Ravindra Jadeja : వారిద్దరి మధ్య కోల్డ్‌ వార్‌ ఇంకా కొనసాగుతుందా?

NQ Staff - September 30, 2022 / 09:26 AM IST

Ravindra Jadeja : వారిద్దరి మధ్య కోల్డ్‌ వార్‌ ఇంకా కొనసాగుతుందా?

Ravindra Jadeja : 2019 వన్డే ప్రపంచ కప్ సమయంలో రవీంద్ర జడేజా బౌండరీ లైన్ వద్ద ఒక అద్భుతమైన డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. ఆ సమయంలో కామెంట్ బాక్స్ లో ఉన్న సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ రవీంద్ర జడేజా గురించి కాస్త వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

రవీంద్ర జడేజా అరకొర ఆటగాడు, అతడు బౌలింగ్ చేయడం చేతకాదు… అలా అని బ్యాట్స్మెన్ కూడా కాదు అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారంనే రేపాయి అనడంలో సందేహం లేదు. మ్యాచ్ తర్వాత స్పందిస్తూ సంజయ్ మంజ్రేకర్ నీ యొక్క నోరు అదుపులో పెట్టుకో.. నీకంటే ఎక్కువ మ్యాచులు భారత్ తరపున నేనే ఆడాను ఆ విషయం తెలుసుకో అన్నట్లుగా రిప్లై ఇచ్చాడు. అప్పటి నుండి కూడా ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది.

ఇద్దరు ఏదో ఒక సమయంలో డైరెక్ట్ గా లేదా ఇన్ డైరెక్ట్ గా విమర్శలు చేసుకుంటున్నారు. మళ్లీ ఇటీవల పాకిస్తాన్ తో మ్యాచ్ లో 35 పరుగులు చేసిన జడేజా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సమయంలో జడేజాతో మ్యాచ్ ప్రజెంట్ గా వ్యవహరించిన సంజయ్ మాట్లాడాల్సి వచ్చింది.

అప్పుడు నాతో మాట్లాడటం నీకు ఓకేనా అంటూ సంజయ్‌ మంజ్రేకర్‌ ప్రశ్నించగా.. నిస్సందేహంగా అంటూ జడేజా సమాధానమిచ్చాడు.ఇప్పుడు మళ్లీ జడేజా ట్విట్టర్ లో మై డియర్ ఫ్రెండ్ సంజయ్ మంజ్రేకర్ ని టీవీలో చూస్తున్నాను అంటూ ఈ ఫోటోను షేర్ చేశాడు, దీన్ని బట్టి చూస్తుంటే వీరిద్దరి మధ్య ఇంకా కోల్డ్ వార్ కొనసాగుతున్నట్లుగానే అనిపిస్తుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Sanjay Manjrekar Ravindra Jadeja Cold War

Sanjay Manjrekar Ravindra Jadeja Cold War

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us