Sam Northeast : సెన్సేషన్ క్రియేట్ చేసిన ఇంగ్లండ్ క్రికెటర్.. ఆ ఒక్కేడ 410 పరుగులు బాదాడు..!
NQ Staff - July 24, 2022 / 05:41 PM IST

Sam Northeast : టెస్ట్ క్రికెట్లోనే నాలుగు వందల పరుగులు రాబట్టడానికి 11 మంది బ్యాట్స్‌మెన్స్ నానా కష్టాలు పడుతుంటారు. అలాంటిది ఒక్క బ్యాట్స్‌మెన్ ఏకంగా 400 పరుగులు చేశాడంటే ఇది వండర్ అనే చెప్పాలి. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అరుదైన రికార్డ్ నమోదు చేశాడు ఇంగ్లండ్ లోని గ్లామోర్గాన్ జట్టు ఆటగాడు సామ్ నార్త్ ఈస్ట్. లీస్టర్ షైర్ తో మ్యాచ్ లో 450 బంతుల్లో 410 పరుగులు చేశాడు.
మెరుపు ఇన్నింగ్స్..

Sam Northeast Player For Glamorgan in England
400లకు పైగా పరుగులు బాదడమే కాదు నాటౌట్ గా నిలిచి వారెవ్వా అనిపించాడు. అతడి స్కోర్ లో 45 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. దీంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అత్యధిక స్కోర్ చేసిన టాప్ 10 ఆటగాళ్ల జాబితాలో సామ్ చేరాడు. తొలి స్థానంలో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఉన్నాడు. 1994లో వార్విక్ షైర్ తరఫున లారా 501 రన్స్ చేశాడు.
అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు లారా పేరిటే ఉంది. 2004లో ఇంగ్లండ్‌పై అంటింగ్వా వేదికగా లారా 400 పరుగులు నాటౌట్ చేశాడు. టెస్టుల్లో ఏకైక క్వాడ్రపుల్ సెంచరీ(400) లారా పేరు మీద ఉండడం విశేషం. సామ్ నార్త్ఈస్ట్కు జతగా జి.కూక్ 227 బంతుల్లో 191 నాటౌట్ రాణించడంతో గ్లోమోర్గాన్ తొలి ఇన్నింగ్స్‌ను 5 వికెట్ల నష్టానికి 795 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది..