IPL Fans : ఐపీఎల్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఇక రెండున్న‌ర నెల‌ల ఎంట‌ర్‌టైన్‌మెంట్

NQ Staff - June 30, 2022 / 04:55 PM IST

IPL Fans : ఐపీఎల్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఇక రెండున్న‌ర నెల‌ల ఎంట‌ర్‌టైన్‌మెంట్

IPL Fans : క్రికెట్ ప్రేమికుల‌కి ఐపీఎల్ మస్త్ మ‌జా అందిస్తున్న విష‌యం తెలిసిందే. ప్రపంచంలోని అతిపెద్ద ఫ్రాంచైజీ ఆధారిత క్రికెట్ టోర్నమెంట్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ అభిమానులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెక్రెటరీ జై షా గుడ్‌న్యూస్‌ అందించారు. ఐపీఎల్ 2023ని 75 రోజుల పాటు (రెండున్నర నెలలు) నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేశారు.
75 రోజుల సంద‌డి..

Secretary Jai Shah Gave Good News IPL Fans

Secretary Jai Shah Gave Good News IPL Fans

ఇందుకోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అనుమతి పొందేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని, ఈ ప్రతిపాదనకు ఐసీసీ కూడా సానుకూలంగానే ఉందన్నారు. ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్లానింగ్ జాబితాలో ఈ ప్రతిపాదనను చేరుస్తామని జై షా తెలిపారు. అయితే కొత్త ఫ్రాంచైజీలను తీసుకొచ్చే ఆలోచన లేదన్నాడు. ప్రస్తుతం ఉన్న జట్లతోనే మ్యాచ్‌ల సంఖ్యతో పాటు ఆటగాళ్ల సంఖ్యను పెంచనున్నట్టు తెలిపాడు.

ఐపీఎల్ టోర్నీని విస్తరించే క్రమంలో ఆట నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ఇందుకోసం క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తాం. అత్యుత్తమ మౌలిక సదుపాయాలను అందించడమే కాకూండా.. ఇతర అంశాలపై దృష్టి పెడతాం. బీసీసీఐ అంతర్జాతీయ క్రికెట్‌కు కట్టుబడి ఉంటుంది. ఇంగ్లండ్ లేదా ఆస్ట్రేలియా లాంటి జట్లతో మాత్రమే కాకూండా ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలకు ద్వైపాక్షిక పర్యటనలతో సహాయం చేయడానికి మేము ఒక సమగ్ర క్యాలెండర్‌ను రూపొందించాలనుకుంటున్నాము’ అని జై షా చెప్పుకొచ్చారు

Secretary Jai Shah Gave Good News IPL Fans

Secretary Jai Shah Gave Good News IPL Fans

2024-2031 ఫ్యూచర్‌ టూర్స్‌ ప్రోగ్రామ్‌పై చర్చించేందుకు ఐసీసీ వచ్చే వారం సమావేశం కానుంది. ఈ సమావేశాల్లో ఐపీఎల్‌ విండో విస్తరణపై పూర్తి క్లారిటీ రానుందని తెలిపాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల సంఖ్య 8 నుంచి 10కి పెంచారు. అలాగే క్యాష్‌ రిచ్‌ లీగ్‌ 2 నెలల పాటు సాగాయి. ఐపీఎల్‌ 2022లో మ్యాచ్‌ల సంఖ్య 74కు పెరిగింది. రానున్న సీజన్‌లలో ఈ సంఖ్య 94కు పెరిగే అవకాశం ఉంది. 2024-2031 FTP క్యాలెండర్‌ను వచ్చే నెలలో పాలక ICC చర్చించే అవకాశం ఉంది.

మీడియా హక్కుల వేలం తర్వాత ఐపీఎల్ మరింత విస్తరించింది. తద్వారా ప్రపంచంలోనే రెండవ అత్యంత ప్రతిష్టాత్మకమైన లీగ్‌గా అవతరించింది. ఐపీఎల్‌ను మరింత విస్తరించడం ద్వారా ప్రతిభ నాణ్యతలో రాజీ లేకుండా టాలెంట్ ను ప్రోత్సహించడం, అట్టడుగు వర్గాలను బలోపేతం చేయడం, సరైన మౌలిక సదుపాయాలను నిర్మించడం వంటి అనేక ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది.

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us