటే, దాదాపు మూడేళ్ళ క్రితం టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్, రిషబ్ పంత్కి ఓ సలహా ఇచ్చాడు. అది కూడా పంత్ అడగడంతోనే. ‘నాకు సీనియర్‌గా నువ్విచ్చే సలహా ఏంటి భయ్యా..’ అని అడిగాడు రిషబ్ పంత్, శిఖర్ ధావన్‌ని.
‘వాహనాన్ని జాగ్రత్తగా నడుపు..’ అని సలహా ఇచ్చాడు శిఖర్ ధావన్. ఇది జరిగి మూడేళ్ళవుతోంది. ఒకవేళ పంత్ గనుక, శిఖర్ ధావన్ ఇచ్చిన సలహాని పాటించి వుంటే, ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదంటూ.. ఆ పాత వీడియోని ప్రస్తావిస్తూ రిషబ్ పంత్ మీద కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.
పెద్దల మాట.. చద్దన్నం మూట.. అని ఊరకే అన్లేదు మరి.! మైదానంలో దూకుడు సరే.. రోడ్లపై దూకుడేంటి రిషబ్ పంత్.?