Virat Kohli : అంతా బ్రాంతియేనా.. విరాట్ కోహ్లీ ఫామ్‌పై కొనసాగుతున్న విమ‌ర్శ‌ల వ‌ర్షం

NQ Staff - July 15, 2022 / 06:54 PM IST

Virat Kohli : అంతా బ్రాంతియేనా.. విరాట్ కోహ్లీ ఫామ్‌పై కొనసాగుతున్న విమ‌ర్శ‌ల వ‌ర్షం

Virat Kohli : ప‌రిస్థితులు ఎప్పుడు ఒక‌లా ఉండ‌వు. ఓడ‌లు బండ్లు, బండ్లు ఓడ‌లు అవుతాయ‌నే నానుడి మ‌నంద‌రికి తెలుసు. ఒక‌ప్పుడు భార‌త క్రికెట్‌ని శాసించిన విరాట్ కోహ్లీ ప‌రిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. ఫామ్‌లేమితో నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. అభిమానుల‌తో పాటు సీనియ‌ర్ క్రికెట‌ర్స్ కోహ్లీపై విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతున్నారు. అర్ధ సెంచ‌రీ కూడా చేయ‌లేని ప‌రిస్థితిలో కోహ్లీ ఉండ‌గా, ఆయ‌న‌ని ఇంకా ఎందుకు ఆడిస్తున్నారు అంటూ కొంద‌రు మాజీలు మండి ప‌డుతున్నారు.

ఫామ్ అందుకోడా?

ఇంగ్లండ్ సిరీస్‌లోను కోహ్లీ ఫామ్ దారుణంగా ఉంది. ఆయ‌న ఆట తీరు నిరాశ‌ప‌రుస్తుంది. టెస్ట్ మ్యాచ్‌లో త‌క్కువ స్కోర్‌లు చేసిన కోహ్లీ.. టీ 20లోను రాణించ‌లేక‌ పోయాడు. ఇక గాయం కార‌ణంగా తొలి వ‌న్డే ఆడ‌లేక‌పోయిన విరాట్ రెండో వన్డేకి బ‌రిలో దిగాడు. ఫీల్డింగ్ స‌మ‌యంలో చాలా ఉత్సాహంగా క‌నిపించిన ఇత‌గాడు బ్యాటింగ్‌కి వ‌చ్చే స‌రికి తుస్సుమ‌నిపించాడు.

ఇండియా 247పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి ఆదిలోనే దెబ్బతింది. టోప్లే, డేవిడ్ విల్లీ తొలి స్పెల్లోనే అదరగొట్టారు. వీరిద్దరు స్వింగ్ బౌలింగ్‌తో ఇండియా టాపార్డర్‌ను కూల్చారు. వీరి దెబ్బకు 31పరుగులకే ఇండియా 4వికెట్లు కోల్పోయింది. 3వ ఓవర్లో టోప్లే బౌలింగ్లో రోహిత్ (0) ఎల్బీడబ్ల్యూగా డకౌట్ అయిపోయాడు. రివ్యూ తీసుకున్నా నిరాశే మిగిలింది. ఇక టోప్లే బౌలింగ్లో ఫోర్ కొట్టిన ధావన్ (9) వైడ్ బంతిని అనవసరంగా టచ్ చేయడంతో కీపర్ క్యాచ్ ఔటయ్యాడు.

Senior cricketers Are Increasingly Criticizing Virat Kohli

Senior cricketers Are Increasingly Criticizing Virat Kohli

ఆ తర్వాత 4వ స్థానంలో బరిలోకి వచ్చిన రిషబ్ పంత్ (0).. బ్రైడన్ కార్స్ వేసిన బౌలింగ్లో లూజ్ షాట్ ఆడి మిడాఫ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. ఇక ఆ తర్వాత డేవిడ్ విల్లీ బౌలింగ్లో కోహ్లీ (16పరుగులు 25బంతుల్లో 3ఫోర్లు) కూడా ఎప్పటిలాగే వైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను కవర్స్‌లో ఆడబోయి కీపర్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

ఈ మ్యాచ్‌లో అయిన అద్భుతంగా రాణించి విమ‌ర్శ‌కుల నోళ్లు మాయిస్తాడ‌ని అంద‌రు అనుకున్న‌ప్ప‌టికీ, ఇలా వ‌చ్చి అలా వెళ్లాడు. చూస్తుంటే రానున్న మ్యాచ్‌ల‌లో కోహ్లీ స్థానం ప‌దిలంగా ఉండ‌క‌పోవ‌చ్చనే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. . కొన్నాళ్లుగా విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేకపోవడం అతనికి తీవ్ర ప్రతికూల అంశంగా మారింది. కొందరు కోహ్లీని జట్టు నుంచి తప్పించాలనే ప్రతిపాదన చేసేంత వరకూ పరిస్థితి వెళ్లింది. కెప్టెన్ రోహిత్ శర్మ అలాంటి సమయంలో కోహ్లీకి అండగా నిలిచాడు.

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us